Ponnam Prabhakar: మంత్రి పొన్నం‌కు షాక్

TG: మంత్రి పొన్నం ప్రభాకర్‌కు అలిగిరెడ్డి ప్రవీణ్ రెడ్డి షాక్ ఇచ్చారు. కరీంనగర్ ఎంపీ అభ్యర్థిగా నామినేషన్ వేశారు. ఇప్పటికే పొన్నం మద్దతుతో కాంగ్రెస్ తరపున వెలిచాల రాజేందర్ రావు నామినేషన్ వేశారు. కాగా కరీంనగర్ అభ్యర్థిని కాంగ్రెస్ ఇంకా ప్రకటించలేదు.

New Update
Ponnam Prabhakar: మంత్రి పొన్నం‌కు షాక్

Aligireddy Praveen Reddy: మంత్రి పొన్నం ప్రభాకర్‌కు అలిగిరెడ్డి ప్రవీణ్ రెడ్డి షాక్ ఇచ్చారు. కరీంనగర్ పార్లమెంట్ స్థానానికి అలిగిరెడ్డి ప్రవీణ్ రెడ్డి నామినేషన్ వేశారు. అలిగిరెడ్డి తరపున ఆయన అనుచరులు నామినేషన్ వేశారు. ఇప్పటికే కాంగ్రెస్ తరపున వెలిచాల రాజేందర్ రావు నామినేషన్ వేశారు. కాగా వెలిచాల రాజేందర్‌ రావుకు మంత్రి పొన్నం ప్రభాకర్ మద్దతు తెలిపారు. ఇదిలా ఉంటే కరీంనగర్ ఎంపీ అభ్యర్థిని కాంగ్రెస్ అధిష్టానం అధికారికంగా ప్రకటించలేదు.

అలిగిరెడ్డి ఆవేదన..

కాంగ్రెస్‌ నేత, హుస్నాబాద్‌ మాజీ ఎమ్మెల్యే అలిగిరెడ్డి ప్రవీణ్‌ రెడ్డి కాంగ్రెస్ పార్టీపై అలిగారు. గత కొన్ని రోజులుగా కరీంనగర్‌ పార్లమెంట్ టికెట్ వెలిచాలకే ఇస్తారన్న ప్రచారం జోరుగా సాగడంతో.. తనకు టికెట్ రాదేమోలే అని అసంతృప్తిగా ఉన్నారు. అసెంబ్లీ ఎన్నికల టైంలో మంత్రి పొన్నం ప్రభాకర్‌ కోసం తన సీటును త్యాగం చేశారు అలిగిరెడ్డి. తనకోసం ఎమ్మెల్యే టికెట్ త్యాగం చేసిన అలిగిరెడ్డికి ఎంపీ టికెట్ ఇప్పిస్తానంటూ పొన్నం ప్రభాకర్‌ మాట ఇచ్చినట్లు సమాచారం.

ఇప్పుడు వెలిచాల పేరు తెరపైకి తీసుకురావడంతో అలిగిరెడ్డి అసహనం వ్యక్తం చేస్తున్నారు. కాగా తనకు కాకుండా వేరే వాళ్లకు కరీంనగర్ ఎంపీ టికెట్ ఇస్తే కాంగ్రెస్‌ పార్టీని వీడేందుకు అలిగిరెడ్డి ప్రవీణ్ రెడ్డి సిద్దమైనట్లు తెలుస్తోంది. ఒకవేళ ఆయన కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తే బీజేపీలో చేరుతారని కరీంనగర్ కాంగ్రెస్ పార్టీలో గుసగుసలు నడుస్తున్నాయి. మరి మంత్రి అయ్యేందుకు పొన్నం ప్రభాకర్ కు సాయం చేసిన ప్రవీణ్ రెడ్డికి కాంగ్రెస్ హైకమాండ్ ఎంపీ టికెట్ ఇస్తుందా? లేదా హ్యాండ్ ఇస్తుందా? అనేది వేచి చూడాలి

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు