తెలంగాణలో రానున్న రెండ్రోజుల్లో ఉరుములు, మెరుపులతో భారీ వర్షాలు..

గత కొన్ని రోజులుగా తెలుగు రాష్ట్రాల్లో భానుడు భగభగమంటున్నాడు. దీంతో జనం ఉక్కపోతతో అల్లాడిపోతున్నారు. ఈ క్రమంలో వాతావరణ శాఖ చల్లటి కబురును చెప్పింది. దీంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో రానున్న రెండు మూడు రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశముంది. 18,19 తేదీల్లో తెలంగాణలో ఎల్లో అలర్ట్..

New Update
IMD Rain Alert : ఈ రాష్ట్రాల్లో మెరుపులతో కూడిన భారీ వర్షం..అప్రమత్తంగా ఉండాలంటూ IMD హెచ్చరిక..!!

Rain Alert: గత కొన్ని రోజులుగా తెలుగు రాష్ట్రాల్లో భానుడు భగభగమంటున్నాడు. దీంతో జనం ఉక్కపోతతో అల్లాడిపోతున్నారు. ఈ క్రమంలో వాతావరణ శాఖ చల్లటి కబురును చెప్పింది. దీంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో రానున్న రెండు మూడు రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశముంది. ఇక ఏపీలో ఇప్పటికే పలు ప్రాంతాల్లో వానలు పడుతుండడంతో.. రాబోయే మూడు రోజుల పాటు కూడా వర్ష సూచనను వాతావరణ శాఖ అధికారులు జారీ చేశారు.

18,19 తేదీల్లో తెలంగాణలో ఎల్లో అలర్ట్..!

తెలంగాణలో ఈ నెల 18,19 తేదీల్లో ఉరుములు, మెరుపులతో కూడా భారీ వర్షం కురిసే అవకాశముందని వాతావరణ శాఖ వెల్లడించింది. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా ఎల్లో అలర్ట్ ను కూడా జారీ చేసింది. రానున్న రెండ్రోజులు తెలంగాణ రాష్ట్రంలో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు అధికారులు పేర్కొన్నారు. ముఖ్యంగా హైదరాబాద్, మేడ్చల్, భువనగిరి, సిద్ధిపేట,మల్కాజ్ గిరి, యాదాద్రి, సిరిసిల్ల ఇంకా నల్గొండ జిల్లాల్లో మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉంది. కాబట్టి రాష్ట్ర ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు సూచించారు.

ఏపీలో రాబోయే మూడు రోజులు వర్షాలు..!

ఏపీలో గత కొద్ది రోజులుగా.. కొన్ని చోట్ల ఎండలు మండుతున్నాయి. ఉక్కబోతతో భిన్నమైన వాతావరణ అక్కడ నెలకొంది. తిరుపతిలో గరిష్టం 35.7, అమరావతిలో 36.5, విశాఖ పట్నంలో 34.2 డిగ్రీలు గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.ఇక వర్షాకాలం మొదలై ఇన్నాళ్లైనా కొన్ని జిల్లాల్లో ఇంకా వర్షాలు పడకపోవడంతో అన్నదాతలు ఆకాశానికేసీ చూస్తున్నారు. అయితే గత రెండ్రోజులుగా అక్కడక్కడ వర్షాలు పడుతుండడంతో రైతుల్లో ఆనందం నెలకొంది.

పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం..!

ఇక పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. ఏపీ తీరాన్ని ఆనుకొని సముద్ర మట్టానికి 4.5 కిలోమీటర్ల ఎత్తులో ఇది ఉంది. దీంతో పాటు 0.9 కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ద్రోణి కొనసాగుతోంది. ఈ ప్రభావంతో వర్షాలు పడుతున్నాయి. అయితే రానున్న రెండు మూడు రోజుల్లో మరింత భారీ వర్షాలు పడే అవకాశముంది. ఆగష్టు పదమూడు నుంచి మొదలైన వర్షాలతో శ్రీకాకుళం పార్వతీపురం మన్యం, విజయనగరం, కోనసీమ, వెస్ట్ గోదావరి, ఏలూరు, కృష్ణ, గుంటూరు, పల్నాడు, బాపట్ల జిల్లాల్లో వానలు పడుతున్నాయి. అయితే వర్షాలు కొద్ది రోజుల పాటు ఇదే విధంగా పడతాయని.. మరికొన్ని ప్రాంతాల్లో మాత్రం సమ్మర తరహా ఎండలు తప్పవని వాతావరణ శాఖ అధికారులు సూచిస్తున్నారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు