APPSC Group 2 Notification: నేడే 900లకు పైగా పోస్టులతో గ్రూప్-2 నోటిఫికేషన్.. నిరుద్యోగులకు జగన్ సర్కార్ అదిరిపోయే శుభవార్త!

ఏపీలో లక్షలాది మంది నిరుద్యోగ యువత వేయి కళ్లతో ఎదురుచూస్తున్న నోటిఫికేషన్‌కు వేళైంది. గురువారం అర్ధరాత్రిలోగా వారు శుభవార్త వినబోతున్నట్లు తెలుస్తోంది. గతంలో పేర్కొన్నట్టుగానే పెద్దసంఖ్యలో పోస్టులతో గ్రూప్‌ 2 ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్‌ వెలువరించబోతున్నట్లు విశ్వసనీయ సమాచారం.

New Update
APPSC Group 2 Notification: నేడే 900లకు పైగా పోస్టులతో గ్రూప్-2 నోటిఫికేషన్.. నిరుద్యోగులకు జగన్ సర్కార్ అదిరిపోయే శుభవార్త!

APPSC Group 2 Notification: ఆంధ్రప్రదేశ్‌లో లక్షలాది మంది నిరుద్యోగ యువత ఎప్పుడెప్పుడా అని వేయి కళ్లతో ఎదురుచూస్తున్న నోటిఫికేషన్‌కు వేళైంది. గురువారం అర్ధరాత్రిలోగా రాష్ట్రప్రభుత్వం నుంచి అభ్యర్థులు శుభవార్త వినబోతున్నట్లు తెలుస్తోంది. ఏపీపీఎస్సీ (APPSC) గతంలో పేర్కొన్నట్టుగానే పెద్దసంఖ్యలో పోస్టులతో గ్రూప్‌ 2 ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్‌ వెలువరించబోతున్నట్లు విశ్వసనీయ సమాచారం. ఇటీవలే ప్రభుత్వం పలు ఉద్యోగాల భర్తీకి సిద్ధమైన విషయం తెలిసిందే. పలు నోటిఫికేషన్లు ఇప్పటికే వెలువడగా, తాజాగా గ్రూప్ 2 (APPSC Group 2) నోటిఫికేషన్ పై ఏపీపీఎస్సీ స్పష్టమైన సంకేతాలిచ్చింది.

ఇది కూడా చదవండి: 100 వెబ్ సైట్లను బ్లాక్ చేసిన కేంద్రం.. ఎందుకంటే!

ఆంధ్రప్రదేశ్‌లో వివిధ ప్రభుత్వ శాఖల్లో 900కు పైగా ఉద్యోగాలను గ్రూప్‌ 2 పరీక్ష ద్వారా భర్తీ చేసేందుకు గురువారం అర్ధరాత్రి లోగా నోటిఫికేషన్‌ వెలువరించే అవకాశం ఉంది. ఈ మేరకు ఏపీపీఎస్సీ సభ్యుడు పరిగె సుధీర్‌ ట్విట్టర్‌లో పోస్ట్‌ షేర్‌ చేశారు. నియామక ప్రక్రియను త్వరగా ప్రారంభించి వీలైనంత తొందరలో పూర్తిచేసేలా చర్యలు తీసుకుంటామని, తమ కలను నెరవేర్చుకునేందుకు అభ్యర్థులు సిద్ధంగా ఉండాలని ఆయన తన సందేశంలో సూచించారు.

ఇదిలా ఉంటే, కోర్టు క్లియరెన్స్ ఇవ్వడంతో బుధవారం రాత్రి ఎస్సై పరీక్షల ఫలితాలు వెలువడ్డాయి. తాజాగా గ్రూప్ 2 నోటిఫికేషన్ కోసం ఏపీపీఎస్సీ సిద్ధమైనట్లు తెలుస్తుండగా, త్వరలోనే గ్రూప్ 1 నోటిఫికేషన్ కూడా వచ్చే అవకాశం ఉంది.

Advertisment
తాజా కథనాలు