Ajay Ghosh : నా దృష్టిలో సుకుమార్ డైరెక్టరే కాదు.. అజయ్ ఘోష్ షాకింగ్ కామెంట్స్!

ప్రముఖ నటుడు అజయ్ ఘోష్ తాజా ఇంటర్వ్యూలో తన దృష్టిలో సుకుమార్ డైరెక్టర్ కాదని, తానేంటో తనకు తెలిసేలా చేసిన గురువని అన్నాడు. ఒకానొక టైం లో తన కెరీర్ అయిపోయిందనుకున్నానని, అప్పుడు సుకుమార్‌ ఇచ్చిన అవకాశంతోనే మళ్లీ ఫామ్‌లోకి వచ్చానని తెలిపారు.

Ajay Ghosh : నా దృష్టిలో సుకుమార్ డైరెక్టరే కాదు.. అజయ్ ఘోష్ షాకింగ్ కామెంట్స్!
New Update

Senior Actor Ajay Ghosh About Director Sukumar : టాలీవుడ్ సీనియర్ ప్రముఖ నటుడు అజయ్ ఘోష్ తాజాగా డైరెక్టర్ సుకుమార్ పై షాకింగ్ కామెంట్స్ చేశాడు. తన దృష్టిలో సుకుమార్ డైరెక్టర్ కాదని అన్నారు. తన కొత్త సినిమా 'మ్యూజిక్ షాప్ మూర్తి' (Music Shop Murthy) ప్రమోషన్స్ లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న సుకుమార్ గురించి ఆయన పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు.

నేనెంతో తెలిసేలా చేసిన గురువు..

తాజా ఇంటర్వ్యూలో పాల్గొన్న అజయ్ ఘోష్ తన జీవితాన్నే మార్చాడని, ఒకానొక టైం లో తన కెరీర్ అయిపోయిందనుకున్నానని, అప్పుడు సుకుమార్‌ ఇచ్చిన అవకాశంతోనే మళ్లీ ఫామ్‌లోకి వచ్చానని తెలిపారు. " అందరికీ సుకుమార్‌ ఓ దర్శకుడు. నా దృష్టిలో ఆయన డైరెక్టర్‌ కాదు.. నేనేంటో నాకు తెలిసేలా చేసిన గురువు. కొవిడ్‌ బారిన పడ్డాక కెరీర్‌ ముగిసిపోయిందని అనుకున్నా. ‘పుష్ప’ లో (Pushpa Movie) నటించేందుకు సుకుమార్‌ అడగ్గా నా వల్ల కాదని చెప్పా. అయినా వదలకుండా నాతో అరగంట మాట్లాడారు. ఆ మోటివేషన్‌తో వెంటనే చిత్రీకరణకు హాజరయ్యాను" అని అన్నాడు.

Also Read : టాలీవుడ్ యంగ్ హీరో సినిమాతో రీ ఎంట్రీ ఇస్తున్న మీరా జాస్మిన్.. అదిరిపోయిన ఫస్ట్ లుక్!

దానికి ఎలాంటి బాధ లేదు...

కాగా పుష్ప పార్ట్-1 లో అజయ్ ఘోష్ కొండారెడ్డి పాత్రలో నటించాడు. ఆ పాత్ర పార్ట్- 1 లోనే చనిపోతుంది. అయితే ఇదే విషయమై ‘పుష్ప 2’ లో మీ క్యారెక్టర్‌ లేకపోవడం బాధగా ఉందా? అని యాంకర్ అడిగితే.. దానికి అజయ్ ఘోష్ ఇలా బదులిచ్చారు.." నాకు ఎలాంటి బాధ లేదు. ‘పుష్ప 2’ గురించి ఎవరైనా ప్రస్తావించాల్సి వస్తే కచ్చితంగా ‘పుష్ప’ గురించి మాట్లాడాల్సిందే. పార్ట్‌1 గురించి చర్చిస్తే కొండారెడ్డి పేరు ఉండాల్సిందే. సుకుమార్ నా కోసం మరో చిత్రంలో అద్భుతమైన పాత్ర సృష్టిస్తారు" అంటూ చెప్పుకొచ్చాడు. దీంతో అజయ్ ఘోష్ చేసిన ఈ కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.

#director-sukumar #pushpa #ajay-ghosh
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe