Ration Card Updates: రేషన్ కార్డు ఉన్న వారికి అలర్ట్..! ఈ విషయం తప్పక తెలుసుకోండి..!! రేషన్ కార్డుల విషయంలో కీలకంగా వ్యవహారిస్తోంది తెలంగాణ సర్కార్. ఈ నేపథ్యంలో కేవైసీ చివరి తేదీ, రేషర్ కార్డుతో కుటుంబ సభ్యుల వివరాలు వంటి తదితర అంశాలపై ప్రతిఒక్కరూ ఈ విషయాలను ఖచ్చితంగా తెలుసుకోవాలి. By Bhoomi 02 Oct 2023 in బిజినెస్ టాప్ స్టోరీస్ New Update షేర్ చేయండి దారిద్ర్యరేఖకు ఎవరైతే దిగువన ఉన్నారో వారంతా రేషన్ కార్డులు తీసుకునేందుకు అర్హులు అవుతారు. పేద ప్రజల జీవనాన్ని పరిగణలోనికి తీసుకుని పలు రాష్ట్రాలు రేషన్ కార్డులను జానీ చేశాయి..ఇఫ్పటికీ చేస్తున్నాయి. అయితే తెలంగాణ రాష్ట్రంలో రేషన్ కార్డుల విషయంలో చాలా కీలకంగా వ్యవహారిస్తోంది కేసీఆర్ సర్కార్. ఎందుకంటే తెలంగాణలో బోగస్ కార్డులు తొలగించాలన్న లక్ష్యంతో రాష్ట్రమంతా రేషన్ ఈకేవైసీ ప్రక్రియను మొదలుపెట్టింది. దీంతో అన్ని చోట్ల రేషన్ షాపుల వద్ద పెద్దెత్తన క్యూలైన్లు కనిపిస్తున్నాయి. కుటుంబం అంతా కూడా వేలిముద్రలు ఇచ్చి కేవైసీని పూర్తి చేసుకుంటున్నారు. అయితే ఈ కేవైసీకి లాస్ట్ డేట్ సెప్టెంబర్ 30వ తేదీ అనే ప్రచారం జరుగుతుండంతో ప్రజలు రేషన్ షాపుల వైపు పరుగులు పెడుతున్నారు. అయితే అంతగా కంగారు పడాల్సిన అవసరం లేదని పౌరసరఫరా శాఖ స్పష్టం చేసింది. ఇది కూడా చదవండి: టీడీపీ మాజీ మంత్రి నారాయణకు సీఐడీ నోటీసులు కేవైసీ డెడ్ లైన్ పై రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ ఈ అంశంపై స్పస్టత ఇచ్చారు. కేవైసీ చేయించుకోకుంటే రేషన్ కార్డులో పేరు తొలగిస్తారనేది పూర్తిగా అవాస్తవమని ఇది కేవలం దుష్ప్రచారమేనన్నారు. దీనిపై జరుగుతును్న తప్పుడు ప్రచారాన్ని వినియోగదారులు నమ్మకూడదని అధికారులు చెబుతున్నారు. ఈ కేవైసీ చేసుకునేందుకు చివరి తేదీ అంటూ ఏమీ లేదని మంత్రి చెప్పారు. కేవైసీకి ఇంకా చాలా సమయం ఉందని...ఎవరూ ఆందోళన చెందాల్సిన పని లేదన్నారు. ఈ అంశంపై కేంద్రంతో చర్చించామని..త్వరలోనే అన్నివిషయాలను వెల్లడిస్తామని చెప్పారు. ఇది కూడా చదవండి: జైల్లోబాబు..ఢిల్లీలో లోకేశ్..ఇక్కడ భువనేశ్వరి… నేడు టీడీపీ నిరాహారదీక్షలు..!! కాగా ఈ విషయంలో ప్రజలు ఎలాంటి గందరగోళం లేకుండా ప్రశాంతంగా కేవైసీని పూర్తి చేసుకోవాలని అధికారులు సూచించారు. రద్దీ ఉన్నా గంటలతరబడి లైన్లో వేచి ఉండాల్సిన అవసరం లేదన్నారు. మీకు ఎప్పుడు వీలైతే అప్పుడే కేవైసీ పూర్తి చేసుకోమని చెబుతున్నారు. దీంతో సెప్టెంబర్ 30తో గడువు ముగుస్తుందన్న వార్తల్లో నిజం తేలిపోయింది. ఇప్పటివరకు కేవైసీ చేసుకోని రేషన్ కార్డు హోల్డర్లకు ఊరట కలిగించింది. బోగస్ కార్డులు వెలికి తీయాలన్న ఉద్దేశ్యంతో సర్కార్ ఈ కేవైసీ నమోదు కార్యక్రమాన్ని చేపట్టింది. #telangana #ration-card-updates #ration-card-holders మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి