/rtv/media/post_attachments/wp-content/uploads/2023/09/Alien-Corpse-jpg.webp)
Alien Corpse in Mexican Congress: ఏలియన్స్ ఉన్నాయా? లేవా? ఉంటే ఎలా ఉంటాయి? ఎక్కడ ఉంటాయి?.. ఏలియన్ పళ్లెం లాంటి వాహనాలు(UFO)లలో ప్రయాణిస్తారా? చాలా మంది మేం చూశాం అని చెబుతున్న యూఎఫ్‌ఓలు నిజమైనవేనా? వీటన్నింటికీ సమాధానం దాదాపు వచ్చేసినట్లే అనిపిస్తోంది. తాజాగా మెక్సికో చట్టసభలో ఏలియన్ అవశేషాలను(Alien Fossils)ను ప్రదర్శించారు. రెండు చెక్క పెట్టెల్లో ఉన్న ఏలియన్స్ అవశేషాలను చట్ట సభల వేదికగా ప్రదర్శించారు సైంటిస్టులు. ఆదేశ జర్నలిస్ట్, యూఫోలజిస్ట్ జైమ్ మౌసాన్ ఈ బాక్స్‌లను ఓపెన్ చేసి ప్రదర్శనకు పెట్టారు. ఈ కార్యక్రమంలో అమెరికన్స్ ఫర్ సేఫ్ ఏరోస్పేస్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రియాన్ గ్రేవ్స్, అమెరికా నేవీ మాజీ పైలట్ కూడా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో గ్రహాంతర వాసుల జీవుల ఉనికి గురించి ప్రధానంగా చర్చించారు.
అయితే, 1000 సంవత్సరాల నాటి ఈ రెండు ఏలియన్స్ అవశేషాలను 2017లో పెరూలోని కుస్కోలో గల డయాటమ్ గనుల్లో బయటపడిన శిలాజ అవశేషాల నుంచి వెలికితీసినట్లు మౌసాన్ వెల్లడించారు. ఇవి భూమికి సంబంధించిన జీవులు కావని, వీటిని యూఎఫ్‌ఓ శిథిలాల్లో కనుగొన్నట్లు తెలిపారు. కాగా, మెక్సికో కాంగ్రెస్‌లో ప్రదర్శించిన ఏలియన్ అవశేషాల వీడియో క్లిప్‌లు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Scientists unveiling two alleged alien corpses took place in Mexico, which are retrieved from Cusco, Peru. pic.twitter.com/tDNqZ9Cgze
— Dinesh Kumar Saini (@imDsaini) September 13, 2023
విశ్వంలో మనం ఒంటరిగా లేమని, ఇవిగో సాక్ష్యాలు అంటూ మెక్సికన్ చట్ట సభ ప్రతినిథులు దీనిని చూపిస్తూ ప్రకటించారు. చిన్న శరీరాకృతి కలిని ఈ రెండు ఏలియన్స్‌కి ప్రతి చేతికి మూడు వేళ్లు, పొడవాటి చేతులు ఉన్నాయి. మెక్సికో నేషనల్ అటానమస్ యూనివర్సిటీ(UNAM) కార్బన్ డేటింగ్ ప్రక్రియ ద్వారా అవి సుమారు 1,000 సంవత్సరాల నాటివిగా గుర్తించారు. అయితే, ఇవి దాదాపు మమ్మీ అవశేషాలుగా కనిపిస్తున్నా.. వీటిని స్కాన్ చేసి చూస్తే షాకింగ్ విషయాలు వెలుగు చూశాయి. ఈ అవశేషాలపై ఎక్స్-రేలు, 3-డి పునర్నిర్మాణం, డీఎన్‌ఏ విశ్లేషణలు జరిపారు.
ఏలియన్స్ కడుపులో గుడ్లు..
ఈ ఏలియన్స్ అవశేషాలను స్కాన్ చేయగా.. షాకింగ్ దృశ్యాలు కనిపించాయి. ఈ అవశేషాల లోప గడ్లు కనిపించాయి. వీటిని పిండాలుగా చెప్పుకొచ్చారు మౌసాన్.
Testimonial en el H. Congreso de México del Director del Instituto Científico para la Salud de la Secretaría de la Marina 🇲🇽, Dr. José de Jesús Zalce B; sobre el ADN de evidencias biológicas consideradas de origen no humano.@uncertainvector
Estudio ADN:https://t.co/8l8wgFxgbIpic.twitter.com/nRe9rQQB1p— Jaime Maussan (@jaimemaussan1) September 14, 2023
అనేక సందేహాలు..
అయితే, మెక్సికన్ చట్ట సభల్లో ప్రదర్శించిన ఈ ఏలియన్స్ అవశేషాలు నిజంగా నిజమైనవేనా? అనే సందేహాలు ప్రపంచ వ్యాప్తంగా వ్యక్తమవుతున్నాయి. ఈ విషయంపై చర్చించేందుకు నాసా సైంటిస్టులు సైతం సిద్ధమయ్యారు. శాస్త్రీయ పరమైన నిర్ధారణ డాక్యూమెంట్ వచ్చేంత వరకు ఎందుకు ఎదరు చూడలేదని, ఇందులో నిజముందా? అని ప్రశ్నిస్తున్నారు పలువురు. ఇది నిరూపణ లేని స్టంట్‌గా పేర్కొంటున్నారు. ఈ నమూనాలు గ్రహాంతరవాసులయ్యే అవకాశం లేదని భౌతిక శాస్త్రవేత్త మరియు ప్రెజెంటర్ ప్రొఫెసర్ బ్రియాన్ కాక్స్ తెలిపారు. మొత్తంగా ఏలియన్స్ వ్యవహారం ప్రపంచ వ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారింది.
Also Read:
Telangana: కవితకు ఈడీ నోటీసులపై స్పందించిన కేంద్రమంత్రి కిషన్ రెడ్డి.. ఏమన్నారంటే..
BREAKING: ప్రైవేట్ జెట్‌లో మంటలు.. రన్‌వే స్కిడ్.. 8 మంది ప్రయాణికులు!