ANR: అక్కినేని నాగేశ్వర్ రావు శతజయంతి.. అక్కినేని అందగాడి 10 క్లాసిక్స్ రీరిలీజ్! ANR శత జయంతి వేడుకలు సందర్భంగా సెప్టెంబర్ 20న ఆయన క్లాసిక్ సినిమాలను రీ రిలీజ్ చేయనున్నారు. దేవదాసు, మాయా బజార్, ప్రేమ్ నగర్, మైసమ్మతో సహా పలు చిత్రాలు మరో సారి ప్రేక్షకులను అలరించనున్నాయి. సెప్టెంబర్ 20-22 వరకు ఎంపిక చేసిన థియేటర్స్ లో రిలీజ్ కానున్నాయి. By Archana 05 Sep 2024 in సినిమా టాప్ స్టోరీస్ New Update షేర్ చేయండి ANR: భారతీయ చలన చిత్ర రంగం ఐకాన్, దివంగత లెజెండరీ నటుడు అక్కినేని నాగేశ్వర్ రావు శత జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు టాలీవుడ్ సిద్ధమవుతోంది. ఈ సందర్భంగా సెప్టెంబర్ 20న ఫిల్మ్ హెరిటేజ్ ఫౌండేషన్ (FHF), నేషనల్ ఫిల్మ్ ఆర్చీవ్ ఇండియా సంస్థలు ఏఎన్ఆర్ క్లాసిక్ చిత్రాలను రీ రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేశాయి. 10 సినిమాలను 25 సిటీస్ లో విడుదల చేయనున్నట్లు తెలిపారు. సెప్టెంబర్ 20-22 వరకు ఎంపిక చేయబడ్డ పీవీఆర్, ఐనాక్స్ థియేటర్లలో రీ రిలీజ్ కానున్నాయి. రీ రిలీజ్ కానున్న చిత్రాలు 'ప్రేమ్ నగర్', 'ప్రేమాభిషేకం', 'దేవదాసు', 'మైసమ్మ', 'మాయా బజార్', 'భార్య భర్తలు', 'గుండమ్మ కథ', 'సుడిగుండాలు', 'మనం' చిత్రాలు రీ రిలీజ్ కానున్నాయి. ఏఎన్ఆర్ సినీ కెరీర్ లో మరుపురాని క్లాసిక్స్ గా నిలిచిన ఈ చిత్రాలు మరో సారి తెర పై సందడి చేయనుండడంతో అక్కినేని అభిమానులు తెగ సంబర పడుతున్నారు. అలాగే వింటేజ్ ఏఎన్ఆర్ ను మరో సారి తెరపై చూసేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. FHF is back with another fantastic retrospective across India to mark the 100th birth anniversary of Akkineni Nageswara Rao (ANR), an icon of Indian cinema! https://t.co/EzQ16khccx pic.twitter.com/x8L3cYfyjS — Film Heritage Foundation (@FHF_Official) September 4, 2024 10 Classics - 25 Cities Sep 20 - 22 Celebrating #ANR100 #ANRLivesOn Film Heritage Foundation @FHF_Official National Film Archive India @NFAIOfficial PVR INOX Ltd @PicturesPVR pic.twitter.com/By9vpCyuAn — Sushanth A (@iamSushanthA) September 4, 2024 Also Read: Actress Imanvi: ప్రభాస్ హీరోయిన్ గా మిలటరీ ఆఫీసర్ కూతురు..! ఎవరీ ఈ బ్యూటీ..? - Rtvlive.com #akkineni-nageshwar-rao #anr-re-releasing-movies #anr-birthday-special మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి