శ్రీవాణి ట్రస్టు ఆరోపణలపై టీటీడీ ఈవో స్పందన

శ్రీవాణి ట్రస్ట్ నిధులపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని టీటీడీ ఈవో ధర్మారెడ్డి మండిపడ్డారు. దీనివెనుక రాజకీయ కోణం ఉందని అనుమానం వ్యక్తం చేశారు. నిధులు ఎలాంటి దుర్వినియోగానికి గురికావడం లేదని స్పష్టం చేశారు. నిజానిజాలు తెలుసుకోకుండా శ్రీవాణి ట్రస్ట్ గురించి ప్రచారం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

New Update
శ్రీవాణి ట్రస్టు ఆరోపణలపై టీటీడీ ఈవో స్పందన

Allegations on Srivani Trust Donations

ఆరోపణలో వాస్తవం లేదు

తిరుమల శ్రీవాణి ట్రస్టు విరాళాలపై వస్తున్న ఆరోపణలపై టీటీడీ ఈవో ధర్మారెడ్డి స్పందించారు. గురువారం మీడియాతో మాట్లాడుతూ... శ్రీవాణి ట్రస్టు ద్వారా ఇప్పటి వరకూ రూ.860 కోట్లను దాతలు సమర్పించారని తెలిపారు. శ్రీవాణి ట్రస్టు నిధులు ఎక్కడా దుర్వినియోగం కావడం లేదని చెప్పారు. ఇప్పటి వరకూ 8,24,400 మంది భక్తులు శ్రీవాణి ట్రస్టు ద్వారా దర్శనం చేసుకున్నారన్నారు. గత నాలుగేళ్లుగా శ్రీవాణి ట్రస్ట్ ద్వారా ప్రతి రోజూ వెయ్యి మంది దర్శనం చేసుకుంటున్నారని చెప్పారు. 2018లో శ్రీవాణి ట్రస్ట్ ప్రారంభం అయ్యిందని.. అమరావతిలో రూ.150 కోట్లతో ఆలయం నిర్మించడానికి విరాళాల సేకరణ కోసం ట్రస్టుని ప్రారంభించినట్లు తెలిపారు. ఆ సమయంలో ఆశించినంత విరాళాల రాలేదన్నారు. శ్రీవాణి ట్రస్టు నిధులు దుర్వినియోగం అంటూ చేస్తున్న ఆరోపణల ద్వారా భక్తులు భగవంతునిపై నమ్మకం కోల్పోయే అవకాశం ఉందని అన్నారు. హిందూ ధర్మాన్ని పరిరక్షించాలని ఈవో ధర్మారెడ్డి కోరారు.

కఠిన చర్యలు ఉంటాయి జాగ్రత్త

కాగా.. శ్రీవాణి ట్రస్ట్‌పై ఇటీవల శ్రీవాణి ట్రస్ట్ టికెట్ల విషయంలో అవకతవకలు జరుగుతున్నాయని టీడీపీ అధినేత చంద్రబాబు ఆరోపణలు గుప్పించిన విషయం తెలిసిందే. శ్రీవాణి టికెట్లు తీసుకుంటే రసీదు ఇవ్వడం లేదని.. ఆ డబ్బులు ఎక్కడి వెళ్తున్నాయని ప్రశ్నించారు. తిరుమల శ్రీవారికి అపచారం చేస్తే పుట్టగతులు ఉండవంటూ చంద్రబాబు ఆరోపణలు చేశారు. దీనిపై టీడీపీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి స్పందిస్తూ... రాజకీయ కారణాలతో టీటీడీపై పలువురు అసత్య ఆరోపణలు చేస్తున్నారని సుబ్బారెడ్డి మండిపడ్డారు. శ్రీవాణి నిధులు ఎక్కడికీ పోలేదని... దాత ఇచ్చిన ప్రతీ రూపాయికి రసీదు ఇస్తున్నామని చెప్పారు. శ్రీవాణి ట్రస్టుపై అసత్య ఆరోపణలు చేస్తున్న నాయకులపై చట్ట పరమైన చర్యలు తీసుకుంటామని, కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకుంటామని వైవీ సుబ్బారెడ్డి హెచ్చరించారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు