ఆ రంగంలో కొలువుల జాతర.. ఏకంగా 10కోట్ల ఉద్యోగాలు ఈ ఒక్క ఫీల్డ్‌లోనే..!

నిర్మాణ రంగంలో కొలువుల జాతర మొదలవనుంది. ఇప్పటికే ఈ రంగం ద్వారా 7కోట్ల మంది భారతీయులు ఉపాధి పొందుతుండగా.. ఈ సంఖ్య 2030నాటికి 10కోట్లను దాటనుందని నివేదికలు చెబుతున్నాయి. అంతేకాదు రియల్‌ ఎస్టెట్‌ అవుట్‌పుట్‌ కూడా ఓ రేంజ్‌లో పెరగనుందట. ఇదే సమయంలో టెక్‌ స్కిల్స్‌ పెంచుకోవడం కూడా ముఖ్యమని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

ఆ రంగంలో కొలువుల జాతర.. ఏకంగా 10కోట్ల ఉద్యోగాలు ఈ ఒక్క ఫీల్డ్‌లోనే..!
New Update

నిర్మాణ రంగం దూసుకుపోతోంది. రియల్‌ ఎస్టెట్‌(real estate) ఏ రేంజ్‌లో ఉందో ఇటివలి తెలంగాణలోని కొన్ని ప్రాంతాల్లో పలికిన భూముల ధరలు చూస్తే క్లియర్‌ కట్‌గా అర్థమవుతుంది. ఎప్పటికైనా నిర్మాణ రంగం ఎవర్‌గ్రీనే. ఈ ఫీల్డ్‌ ద్వారా క్రియేట్ అయ్యే జాబ్స్‌(jobs) కోట్లలో ఉంటాయి. ప్రస్తుతం ఇండియాలో ఎక్కువగా ఉపాధి కలిగించే రంగాల్లో నిర్మాణ రంగం రెండో స్థానంలో ఉంది. ఇది మరింత విస్తృతమయ్యే అవకాశాలు ఉన్నట్టు నివేదికలు చెబుతున్నాయి. ముఖ్యంగా మరో ఏడేళ్లలో నిర్మాణ రంగంలో ఉద్యోగాలు భారీ స్థాయిలో పెరుగుతాయని తెలుస్తోంది.

నివేదికలు ఏం చెబుతున్నాయి?
నైట్ ఫ్రాంక్ ఇండియా అండ్‌ రాయల్ ఇన్‌స్టిట్యూషన్ ఆఫ్ చార్టర్డ్ సర్వేయర్స్ (RICS) ఇటీవలి ఓ నివేదిక విడుదల చేసింది. నిర్మాణ రంగం గురించి విడుదల చేసిన నివేదిక ఇది. ప్రస్తుతం.. ఈ రంగం ద్వారా 7.1 కోట్ల మంది ఉపాధి పొందుతుండగా.. ఈ సంఖ్య 2030 నాటికి 10 కోట్ల కంటే ఎక్కువగా ఉంటుందని అంచనా. అంతేకాదు ప్రస్తుతం 650 USD(53లక్షల కోట్లు)గా ఉన్న రియల్‌ ఎస్టెట్ అవుట్‌పుట్‌ 2030నాటికి ఏకంగా 1 ట్రిలియన్ USD (82.68 లక్షల కోట్ల‌)కు చేరుకుంటుందని నివేదిక చెబుతోంది. దేశంలో రియల్ ఎస్టేట్, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ రంగాలు వృద్ధి చెందుతుండడంతో నైపుణ్యం కలిగిన ఉద్యోగుల కోసం డిమాండ్ గణనీయంగా పెరుగుతుందని నివేదిక స్పష్టం చేస్తోంది. ఇక నిర్మాణ రంగంలో సాంకేతిక పెరిగే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇది టెక్‌ స్కిల్‌ కలిగిన ఉద్యోగుల అవసరాన్ని మరింత పెంచనుంది.

నైపుణ్యం లేని వారే ఎక్కువగా ఉన్నారా?
ప్రస్తుతం నిర్మాణ రంగంలో ఉపాధి పొందుతున్న వారి సంఖ్య 7కోట్లకు పైనే ఉండగా.. అందులో 81శాతం మందికి గొప్ప నైపుణ్యాలు లేవని.. కేవలం 19శాతం మంది మాత్రమే స్కిల్‌ కలిగిన ఉద్యోగులు ఉన్నట్టు RICS నివేదిక చెబుతోంది. నైపుణ్యం కలిగిన ఉద్యోగస్తులు రావాలంటే ప్రభుత్వం ఏదో ఒకటి చేయాల్సి ఉంది. స్పెషల్‌ గవర్నమెంట్‌ ప్రొగ్రమ్స్‌తో పాటు, విద్యా సంస్థలు, శిక్షణా సంస్థలు స్కిల్‌ ఉన్న వారిని తయారు చేయగలవు. ప్రస్తుతం స్కూల్‌, ప్లస్‌-1, ప్లస్‌-2 చదువుతున్న విద్యార్థులకు ఈ నివేదిక ఎంతగానో ఉపయోగపడే ఛాన్స్‌ కనిపిస్తోంది. ఎందుకంటే 2030నాటికి వీరంతా జాబ్‌ చేసే ఏజ్‌కి వస్తారు. 2030నాటికి నిర్మాణ రంగంలో ఉద్యోగాలు పెరుగుతాయని ఈ నివేదిక ముందుగానే క్లారిటీ ఇస్తుండడంతో ఫ్యూచర్‌ ఎలా ప్లాన్‌ చేసుకోవాలన్నది నిర్ణయించుకునే అవకాశం విద్యార్థులకు లభించినట్టైంది. ఇక నిర్మాణ రంగంతో పాటు టెక్నాలజీ ఫీల్డ్‌లోనూ..ముఖ్యంగా ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌తో లింక్‌ ఉండే జాబ్స్‌ ఎక్కువగా క్రియేట్ అవ్వడం ఖాయంగా కనిపిస్తోంది.

#jobs #real-estate
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe