/rtv/media/post_attachments/wp-content/uploads/2024/04/FotoJet-2024-04-02T153846.852-jpg.webp)
Maidaan Trailer: అమిత్ రవీందర్నాథ్ శర్మ దర్శకత్వంలో బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవగన్ నటించిన లేటెస్ట్ చిత్రం 'మైదాన్'. భారత ప్రముఖ ఫూట్ బాల్ కోచ్ సయ్యద్ అబ్దుల్ రహీమ్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమాలో అజయ్ దేవగన్ కోచ్ గా ఆయన పాత్రను పోషించారు. బెంగాలీ నటుడు రుద్రనీల్ ఘోష్, ప్రియమణి, గజరాజ్ రావు కీలక పాత్రల్లో నటించారు. స్పోర్ట్స్ బయోపిక్ గా రూపొందిన ఈ చిత్రాన్ని స్టూడియోస్, బోనీ కపూర్, అరుణవ జాయ్ సేన్‌గుప్తా, ఆకాష్ చావ్లా సంయుక్తంగా నిర్మించారు. ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్ సంగీతం అందించారు.
మైదాన్ ట్రైలర్
అయితే తాజాగా ఈ సినిమాకు సంబంధించి అదిరిపోయే అప్డేట్ ఇచ్చారు మేకర్స్. నేడు అజయ్ దేవగన్ పుట్టిన రోజు సందర్భంగా మూవీ ట్రైలర్ ను రిలీజ్ చేశారు. ఇందులో అజయ్, ప్రియమణి, గజరాజుల పాత్రలు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. ముఖ్యంగా 'మైదానం బయట మీ పదకొండుమంది వేరు వేరు కావచ్చు.. ఒక్కసారి ఆట బరిలోకి దిగాక మీ ఆలోచన.. మీ వ్యూహం.. ఒకేలా ఉండాలి అంటూ అజయ్ చెప్పిన డైలాగ్ హైలెట్ గా నిలిచింది. ఇప్పటికే ప్రేక్షకులలో భారీ అంచనాలను ఏర్పర్చిన ఈ మూవీ ఏప్రిల్ 10న విడుదల కానుంది.
'మైదాన్' మూవీ స్టోరీ
1952 , 1962 బ్యాక్ డ్రాప్ గా సాగే ఈ చిత్రం.. భారతదేశంలో క్రీడను విప్లవాత్మకంగా మార్చిన గౌరవనీయులు ఫుట్‌బాల్ కోచ్ సయ్యద్ అబ్దుల్ రహీం జీవిత కథను వివరిస్తుంది. భారత ఫుట్‌బాల్ జట్టు విజయానికి అతను చేసిన కృషి.. ఎదుర్కున్న సవాళ్ళను తెలిపే కథే ఈ సినిమా.
Dil EK, Samaj EK, Soch EK! Witness the untold true story of S.A. Rahim and his #TeamIndia, aajao #Maidaan mein, in Cinemas 10th April! 🇮🇳🏆#MaidaanFinalTrailer Out Now! ⚽#MaidaanInIMAX#MaidaanOnEid#MaidaanOnApril10#AajaoMaidaanMein@ajaydevgn #PriyamaniRaj @raogajraj… pic.twitter.com/1aezEjaKjx
— Boney Kapoor (@BoneyKapoor) April 2, 2024
Also Read: Gaami Ott Release: ఓటీటీలోకి మాస్ కా దాస్ సూపర్ హిట్ మూవీ.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే..?