CRCF Portal SBI: దేశీయ బ్యాంకింగ్ దిగ్గజం అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (State Bank of India)తాజాగా కీలక ప్రకటన విడుదల చేసింది. సేవల్లో అంతరాయంపై తన ఖాతాదారులకు సమాచారం అందించింది. దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. ఈరోజు రాత్రి 9.30గంటల నుంచి రాత్రి 11.30 గంటల వరకు CRCF పోర్టల్(CRCF Portal) పని చేయదని వెల్లడించింది. అంటే మొత్తం రెండున్నర గంటలపాటు సేవలు పనిచేయవని బ్యాంకు ప్రకటించింది. ఖాతాదారులు ఈ విషయాన్ని గమనించి సహకరించాలని ట్విట్టర్ ద్వారా కోరింది.
ఇది కూడా చదవండి: ప్రముఖ విద్యావేత్త చుక్కా రామయ్యను పరామర్శించిన మంత్రి సీతక్క..!!