Sexual ability: శృంగార సామర్థ్యం తగ్గిందా.. ప్రధాన కారణమిదే!

యువకుల్లో శృంగారం సామర్థ్యం తగ్గడానికి మద్యం ప్రధాన కారణమని వైద్యులు వెల్లడించారు. ఇటీవల చేపట్టిన తాజా సర్వేలో ఆల్కహాల్ వల్ల లైంగిక సామర్థ్యం తగ్గడంతోపాటు, స్పెర్మ్ నాణ్యత పడిపోతున్నట్లు గైనకాలజిస్టు డాక్టర్. హెలెన్ తెలిపారు. పూర్తి సమాచారం కోసం ఆర్టికల్ లోకి వెళ్లండి.

New Update
Sexual ability: శృంగార సామర్థ్యం తగ్గిందా.. ప్రధాన కారణమిదే!

Sexual ability: యువకుల్లో శృంగారం సామర్థ్యం తగ్గడానికి దురలవాట్లే కారణమంటున్నారు వైద్యులు. ముఖ్యంగా మద్యం సేవించడం వల్ల లైంగిక సామర్థ్యం తగ్గుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ మేరకు నేషనల్ హార్ట్ అసోసియేషన్ ప్రకారం.. ఆల్కహాల్ గుండె ఆరోగ్యానికి హాని కలిగిస్తుందని వెల్లడించింది. అధిక ఆల్కహాల్ వినియోగం రక్తంలో కొవ్వు స్థాయిలను పెంచుతుందని, ఆల్కహాల్ ఎక్కువగా తీసుకోవడం వల్ల ఎముకలు బలహీనపడతాయని తెలిపింది. అలాగే ఆల్కహాల్ ఎక్కువగా తీసుకోవడం వల్ల లైంగిక సామర్థ్యం తగ్గుతుందని, స్పెర్మ్ నాణ్యత పడిపోతున్నట్లు పేర్కొంది. ఫలితంగా సంతానలేమి సమస్య ఎదుర్కొంటారని హెచ్చిరించింది. మద్యం ప్రభావం పురుషులతో పాటు, మహిళల మీద కూడా ఉంటుందని చెన్నైకి చెందిన ప్రముఖ గైనకాలజిస్టు డాక్టర్. హెలెన్ అంటున్నారు.

మహిళల్లో గర్భధారణ సామర్థ్యం తగ్గిపోతుంది..
ఆల్కహాల్ మహిళల్లో గర్భధారణ సామర్థ్యాన్ని తగ్గిస్తుందని ఆయన చెప్పారు. మహిళ పునరుత్పత్తి వ్యవస్థలో ఈస్ట్రోజెన్, ప్రొజెస్టిరాన్ హార్మోన్లు అత్యంత కీలకమైనవి. మన ఆహారపు అలవాట్లను బట్టి ఈ హార్మోన్ల ఉత్పత్తిలో తేడాలు వస్తుంటాయి. మద్యం తాగడం వల్ల ఈ హార్మోన్లపై ప్రభావం పడుతుందని హోలెన్ చెబుతున్నారు. వారంలో 6 నుంచి 14 సార్లు మద్యం తీసుకునే మహిళల్లో సంతాన సామర్థ్యం 20 శాతం నుంచి 25 శాతం తగ్గుతుందని కొన్ని అధ్యయనాల్లో వెల్లడైంది. మహిళల్లో అండం ఉత్పత్తి మీద కూడా ఆల్కహాల్ ప్రభావం ఉంటుంది. దాంతో, నెలసరి క్రమం తప్పుతుంది. గర్భం దాల్చడం కష్టమవుతుంది. ఒకవేళ గర్భం దాల్చినా.. అబార్షన్ అయ్యే అవకాశాలు కూడా ఉంటుందని వైద్యులు చెబుతున్నారు. బిడ్డకు పాలిచ్చే తల్లులు కూడా మద్యానికి దూరంగా ఉండటం మంచిదని వైద్యులు సూచిస్తున్నారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు