Rain Alert For Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్ లో రెండు రోజులు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ (IMD) తెలిపింది. దక్షిణ తమిళనాడు నుంచి పశ్చిమ విదర్భ వరకు సముద్రమట్టం నుంచి 1.5 కి.మీల ఎత్తు వరకు విస్తరించి ఉందిని వెల్లడించింది. దక్షిణ అంతర్గత కర్ణాటక నుంచి పశ్చిమ విదర్భ పరిసర ప్రాంతాలపైన ఉపరితల ఆవర్తనం వరకు కొనసాగుతోందన్నారు. జార్ఖండ్ నుంచి ఒడిశా మీదుగా ఉత్తర కోస్తాంధ్ర వరకు ఉన్న ద్రోణి బలహీన పడిందని వెల్లడించారు. వీటి ప్రభావంతో నేడు, రేపు ఉత్తర కోస్తాంధ్రలో కొన్నిచోట్ల, దక్షిణ కోస్తాంధ్రలో ఒకట్రెండు చోట్ల వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు.
Also Read: అసదుద్దీన్ ఓవైసీ పెద్ద దొంగ.. మంత్రి కోమటిరెడ్డి సెన్సేషనల్ కామెంట్స్
అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, డా. బీఆర్. అంబేడ్కర్ కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు జిల్లాల్లో కొన్ని చోట్ల పిడుగులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. ఇక కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురువనున్నాయని వెల్లడించారు. మత్స్యకారులు మరింత అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. నిన్న శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, విశాఖ జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసాయి. ఎండాకాలంలో వర్షాలు పడడంతో కాస్త ప్రజలు ఉపశమనం పొందుతున్నారు.