మీకు బ్యాంకులో పనులు ఉన్నాయా? అయితే ఈ విషయం మీకోసమే. ఎందుకంటే రేపటి నుంచి వరుసగా మూడు రోజులు బ్యాంకులకు సెలవులు ఉన్నాయి. అందుకే బ్యాంకులు పనులు ఉంటే మాత్రం ఈ విషయం ఖచ్చితంగా తెలుసుకోండి. రేపటి నుంచి వరుసగా మూడు రోజులు సెలవులు ఉన్నాయని కాబట్టి ఈ విషయం గుర్తుంచుకోండి. ఎందుకంటే వరుసగా బ్యాంకులకు సెలవులు ఉన్నప్పుడు బ్యాంకుకు వెళ్లి తిరిగి రావడం సమయం వేస్ట్ అవుతుంది. బ్యాంకులకు మూడు రోజులపాటు సెలవులు ఎందుకు ఉన్నాయో ఇప్పుడు తెలసుకుందాం.
నవంబర్ నెల చివరిలో అంటే రేపటి నుంచి బ్యాంకులకు వరుసగా మూడు రోజులు సెలవులు ఉన్నాయి. నవంబర్ 25వ తేదీన నాలుగో శనివారం ఉంది. అందుకే ఆరోజు బ్యాంకులకు సెలవు ఉంది. ఇంకా నవంబర్ 26వ తేదీ ఆదివారం. ఆ రోజు ఎలాగో సెలవు ఉంటుంది. ఇక 27వ తేదీ సోమవారం ఈరోజు గురునానక్ జయంతి. అందుకే ఆరోజు బ్యాంకులకు సెలవు. అలా ఆ విధంగా బ్యాంకులకు వరుసగా మూడు రోజులపాటు సెలవులు రావడంతో బ్యాంకులు క్లోజ్ లోనే ఉంటాయి. అందుకే మీకు బ్యాంకులో పని ఉన్నట్లయితే..ఈ విషయాలను గుర్తుపెట్టుకోండి. బ్యాంక్ సెలవుల అనుగుణంగా బ్యాంకింగ్ పనులు చూసుకోండి. సాధారణంగా నాలుగో శనివారం, ఆదివారం బ్యాంకులు బంద్ ఉంటాయి. అయితే ఈ సోమవారం కూడా బ్యాంకు బంద్ ఉంది కాబట్టి ఈ విషయం గుర్తు పెట్టుకోండి. లేదంటే మీరు ఇబ్బంది పడాల్సి ఉంటుంది.
అయితే బ్యాంకుకు సెలవులు ఉన్నా కూడా వచ్చే ఇబ్బంది ఏమీ ఉండదు. ఎందుకంటే చాలా బ్యాంకులు ఇప్పుడు ఆన్ లైన్ సర్వీసును ఇస్తున్నాయి. మొబైల్ బ్యాంకింగ్, నెట్ బ్యాంకింగ్, యూపీఐ ద్వారా సులభంగానే బ్యాంక్ సేవలు పొందవచ్చు. మనీ ట్రాన్స్ ఫర్, బిల్లు పేమెంట్స్ వంటి సేవలు సులభంగానే చేసుకోవచ్చు. అయితే బ్యాంకులు అధిక మొత్తంలో డబ్బులు డిపాజిట్ చేసుకోవాలని భావిస్తే మాత్రం కచ్చితంగా బ్రాంచ్ కు వెళ్లాల్సి ఉంటుంది. ఇతరాత్ర సేవలకు బ్యాంక్ బ్రాంచ్ కు వెళ్లాల్సిందే.
ఇది కూడా చదవండి: ఆ మూడు బ్యాంకులపై ఆర్బీఐ కొరఢా..రూ. 10 కోట్ల జరిమానా చెల్లించాల్సిందే..!!