టీఆర్టీ అభ్యర్థులకు ముఖ్యగమనిక. దరఖాస్తు చేసిన అభ్యర్థులు వారు సమర్పించిన వివరాల్లో తప్పులుంటే సవరించుకోవచ్చని పాఠశాల విద్యాశాఖ వెల్లడించింది. ఈ మేరకు నవంబర్ 1వ తేదీ నుంచి 5వ తేదీ వరకు ఎడిట్ ఆప్షన్ అందుబాటులో ఉంటుందని విద్యాశాఖ సంచాలకురాలు శ్రీదేవసేన తెలిపారు.
కాగా టీఆర్టీకి మొత్తం 1,76,527 మంది దరఖాస్తులు చేసుకున్నారు. దరఖాస్తు గడువు అక్టోబర్ 28వ తేదీ అర్ధరాత్రితో ముగిసింది. స్కూల్ అసిస్టెంట్లు, సెకండరీ గ్రేడ్ టీచర్స్, పీఈటీ, భాషా పండితులు పలు మొత్తం 43 విభాగాల్లో 5,089 కొలువుల భర్తీకి విద్యాశాఖ దరఖాస్తులను స్వీకరించింది. అత్యధికంగా ఎస్జీటీ తెలుగు మాధ్యమం కోసం 60,190 దరఖాస్తులు అందినట్లు పాఠశాల విద్యాశాఖ తెలిపింది. వచ్చే ఫిబ్రవరిలో ఆన్ లైన్ ద్వారా పరీక్షలు నిర్వహించాలని విద్యాశాఖ యోచిస్తున్నట్లు సమాచారం.
ఇది కూడా చదవండి: జిల్లాల వారీగా డీఎస్సీకి ఎన్ని అప్లికేషన్లు వచ్చాయంటే..!!
అటు తెలంగాణ డీఎస్సీ దరఖాస్తుల స్వీకరణ ముగిసింది. రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి 1,76,530 దరఖాస్తులు వచ్చాయి. అందులో సెకండరీ గ్రేడ్ టీచర్ పోస్టులకు అత్యధికంగా దరఖాస్తులు 60,190 వచ్చినట్లు సమాచారం. ఇదిలా ఉండగా సెప్టెంబర్ 6న డీఎస్సీ నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. అదే నెల 20వ తేదీ నుంచి ఆన్ లైన్ విధానం ద్వారా అభ్యర్థుల నుంచి దరఖాస్తులను స్వీకరించారు. దరఖాస్తుల గడువు ఈ నెల 21తో ముగిసింది. అయితే అభ్యర్థుల వినతి మేరకు ఈ గడువును మరోవారం పొడిగించింది విద్యాశాఖ. పొడిగించిన గడువు కూడా శనివారంతో ముగిసింది. మొత్తంగా 1,79,297మంది అభ్యర్థులు ఫీజు చెల్లించినట్లు అధికారులు తెలిపారు. ఇక డీఎస్సీ పరీక్షలను జనవరి నుంచి లేదా ఫిబ్రవరి మొదటివారం నుంచి నిర్వహించే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.
ఇది కూడా చదవండి: మీకు నేనున్నా..చంద్రయ్య కుటుంబానికి రాహుల్ భరోసా..!!