TRT : తెలంగాణ టీచర్ అభ్యర్థులకు అలర్ట్.. మారిన సిలబస్.. ఈ టాపిక్స్ చదవండి..!!

ప్రభుత్వ టీచర్ ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకు బిగ్ అలర్ట్. అభ్యర్థులు ఇక నుంచి లోతైన అధ్యయనం చేయాల్సి ఉంటుంది. టీఆర్టీకి హాజరయ్యే అభ్యర్థులు ముఖ్యంగా బోధనా విధానాల్లో వస్తున్న మార్పులపై నిశితంగా పరిశీలించేలా ప్రశ్నలుంటాయని తెలంగాణ విద్యాశాఖ వెల్లడించింది. సిలబస్ మారిన నేపథ్యంలో అభ్యర్థులు ఎలాంటి టాపిక్స్ చదవాలో పూర్తి వివరాలు తెలుసుకుందాం.

TS TRT: టీఆర్టీ అభ్యర్థులకు అలర్ట్.. అధికారుల కీలక ప్రకటన!
New Update

ప్రభుత్వ ఉపాధ్యాయ ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకు ముఖ్యగమనిక. జాతీయ నూతన విద్యావిధానంలో భాగంగా పాఠశాల విద్య కోసం కేంద్ర విద్యాశాఖ రూపొందించిన కొత్త కరిక్యులమ్ ను టీఆర్టీలో చేర్చింది విద్యాశాఖ. అంటే మారిన సిలబస్ ప్రకారం నిశిత ప్రశ్నలు అడిగే అవకాశం ఉంది. నేషనల్ కరిక్యులమ్ ఫ్రేమ్ వర్క్ ఫర్ స్కూల్ ఎడ్యుకేషన్ పేరుతో తయారు చేసిన నివేదికను ఆగస్టు 23న కేంద్రం విడుదల చేసిన సంగతి తెలిసిందే. దాన్ని టీఆర్టీ సిలబస్ లో చేర్చడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. దీంతోపాటు ఎన్ సీఎప్ 2004 ఎన్సీఎఫ్టీఈ 2009లను కూడా చేర్చింది. జాతీయ నూతన విద్యా విధానంపై రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ఇప్పటి వరకు ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు.

మారిన సిలబస్ లో ఏ చాప్టర్ నుంచి ఎలాంటి ప్రశ్నలు అడుగుతారంటే..
ఎస్జీటీ అవగాహన పరిధిని నిశితంగా పరిశీలించాలని నిర్ణయించింది. రాష్ట్ర సిలబస్ కు సంబంధించిన 8వ తరగతి వరకు కొన్ని చాప్టర్ల నుంచి ప్రశ్నలు అడుగుతామని మొదట్లో చెప్పినా...మెథడాలజీలో మాత్రం ఇంటర్ స్థాయిలోని ఆలోచణ ధోరణికి సంబంధించిన చాప్టర్లను చేర్చింది. నవంబర్ 20 నుంచి జరిగే ఉపాధ్యాయ నియామక పరీక్షకు సంబంధించి విద్యాశాఖ గురువారం పరీక్ష సిలబస్ రిలీజ్ చేసింది. ఏ చాప్టర్ నుంచి ఎలాంటి ప్రశ్నలు అడుగుతారనే విషయాన్ని ఇందులో పేర్కొంది విద్యాశాఖ.

వీటిపై ఎక్కువ ఫోకస్ పెడితేనే..
స్కూల్ అసిస్టెంట్ పోస్టులకు జనరల్ నాలెడ్జ్, కరెంట్ అఫైర్స్ నుంచి దాదాపు 20 ప్రశ్నలు అడుగుతున్నారు. వీటిపై ఎలాంటి అభ్యంతరాలు రావడం లేదు. అయితే కొత్త విద్యాబోధనపై 20 ప్రశ్నలు అడిగే అవకాశం ఉంది. ఉదాహరణకు స్వాతంత్ర్యం పూర్వం, తర్వాత విద్యా వ్యవస్థలో వచ్చిన మార్పులు, పలు విద్యా కమిషన్లు, సిఫార్సులు , చట్టాలపై ప్రత్యేక ప్రశ్నలను అడుగుతున్నారు. స్వామి వివేకానంద, మహాత్మాగాంధీ, అంబేద్కర్ వంటి ప్రముఖుల ఆలోచనల గురించి ప్రశ్నలు అడిగే ఛాన్స్ ఉంది.

ఇది కూడా చదవండి: ఈ రోజే ఐఫోన్ 15 రిలీజ్…ధర ఎంత, ఎలా కొనాలి..పూర్తి వివరాలివే..!!

అకడమిక్ పుస్తకాలతోపాటు జనరల్ నాలెడ్జ్ గానే భావించాల్సి ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. విద్యార్థి, క్రమశిక్షణ డెవలప్ మెంట్ అనే అంశంలో పలు రకాలుగా వస్తున్న మార్పులు, అధ్యయనాల గురించి ప్రశ్నలు ఎక్కువగా సంధిస్తున్నారు. కేంద్ర విద్యా చట్టం మార్పులు అనే అంశాన్ని నేరుగా ప్రస్తావించడం లేదు. జాతీయ విద్యా చట్టాలపైనే ఎక్కువగా ప్రశ్నలు ఇస్తున్నారు. మేథమెటిక్స్ లోనూ జాగ్రత్తలు తీసుకున్నారు. పాతకాలం విధానాలు కాకుండా సరికొత్త పద్ధతిలో గణితం బోధించే ధోరణిపై ప్రశ్నలు ఉంటాయని సిలబస్ లో పేర్కొన్నారు.

ఇది కూడా చదవండి: గురుకుల అభ్యర్థులకు కీలక అలర్ట్.. అలా చేయకపోతే మీ అప్లికేషన్ రిజెక్ట్.!!

ఎస్ఏలకు ఆరవ తరగతి, నుంచి ఇంటర్మీడియేట్ వరకు 88 ప్రశ్నలు అడుగుతున్నారు. దీనిపైనా ఎలాంటి స్పష్టత లేకపోవడం సమస్యగా మారిందంటున్నారు అభ్యర్థులు. సీనియర్ సెంకండియర్ స్థాయి ప్రశ్నలు ఇస్తామని చెప్పినా...అందులో కమ్యూనికేషన్ స్కిల్ పరీక్షకు సంబంధించినవి ఉంటాయా లేదా అనేదానిపై స్పష్టత ఇవ్వాలని కోరుతున్నారు. ప్రతి సబ్జెక్టు నుంచి ఐదుకు మించకుండా ప్రశ్నలు అడుగుతున్నారు. మొత్తం వంద ప్రశ్నలను ఇదే తరహాలో విభజించారు. మొత్తంగా ఇంటర్మీడియేట్ సిలబస్ తోపాటు కొత్త విద్యా విధానంపై ద్రుష్టి పెట్టాల్సిన అవసరం ఉందని సిలబస్ స్పష్టం చేస్తోంది.

#ts-trt-2023-syllabus-change #ts-trt-2023 #trt
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి