Train Accident : పట్టాలు తప్పిన సబర్మతీ సూపర్‌ ఫాస్ట్‌ ఎక్స్‌ప్రెస్‌!

రాజస్థాన్‌ లోని అజ్మీర్‌లోని మదార్ రైల్వే స్టేషన్ సమీపంలో ఘోర రైలు ప్రమాదం జరిగింది. సబర్మతి-ఆగ్రా సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ రైలు పట్టాలు తప్పింది. రైలు ఇంజన్‌తో పాటు 4 కోచ్‌లు పట్టాలు తప్పాయి.

New Update
Train Accident : పట్టాలు తప్పిన సబర్మతీ సూపర్‌ ఫాస్ట్‌ ఎక్స్‌ప్రెస్‌!

Rajasthan : రాజస్థాన్‌(Rajasthan) లోని అజ్మీర్‌(Ajmer) లోని మదార్ రైల్వే స్టేషన్ సమీపంలో ఘోర రైలు ప్రమాదం(Train Accident) జరిగింది. రైలు నంబర్ 12548 సబర్మతి-ఆగ్రా సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్(Sabarmati-Agra Superfast Express) రైలు పట్టాలు తప్పింది. రైలు ఇంజన్‌తో పాటు 4 కోచ్‌లు పట్టాలు తప్పాయి. ప్రమాదం చాలా తీవ్రంగా జరిగినట్లు తెలుస్తుంది. ఎందుకంటే ట్రాక్‌ పట్టాలు లేచి పక్కకు పడిపోయాయి.

అయితే ఈ ప్రమాదంలో ప్రయాణికులెవరూ గాయపడకపోవడం విశేషం. అయితే ప్రమాదం జరిగిన గంట తర్వాత కూడా రైల్వే సీనియర్‌ అధికారులు ఎవరూ ఘటనా స్థలానికి చేరుకోకపోవడం గమనార్హం. దీంతో అర్థరాత్రి సమయంలో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఎటు వెళ్లలేని స్థితిలో ప్రయాణికులంతా కూడా రైలు వద్దే ఉండిపోయారు.

రైల్వేశాఖ ప్రయాణికులకు ఎలాంటి ఏర్పాట్లు చేయలేదు. ఇలాంటి పరిస్థితుల్లో రైల్వే యంత్రాంగంపై ప్రయాణికులు తీవ్ర విమర్శలు చేశారు. ప్రమాదం తర్వాత సబర్మతి-ఆగ్రా కాంట్ ఎక్స్‌ప్రెస్‌ను మార్వార్ మీదుగా ఆగ్రా వైపు పంపారు. ప్రమాదం జరిగిన సమయంలో రైలులో పెద్ద సంఖ్యలో ప్రయాణికులు కూడా ఉన్నారు. అయితే ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. రైల్వే యంత్రాంగం హెల్ప్ డెస్క్ నంబర్- 01452429642 జారీ చేసింది. అదే సమయంలో, 4 కోచ్‌లను తొలగించిన తర్వాత, మరో ఇంజిన్ సహాయంతో మొత్తం రైలును 3.16 గంటలకు అజ్మీర్ స్టేషన్‌కు తిరిగి పంపించారు.

అజ్మీర్ రైలు ప్రమాదం .. అనేక రైళ్లు రద్దు

రైలు ప్రమాదంతో రైళ్ల రాకపోకలు దెబ్బతిన్నాయి. ఈ మార్గంలో నడిచే 6 రైళ్లను రద్దు చేసిన రైల్వే రెండు రైళ్ల రూట్‌ను మార్చింది. ప్రస్తుతం రైల్వే అధికారులు, ఉద్యోగులు ట్రాక్ మరమ్మతుల్లో నిమగ్నమై ఉన్నారు.

రైలు నెం. 12065, అజ్మీర్-ఢిల్లీ సరాయ్ రోహిల్లా 18.03.24న రద్దు
రైలు నెం. 22987, అజ్మీర్-ఆగ్రా ఫోర్ట్ 18.03.24న రద్దు
రైలు నెం. 09605, అజ్మీర్-గంగాపూర్ సిటీ 18.03.24న రద్దు
రైలు నెం. 09639, అజ్మీర్-రేవారి 18.03.24న రద్దు
రైలు నెం. 19735, జైపూర్-మార్వార్ 18.03.24న రద్దు
రైలు నెం. 19736, మార్వార్-జైపూర్ 18.03.24న రద్దు

ఈ రైళ్ల రూట్ మార్చారు

రైలు నం. 12915, సబర్మతి-ఢిల్లీ రైలు సర్వీస్ దొరై-మదార్ (అజ్మీర్ మినహా) మీదుగా రూట్‌ మార్చారు.
రైలు నెం. 17020, హైదరాబాద్-హిసార్ రైలు సర్వీస్ ఆదర్శ్ నగర్-మదర్ (అజ్మీర్ మినహా) మీదుగా మళ్లించడం జరిగింది.

Also Read : అరుణాచల్‌ ప్రదేశ్‌ మాదే అంటున్న చైనా!

Advertisment
తాజా కథనాలు