కాళేశ్వరం ప్రాజెక్టుతో తెలంగాణ ప్రజల సొమ్ము మేఘా కృష్ణారెడ్డి పాలైందని నిత్యం విమర్శలు వస్తున్న విషయం తెలిసిందే. తెలంగాణలో ప్రాజెక్టుల పేరిట వేల కోట్లు దోచుకున్న మేఘా సంస్థ చేసిన దారుణాలు ఒక్కొక్కటిగా బయటకొస్తున్నాయి. కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్(Kaleshwaram Lift Irrigation Projet) ప్రాజెక్టులోనే ప్రభుత్వ సహకారంతో మేఘా కృష్ణారెడ్డి వేల కోట్ల ప్రజాసొమ్మును దోచుకున్నారన్న ఆరోపణలు బలపడేలా అనేక వార్తలు నిత్యం వస్తూనే ఉన్నాయి. ఈ ప్రాజెక్టు నిర్మాణంలో భాగంగా మేఘా ఇంజనీరింగ్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ (MEIL)(Megha engineering and infrastructures) దాదాపు రూ.50 వేల కోట్ల అవినీతి సొమ్మును తన జేబులో వేసుకుందని ఇప్పటికే అనేక సార్లు స్పష్టమవగా.. తాజాగా మరో విషయం వెలుగులోకి వచ్చింది.
కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్(కెఎల్‌ఐఎస్) కింద మూడు బ్యారేజీలు మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల ఉన్న విషయం తెలిసిందే. 2019 వరదల సమయంలో ఈ బ్యారేజీలు దెబ్బతిన్నాయి. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం రహస్యంగా మరమ్మతు వ్యయాన్ని భరించినట్టు సమాచారం. ఈ అంచనా విలువ రూ. 500 కోట్లు. నిబంధనల ప్రకారం ఈ ఖర్చు భరించేందుకు మేఘా సంస్థ అందుకు నిరాకరించిందా? లేకపోతే నాటి బీఆర్‌ఎస్ ప్రభుత్వం ఈ ఖర్చును ఎందుకు భరించాల్సి వచ్చింది? అన్న ప్రశ్న తలెత్తుతోంది. నాటి ప్రభుత్వ పెద్దలను, అధికారులను మేనేజ్ చేసి మేఘా సంస్థ ఈ డబ్బులను మింగిందని ఈ విషయం పరిశీలిస్తే స్పష్టం అవుతోంది.
ఖర్చు ఎవరు భరించాలి?
నవంబర్ 2019, వరదల తరువాత, బ్యారేజీల దిగువన ఉన్నసీసీ కర్టెన్ వాల్స్, సీసీ బ్లాక్‌లు తో పాటు మరొకొన్ని నిర్మాణాలు కొట్టుకుపోయినట్లు కనుగొన్నారు. మేడిగడ్డ వద్ద రూ.83 కోట్లు, అన్నారం వద్ద రూ.65 కోట్లు, సుందిళ్ల వద్ద రూ.32 కోట్లు నష్టం వాటిల్లిందని అప్పటి ప్రభుత్వం రూ.180 కోట్లు ఖర్చు చేసింది. మరమ్మతులకు రూ.500 కోట్లు ఖర్చవుతుందని అంచనా వేసింది. నిర్మాణ పనుల్లో లోపాల కారణంగానే ఈ నష్టం జరిగిందని కాగ్ నివేదిక స్పష్టం చేసింది.
అబద్ధం చెప్పారా?
గత అక్టోబరులో మేడిగడ్డ బ్యారేజీలో పైర్లు మునగడం సాధారణ పరిణామమని, ఆ తర్వాత కూడా అప్పటి మంత్రులు కేటీఆర్,హరీష్‌రావులు రాష్ట్ర ప్రభుత్వం మరమ్మతులకు రూపాయి ఖర్చు చేయదని హామీ ఇవ్వడం విడ్డూరంగా అనిపిస్తోందని ప్రతిపక్షాలు అంటున్నాయి. 2019లో మూడు బ్యారేజీలకు వరద నష్టాన్ని కప్పిపుచ్చుతూ, అక్టోబర్‌లో జరిగిన నష్టాన్ని సరిదిద్దడానికి కాంట్రాక్టు ఏజెన్సీలే ఖర్చును భరిస్తాయని వారు చాలాసార్లు బహిరంగంగా ప్రకటించారు.
అధ్యయనం చేయలేదు:
కాంగ్రెస్ ప్రభుత్వం మేడిగడ్డ బ్యారేజీ మునిగిపోవడానికి గల కారణాలను కనుగొనడానికి అధ్యయనాల అంచనా వ్యయాన్ని ఇంకా వెల్లడించలేదు. ఇక వివరణాత్మక అధ్యయనాలు నిర్వహించకుండా 50 టీఎంసీ ft (వెయ్యి మిలియన్ క్యూబిక్ అడుగులు) నిల్వ సామర్థ్యంతో KLIS కింద అతిపెద్ద రిజర్వాయర్ అయిన మల్లన్నసాగర్‌ను నిర్మించడం ఘోర తప్పిదాన్ని కాగ్ ఎత్తి చూపింది. అవసరమైన పరిశోధనలు, అధ్యయనాలు నిర్వహించకుండా అనవసరమైన హడావిడిగా రిజర్వాయర్‌ను నిర్మించారని పేర్కొంది.
Also Read: గ్రౌండ్‌లో విషాదం.. తలకు బాల్ తగిలి క్రికెటర్ మృతి!
WATCH: