On line Payments : న్యూ ఇయర్ పండుగ పూట ఆన్ లైన్ పేమెంట్ దారులకు బ్యాంకులు (Bank) షాక్ ఇస్తున్నాయి. డిసెంబర్ 31, జనవరి 1న ప్రపంచవ్యాప్తంగా భారీ ఎత్తున పార్టీలు జరగనుండగా ఇప్పటికే పలు ఏర్పాట్లు పూర్తయ్యాయి. అయితే డిజిటల్ పేమెంట్ (Digital payments) కు అలవాడు పడ్డ జనాలు చేతిలో లిక్విడ్ క్యాష్ (cash) ఉంచుకోవడం తగ్గించేశారు. దీంతో టీ స్టాల్ నుంచి మొదలుపెడితే లక్షల్లో ఆన్ లైన్ ద్వారానే బిల్లులు చెల్లిస్తున్నారు. కాగా పండగవేళల్లో డిజిల్ పేమెంట్స్ మరింత జోరందుకుంటున్నాయి. ఈ క్రమంలోనే కొన్నిసార్లు ట్రాఫిక్ పెరిగి సర్వర్లు బిజీ అవుతున్నాయి. కొన్ని పేమెంట్స్ అటు ఇటు కాకుండా మధ్యలోనే స్ట్రక్ అవుతూ కస్టమర్లను కలవరపెడుతున్నాయి.
అయితే ఈ యేడాది డిసెంబర్ 31, జనవరి 1 వేడుకల్లో భాగంగా ఇప్పటికే భారీ ఎత్తున పార్టీలు మొదలయ్యాయి. వైన్స్, బార్, క్లబ్, రెస్టారెంట్, ఈవెంట్స్ కు సంబంధించి బుకింగ్స్ ఫుల్ అయిపోయాయి. ఇదే అదనుగా నిర్వాహకులు భారీగా దండుకుంటుంటే.. హ్యాకర్స్ సైతం రెచ్చిపోతున్నారు. ఆన్ లైన్ కస్టమర్లే టార్గెట్ గా లక్షల్లో డబ్బులు కాజేస్తున్నారు. అయితే దీనిపై ఇప్పటికే బ్యాంకులు పలు జాగ్రత్తలు తీసుకోగా.. కస్టమర్లకు తిప్పలు తప్పడం లేదు. డిసెంబర్ 31న ఆదివారం కావడం, జనవరి 1న గవర్నమెంట్ హాలీడే ఎఫెక్టుతో బ్యాంకులకు సెలవులు ఉండగా క్యాష్ కావాలనుకున్నవారు ఇబ్బందులు పడుతున్నారు. అంతేకాదు ఈ రెండు రోజులు సెలవు దినాలు కావడంతో పలు బ్యాంకులు సైతం తమ కస్టమర్లకు సరైన సదుపాయాలు కల్పించలేకపోతున్నాయి. ఆన్ లైన్ పేమెంట్స్ ఇష్యూస్ పెరగడంతో వాటిని క్లియర్ చేయాలంటే మంగళవారమే మార్గం కావడంతో జనాలు ఆందోళన చెందుతున్నారు. అన్నీ ఆర్డర్ చేసి పేమెంట్ చేయలేక తెల్ల మొహాలు వేస్తున్నామంటూ అసహనం వ్యక్తం చేస్తున్నారు.
ఇది కూడా చదవండి : AP : ముందు బాబులకు బంపర్ ఆఫర్ ఇచ్చిన సర్కార్.. రెండు రోజులు పండగే
ఈ క్రమంలోనే ఈ రెండు రోజులు వీలైనంత వరకూ ఏటీఎం, తదితర మార్గాల్లో లిక్విడ్ క్యాష్ తమ వెంట ఉంచుకోవాలని, లేదంటే ఇబ్బందిపడే అవకాశం ఉందని నిపుణులు సూచిస్తున్నారు. అలాగే ఈ సమయంలో హ్యాకింగ్ కు గురయ్యే అవకాశం ఉంటుందని, వీలైనంత వరకూ వెంట డబ్బులు, క్రెడిట్, డెబిట్ కార్డులు ఉంచుకోవాలని చెబుతున్నారు. అంతేకాదు పార్టీ మోజులో ఫోన్ లు పొగొట్టుకోవడం, లేదా చార్జీంగ్ తదితర సమస్యలు తలెత్తే అవకాశం కూడా ఉంటుందని హెచ్చరిస్తున్నారు.