Incorrect to judge Sanju Samson on just one match: ఒక మ్యాచ్ ఛాన్స్ ఇస్తారు.. రన్స్ చేయకపోతే పక్కనపెడతారు.. ఒకవేళ ఆ మ్యాచ్‌లో సెంచరీ చేసి రెచ్చిపోయినా పక్కనే పెడతారు. ఎందుకంటే ఒక మ్యాచ్‌తో ఏం డిసైడ్ అవుతాం అని కవర్ చేస్తారు. కేరళ స్టార్ ప్లేయర్ సంజూశాంసన్(Sanju Samson) విషయంలో బీసీసీఐ(BCCI) పెద్దలది మొదటి నుంచి ద్వంద్వ వైఖరే. అందుకే ఎన్నో ఏళ్లుగా జట్టుతోనే ఉన్నా ఎక్కువ మ్యాచ్‌లు ఆడలేకపోయాడు ఈ వికెట్ కీపింగ్ బ్యాటర్. బ్యాటర్‌గాను, కీపర్‌గానూ రాణించినా శాంసన్‌కు పెద్దగా ఛాన్సులు ఇవ్వరు.. ఇది ఫ్యాన్స్ నుంచి ఎక్కువగా వినపడే మాటలు. ఇక తాజాగా అఫ్ఘానిస్థాన్‌పై టీ20 సిరీస్‌లోనూ శాంసన్‌ని తుది జట్టులోకి తీసుకోలేదు.
సౌతాఫ్రికాపై సెంచరీ:
గత(2023) డిసెంబర్‌లో భారత్, దక్షిణాఫ్రికా మధ్య మూడు వన్డేల సిరీస్ జరిగింది. ఈ సిరీస్‌లోని ఆఖరి మ్యాచ్‌లో సంజూశాంసన్ సెంచరీతో సత్తా చాటాడు. 114 బంతుల్లో 108 రన్స్ చేశాడు. ఇక ఆ తర్వాత భారత్ దక్షిణాఫ్రికాతో టెస్టు సిరీస్ ఆడింది. ఇక జనవరి 11 నుంచి అఫ్ఘాన్‌తో టీ20 సిరీస్ మొదలుపెట్టింది. మొదటి మ్యాచ్ మొహాలిలో జరగగా.. రెండో మ్యాచ్ ఇండోర్‌లో జరిగింది. ఈ రెండు మ్యాచ్‌ల్లోనూ సంజూశాంసన్‌కు తుది జట్టులో స్థానం దక్కలేదు. కీపర్‌గా జితేశ్ శర్మకు ఛాన్స్ ఇచ్చారు. ఈ రెండు మ్యాచ్‌లు కలిపి జితేశ్ 31 రన్స్ మాత్రమే చేయగలిగాడు. దీంతో సంజూను ఆడించాల్సిందంటూ ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు.
ఒక్క ఛాన్స్‌తో ఎలా:
ఈ ఏడాది(2024)జూన్‌లో టీ20 వరల్డ్‌కప్(T20 World Cup) జరగనుంది. ఈ వరల్డ్‌కప్ కోసం వికెట్ కీపర్ బ్యాటర్‌గా సంజూని ఆడించాలన్న డిమాండ్ పెరుగుతోంది. దీనిపై మాజీ క్రికెటర్, కామెంటేటర్ ఆకాశ్‌చోప్రా కామెంట్స్ చేశారు. ఒక్క మ్యాచ్‌లోనే ఆడించడం ఏ మాత్రం కరెక్ట్ కాదన్నాడు ఆకాశ్‌చోప్రా. ఎవర్ని అయినా పరీక్షించాలంటే కనీసం వరుసగా మూడు మ్యాచ్‌ల్లోనైనా ఛాన్స్ ఇవ్వాలని చెప్పుకొచ్చాడు. ఇది సంజూకైనా, జితేశ్‌కైనా వర్తిస్తుందన్నాడు. 'మీరు సంజూ ఆడినట్లు భావిస్తే, ఒక్క మ్యాచ్‌తో అతడిని అంచనా వేస్తారా? ఇది సరికాదు. మీరు ఎవర్ని ప్రయత్నించినా, అతనికి కనీసం మూడు అవకాశాలు ఇవ్వండి. సంజు కెరీర్‌లో ఇదే జరిగింది' అని చోప్రా తెలిపారు.
Also Read: వివాహితను ప్రేమించానని వెంటపడి..భర్తను చంపిన ప్రేమోన్మాది
WATCH: