టీమ్ ఇండియాకు షాక్..మెగాటోర్నీ నుంచి హార్దిక్ పాండ్యా అవుట్

విజయాలతో దూసుకుపోతున్న టీమ్ ఇండియాకు గట్టి షాక్ తగిలింది. మెగా టోర్నీ నుంచి ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా వైదొలిగాడు. కాలి చీలమండకి గాయం మానకపోవడంతో వరల్డ్‌ కప్‌కు దూరం అవుతున్నాడు. ఇతని ప్లేస్ లో పేసర్ ప్రసిద్ధ కృష్ణ వస్తున్నాడు.

New Update
టీమ్ ఇండియాకు షాక్..మెగాటోర్నీ నుంచి హార్దిక్ పాండ్యా అవుట్

భారత క్రికెట్ జట్టుకు పెద్ద దెబ్బ తగిలింది. నెక్స్ట్ మ్యాచ్ కు అయినా వస్తాడు అని ఎదురు చూస్తున్న ఆల్ రౌండర్ ఇక రావడం లేదు. కాలి చీలమండ గాయం కాణంగా మెగా టోర్నీ నుంచి వైదొలగుతున్నాడని ఐసీసీ ప్రకటించింది. ఇతని స్థానంలో పేసర్ ప్రసిద్ధ కృష్ణను టీమ్ ఇండియా మేనేజ్‌మెంట్ భర్తీ చేసింది. ఇదే వరల్డ్ కప్‌లో బంగ్లాదేశ్‌తో బంతిని ఆపేందుకు ప్రయత్నించగా హార్దిక్‌కు గాయం అయింది. మొదట మూడు మ్యాచ్‌లకు మాత్రమే దూరంగా ఉంటాడని టీమ్ మేనేజ్‌మెంట్ చెప్పింది. కానీ గాయం తీవ్రంగా ఉండడంతో అతనికి విశ్రాంతి ఇవ్వాలని నిర్ణయించింది.

publive-image

Also Read:సెంటిమెంట్ కంటిన్యూస్…కోనాయిపల్లి గుడికి సీఎం కేసీఆర్

వరల్డ్‌కప్‌లో టీమ్ ఇండియా వరుస విజయాలతో దూసుకుపోతోంది. బ్యాటర్లు, బౌలర్లు సమిష్టిగా రాణిస్తూ అద్భుతాలను చేస్తున్నారు. అయితే ఇప్పుడు భారత జట్టుకు భారీ షాక్ తగిలింది. ఆల్ రౌండర్ హార్ధిక్ పాండ్యా దూరమవ్వడం టీమ్ ఇండియాకు పెద్ద దెబ్బే అని చెప్పవచ్చును. ఇప్పుడు హార్దిక్ స్థానంలో పేసర్ ప్రసిద్ధ కృష్ణను తీసుకున్నారు. కానీ ఆల్ రౌండర్ స్థానాన్ని మాత్రం భర్తీ చేయలేకపోయారు. ఇది టీమ్ ఇండియాకు పెద్ద లోటే అని చెప్పవచ్చును.

ప్రస్తుతం వరల్డ్‌కప్‌లో భారత్ ఏడు మ్యాచుల్లోనూ గెలిచి పాయింట్ల పట్టికలో టాప్‌లో ఉంది. అలాగే సెమీస్ బెర్తును కూడా ఖరారు చేసేసుకుంది. అయితే లీగ్ దశలో టీమ్ ఇండియాకు మరో రెండు మ్యాచ్‌లు మిగిలే ఉన్నాయి. రేపు ఆదివారం కోలకత్తాలో దక్షిణాఫ్రికాతో తలపడనుంది. అయితే ఇప్పుడు హార్దిక్ దూరమవ్వడం సెమీస్ లో అడుగుపెట్టిన భారత్ కు నిరాశ కలిగించే వార్తే.

Also Read:ఆసుపత్రి మీద దాడి చేసిన ఇజ్రాయెల్..15 మంది మృతి

Advertisment
Advertisment
తాజా కథనాలు