Food poison: యూనివర్సిటీ హాస్టల్ లో ఫుడ్ పాయిజినింగ్..300 మంది విద్యార్థినులకు అస్వస్థత! అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీ క్యాంపస్(Muslim university campus) లోని లేడీస్ హాస్టల్ లో మంగళవారం రాత్రి భోజనం చేసిన తరువాత వాంతులు, ఇతర అనారోగ్య కారణాలతో 300 మంది విద్యార్థినులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. By Bhavana 19 Oct 2023 in క్రైం నేషనల్ New Update షేర్ చేయండి లక్నోలోని ఓ యూనివర్సిటీ హాస్టల్ లో ఫుడ్ పాయిజనింగ్ (Food poison) జరగడంతో 300 మంది విద్యార్థినులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఉత్తరప్రదేశ్‌లని అలీగఢ్‌లో ఈ విషాదకర ఘటన చోటు చేసుకుంది. అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీ క్యాంపస్(Muslim university campus) లోని లేడీస్ హాస్టల్ లో మంగళవారం రాత్రి భోజనం చేసిన తరువాత వాంతులు, ఇతర అనారోగ్య కారణాలతో 300 మంది విద్యార్థినులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. అలీఘడ్ లోని ముస్లిం యూనివర్సిటీ లేడీస్ హాస్టల్ లో సుమారు 1500 మంది విద్యార్థినులు ఉన్నారు. ఎప్పటిలాగానే గత రాత్రి కూడా వారంతా భోజనం చేసి హాస్టల్ కి వెళ్లి పోయారు.కొద్ది సేపటి తరువాత విద్యార్థినులు అందరూ ఒక్కసారిగా వాంతులు చేసుకుంటూ అస్వస్థతకు గురయ్యారు. Also read: నాసాను తోసి..రోదసీలో ఇస్రో జెండా పాతేంగే..రానున్న 20 ఏళ్ల లక్ష్యాలివే..!! క్రమక్రమంగా వారి సంఖ్య పెరిగి 300 కి చేరుకుంది. వాంతులు బాగా అవ్వడంతో వారంతా తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో వారిని చికిత్స నిమిత్తం వెంటనే ఆసుపత్రికి తరలించడం జరిగింది. యూనివర్సిటీలోని విద్యార్థినులు చికిత్స కోసం మెడికల్ కాలేజీకి చేరుకున్నారన్న సమచారం ఆరోగ్య శాఖ అధికారులకు యూనివర్సిటీ అధికారులు సమాచారం అందించారు. దీంతో వారు హుటాహుటిన హాస్టల్ మెస్ కు చేరుకున్నారు. వారు విద్యార్థినులు తిన్న భోజనం, డైనింగ్ హాల్ నుంచి కొన్ని ఆహార నమూనాలను సేకరించి పరీక్ష కోసం ల్యాబ్ కి పంపారు. ఈ సంఘటన గురించి విచారణ చేపట్టినట్లు యూనివర్సిటీ ప్రతినిధి తెలిపారు. దీని గురించి ముగ్గురు సభ్యులతో ఓ కమిటీని కూడా ఏర్పాటు చేసినట్లు వివరించారు. యూనివర్సిటీలోని ప్రొఫెసర్లతో సమావేశం కూడా నిర్వహించినట్లు వారు వెల్లడించారు. యూనివర్సిటీ హాస్టల్ కోసం ఆహార పదార్థాల కొనుగోలులో అక్రమాలు, నాసిరకం పదార్థాల సరఫరా వల్లే ఇలా జరిగినట్లు అధికారులు ఆరోపిస్తున్నారు. ఈ మధ్య కాలంలో ఇలాంటి ఘటనలు జరగడం పరిపాటిగా మారింది. #food-poison #lucknow #uttarapradesh #alighad #university-hostel #300-students మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి