Airtel, Jio కస్టమర్లకు షాక్.. ఎన్నికల తర్వాత ఏం జరుగుతుందో తెలుసా?

దేశ టెలికాం కంపెనీల్లో రిలయన్స్, భారతీ ఎయిర్ టెల్ మధ్య తీవ్ర పోటీ నెలకొన్న సంగతి తెలిసిందే. జియో వచ్చాక, ఎయిర్ టెల్ హవా తగ్గింది. అయితే ఇప్పుడు ఎయిర్ టెల్..టెలికాం ఛార్జీల ధరలను పెంచేందుకు రెడీ అవుతోంది.జియో మాత్రం మరోకొత్త పంథాలో ముందుకు వెళ్లేందుకు ప్రయత్నాలు చేస్తోంది.

Mobile Recharge: ఎన్నికల తర్వాత మీ జేబుకు చిల్లు..పెరగనున్న మొబైల్ రీఛార్జ్ ప్లాన్స్ ధరలు..!
New Update

Airtel, Jio to Hike Tariffs: Airtel, Jio ప్రముఖ టెలికాం ఆపరేటర్ భారతీ ఎయిర్‌టెల్ ప్రీపెయిడ్ ప్లాన్‌లు ఖరీదైనవిగా మారనున్నాయి. లోక్‌సభ ఎన్నికల (Lok Sabha Elections) తర్వాత, వినియోగదారులు మొబైల్ రీఛార్జ్ పెంచే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ విషయంలో దిగ్గజ సంస్థలు ఎయిర్ టెల్, రిలయన్స్ జియో తమ వ్యూహాలను ఇప్పటికే రెడీ చేసుకుంటున్నాయి. తమ ప్లాన్ ధరలను పెంచడం ద్వారా ఒక వినియోగదారుని వచ్చే సగటు ఆదాయం పెంచుకోవాలని ఎయిర్ టెల్ భావిస్తుంది. మరోవైపు ప్యాకేజీ ధరలు పెంచకుండా డేటా వినియోగాన్ని మరింత పెంచి దీనితో అధికధరలు గల ప్యాకేజీల వైపు కస్టమర్లను  మళ్లించాలనేది జియో (JIO) ప్లాన్ అని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి.

జియోతో చూస్తే ఎయిర్ టెల్ (Airtel) ప్లాన్స్ ఇప్పటికే కాస్త ఎక్కువగా ఉన్న విషయం తెలిసిందే. ముందు నుంచి ఆ కంపెనీ తన యూజర్ నుంచి వచ్చే సగటు ఆదాయం క్రమం పెంచుకుంటోంది. జియో సగటు ఆదాయం మాత్రం స్థిరంగానే కొనసాగుతోంది. ఇప్పుడు ఐపీఎల్ సీజన్ నడుస్తోంది. దీంతో డేటా వినియోగం పెరుగుతుందని ఈ క్రమంలోనే అధిక లాభం పొందవచ్చని జియో భావిస్తోంది.

ప్రస్తుతానికి జియో సినిమా ప్రసారాలు వినియోగదారులకు ఫ్రీగానే అందిస్తోంది జియో. దీంతో ప్రస్తుతం ఐపీఎల్ మ్యాచులు ప్రత్యక్ష ప్రసారం అవుతున్నాయి. వీక్షణ అనుభూతి మెరుగుపరచుకోవడం కోసం వినియోగదారులు ఎక్కువ డేటా వెచ్చిస్తారని ఇండస్ట్రీ వర్గాలు భావిస్తున్నట్లు జాతీయ మీడియాల్లో కథనాలు వస్తున్నాయి. దీంతో టారిఫ్ రేట్లు పెంచుకుండానే లాభాలు ఆర్జించవచ్చన్నది జియో వ్యూహంగా తెలుస్తోందని చెబుతున్నారు విశ్లేషకులు.

ఎయిర్ టెల్ మాత్రమే వినియోగదారుల నుంచి వచ్చే ఆదాయం పెంచుకునేందుకు ప్లాన్ ధరల్లో మార్పులు చేయవచ్చని భావిస్తును్నారు. ఎన్నికలు పూర్తయిన తర్వాత ఈ టారిఫ్ పెంపు నిర్ణయం ప్రకటించే అవకాశం ఉందని భావిస్తున్నారు. జులై -అక్టోబర్ మధ్య 15శాతం వరకు టారిఫ్లు పెంచవచ్చని చెబుతున్నారు. ప్రస్తుతానికి ఎయిర్ టెల్ లో యూజర్ నుంచి పొందే సగటు ఆదాయం రూ. 208 ఉంది. జియోలో ఇది రూ. 182 గా ఉంది. వొడాఫోన్ ఐడియాలో రూ. 145 అయితే మార్కెట్ వాటా పరంగా చూస్తే జియో అగ్రగామిగా ఉంది. ఎయిర్ టెల్ రెండో స్థానంలో ఉంటే 18శాతం వాటాతో వొడా ఐడియా మూడో స్థానంలో ఉంది.

ఇది కూడా చదవండి:  ఏపీ యువతకు అదిరిపోయే శుభవార్త.. ఫ్రీగా ఆన్లైన్ సర్టిఫికేట్ కోర్సు!

#airtel #tech-news #airtel-free-offers #recharge-offer
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe