Free Netflix Plan: ఎయిర్‌టెల్ రీఛార్జ్ చేయండి.. ఉచితంగా నెట్‌ఫ్లిక్స్ చూడండి!

ఎయిర్‌టెల్ ఎప్పటికప్పుడు ఫ్రీ ఓటీటీ సబ్‌స్క్రిప్షన్స్‌ అందించే రీఛార్జ్ ప్లాన్స్‌ ప్రవేశపెడుతుంటుంది. ఇప్పటికే అమెజాన్ ప్రైమ్ వీడియో, డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ వంటి OTTలకు ఫ్రీ సబ్‌స్క్రిప్షన్స్‌ అందిస్తోంది. తాజాగా ఈ కంపెనీ మరొక కొత్త ఎంటర్‌టైన్‌మెంట్ ప్లాన్‌ను ప్రారంభించింది,

New Update
Free Netflix Plan: ఎయిర్‌టెల్ రీఛార్జ్ చేయండి.. ఉచితంగా నెట్‌ఫ్లిక్స్ చూడండి!

Airtel Free Netflix Subscription: టెలికాం కంపెనీలు ఇప్పుడు వివిధ రీఛార్జ్ ప్లాన్లతో ఎంటర్‌టైన్‌మెంట్‌ సర్వీసులను సైతం కాంప్లిమెంటరీగా అందిస్తున్నాయి. దాదాపు అన్ని సంస్థలు ఇందుకు స్పెషల్ ప్లాన్స్ లాంచ్ చేస్తున్నాయి. ముఖ్యంగా ఎయిర్‌టెల్ (Airtel), ఎప్పటికప్పుడు ఫ్రీ ఓటీటీ సబ్‌స్క్రిప్షన్స్‌ అందించే రీఛార్జ్ ప్లాన్స్‌ ప్రవేశపెడుతుంటుంది. ఆల్రెడీ వివిధ రకాల ప్లాన్స్‌ ద్వారా అమెజాన్ ప్రైమ్ వీడియో, డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ వంటి OTTలకు ఫ్రీ సబ్‌స్క్రిప్షన్స్‌ అందిస్తోంది. తాజాగా ఈ కంపెనీ మరొక కొత్త ఎంటర్‌టైన్‌మెంట్ ప్లాన్‌ను ప్రారంభించింది, యూజర్లు దీనితో నెట్‌ఫ్లిక్స్ (Netflix) బేసిక్ సబ్‌స్క్రిప్షన్‌ను ఫ్రీ గా పొందవచ్చు.

Also Read: T20 ప్రపంచ కప్ అధికారిక గీతం విడుదల

అంతేకాదు, యూజర్లకు అన్‌లిమిటెడ్ 5G డేటా లభిస్తుంది. వాయిస్ కాల్స్‌ అన్‌లిమిటెడ్‌గా చేసుకోవచ్చు. ఈ ప్లాన్ ధర రూ.1,499. దీనిలో డైలీ 3GB డేటా, 100 SMSలు పొందవచ్చు. దీని వ్యాలిడిటీ 84 రోజులు. ఈ ప్లాన్‌తో లభించే ఉచిత నెట్‌ఫ్లిక్స్ బేసిక్ సబ్‌స్క్రిప్షన్‌తో, ప్లాట్‌ఫామ్‌లోని సినిమాలు, షోలను చూడవచ్చు. 5G నెట్‌వర్క్‌లో అందుబాటులో ఉన్న ప్రాంతాలలో అధిక వేగంతో అన్‌లిమిటెడ్ డేటాను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు, వెబ్‌ బ్రౌజింగ్ చేయవచ్చు.

వీటితో పాటు అపోలో 24|7 సర్కిల్ సబ్‌స్క్రిప్షన్‌ ఉచితంగా లభిస్తుంది. ఈ సభ్యత్వంతో డాక్టర్లతో అపాయింట్‌మెంట్స్‌ బుక్ చేసుకోవచ్చు, మందులు ఆర్డర్ చేయవచ్చు. అలాగే ఉచిత హలోట్యూన్స్‌ కూడా పొందవచ్చు, ఫోన్‌కు కస్టమ్ రింగ్‌టోన్స్‌ను సెట్ చేసుకోవచ్చు. వింక్ మ్యూజిక్ (Wync Music) ప్రీమియం కంటెంట్‌కు ఫ్రీగా యాక్సెస్ పొందవచ్చు. వింక్ మ్యూజిక్ యాప్‌లో లక్షలాది పాటలను వినవచ్చు.

Advertisment
Advertisment
తాజా కథనాలు