Tirumala: తిరుమల వెళ్లే భక్తులకు అలర్ట్! శ్రీవారి మెట్టు నడకమార్గంలో భక్తులుకు జారి చేసే టోకేన్లు 1200 మెట్టు వద్ద స్కాన్ చేసిన తర్వాత దర్శనానికి టీటీడీ అనుమతించనుంది. గతంలో నడకమార్గంలో చిరుత దాడుల ఘటనతో టోకేన్ జారి విధానంలో అధికారులు మార్పులు చేశారు. By Bhavana 19 Jun 2024 in ఆంధ్రప్రదేశ్ తిరుపతి New Update షేర్ చేయండి Tirumala: తిరుమల శ్రీవారిని దర్శించుకోవడానికి వెళ్లే భక్తులకు టీటీడీ (TTD) ఓ కీలక సమాచారాన్ని ఇచ్చింది. తిరుమలలో శ్రీవారి బ్రహ్మోత్సవాలు జరుగుతున్న సమయంలో తిరుమల గిరులు భక్త జనంతో కిక్కిరిసిపోతున్నాయి. అంతేకాకుండా నిత్యం వేలాది మంది భక్తులు నడక మార్గంలో స్వామి వారిని దర్శించుకోవడానికి వస్తుంటారు. అలిపిరి మార్గం నుంచి, శ్రీవారి మెట్టు మార్గం నుంచి రెండు మార్గాల నుంచి భక్తులు భారీగా వచ్చి స్వామి వారిని దర్శించుకుంటారు. ఈ క్రమంలోనే శ్రీవారి మెట్టు మార్గం గుండా వచ్చే భక్తులకు టీటీడీ ఓ కీలక అప్డేట్ ని ఇచ్చింది. శ్రీవారి మెట్టు నడకమార్గంలో భక్తులకు జారి చేసే టోకేన్ల స్కానింగ్ పున:ప్రారంభించాలని టీటీడీ నిర్ణయించుకుంది. శ్రీవారి మెట్టు నడకమార్గంలో భక్తులుకు జారి చేసే టోకేన్లు 1200 మెట్టు వద్ద స్కాన్ చేసిన తర్వాత దర్శనానికి టీటీడీ అనుమతించనుంది. గతంలో నడకమార్గంలో చిరుత దాడుల ఘటనతో టోకేన్ జారి విధానంలో అధికారులు మార్పులు చేశారు. దీంతో, స్కానింగ్ విధానం లేకపోవడంతో నడకదారి భక్తులకు జారి చేసే టోకేన్లు పక్కదారి పడుతున్నాయని టీటీడీ కొత్త ఈవో శ్యామలరావు దృష్టికి తీసుకెళ్లారు విజిలెన్స్ అధికారులు. ఈ నేపథ్యంలో తిరిగి పూర్వపు విధానాన్నే కొనసాగించాలని అధికారులను ఈవోఆదేశించారు. Also Read: కాసేపట్లో డిప్యూటీ సీఎంగా పవన్ కల్యాణ్ బాధ్యతల స్వీకరణ #tirumala #ttd #tokens మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి