ANR: అక్కినేని నాగేశ్వర్ రావు శతజయంతి.. అక్కినేని అందగాడి 10 క్లాసిక్స్ రీరిలీజ్!

ANR శత జయంతి వేడుకలు సందర్భంగా సెప్టెంబర్ 20న ఆయన క్లాసిక్ సినిమాలను రీ రిలీజ్ చేయనున్నారు. దేవదాసు, మాయా బజార్‌, ప్రేమ్‌ నగర్, మైసమ్మతో సహా పలు చిత్రాలు మరో సారి ప్రేక్షకులను అలరించనున్నాయి. సెప్టెంబర్ 20-22 వరకు ఎంపిక చేసిన థియేటర్స్ లో రిలీజ్ కానున్నాయి.

ANR: అక్కినేని నాగేశ్వర్ రావు శతజయంతి.. అక్కినేని అందగాడి 10 క్లాసిక్స్ రీరిలీజ్!
New Update

ANR: భారతీయ చలన చిత్ర రంగం ఐకాన్, దివంగత లెజెండరీ నటుడు అక్కినేని నాగేశ్వర్ రావు శత జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు టాలీవుడ్ సిద్ధమవుతోంది. ఈ సందర్భంగా సెప్టెంబర్ 20న ఫిల్మ్ హెరిటేజ్ ఫౌండేషన్ (FHF), నేషనల్‌ ఫిల్మ్‌ ఆర్చీవ్‌ ఇండియా సంస్థలు ఏఎన్ఆర్ క్లాసిక్ చిత్రాలను రీ రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేశాయి. 10 సినిమాలను 25 సిటీస్ లో విడుదల చేయనున్నట్లు తెలిపారు. సెప్టెంబర్ 20-22 వరకు ఎంపిక చేయబడ్డ పీవీఆర్, ఐనాక్స్‌ థియేటర్లలో రీ రిలీజ్ కానున్నాయి.

రీ రిలీజ్ కానున్న చిత్రాలు

'ప్రేమ్‌ నగర్', 'ప్రేమాభిషేకం', 'దేవదాసు', 'మైసమ్మ', 'మాయా బజార్‌', 'భార్య భర్తలు', 'గుండమ్మ కథ', 'సుడిగుండాలు', 'మనం' చిత్రాలు రీ రిలీజ్ కానున్నాయి. ఏఎన్ఆర్ సినీ కెరీర్ లో మరుపురాని క్లాసిక్స్ గా నిలిచిన ఈ చిత్రాలు మరో సారి తెర పై సందడి చేయనుండడంతో అక్కినేని అభిమానులు తెగ సంబర పడుతున్నారు. అలాగే వింటేజ్ ఏఎన్ఆర్ ను మరో సారి తెరపై చూసేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Also Read: Actress Imanvi: ప్రభాస్ హీరోయిన్ గా మిలటరీ ఆఫీసర్ కూతురు..! ఎవరీ ఈ బ్యూటీ..? - Rtvlive.com

#akkineni-nageshwar-rao #anr-re-releasing-movies #anr-birthday-special
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe