Delhi air polution:ఢిల్లీలో పెరిగిపోతున్న వాయు కాలుష్యం..లాక్ డౌన్ విధించే ఛాన్స్

ఢిల్లీ పరిస్థితి దారుణంగా తయారైంది. మామూలుగా ఎప్పుడూ దీపావళి సీజన్ లో స్టార్ట్ అయ్యే వాయు కాలుష్యం ఈ సారి ముందుగానే మొదలైపోయింది. చాలా ఎక్కువగా కూడా ఉంది. అక్కడి ప్రజలు ఊపిరి పీల్చుకోవడానికి కూడా ఇబ్బందులు పడుతున్నారు. దీంతో ఢిల్లీలో లాక్ డౌన్ విధిస్తారు అని సమాచారం.

New Update
Delhi air polution:ఢిల్లీలో పెరిగిపోతున్న వాయు కాలుష్యం..లాక్ డౌన్ విధించే ఛాన్స్

ఢిల్లీ పరిస్థితి రోజురోజుకూ దిగజారిపోతోంది. అక్కడి వాయు కాలుష్యం పరిగిపోతూనే ఉంది. దీపావళికి ముందే ఇలా ఉంది అంటే పండగ తర్వాత ఇంకెలా ఉంటుందా అని భయపడుతున్నారు ఢిల్లీ వాసులు. ఇంట్లో నుంచి బయటకు వస్తే ఏమవుతుందా అని భయపడే స్థితిలో ఉన్నారు. ప్రస్తుతం ఢిల్లీలో ఏక్యూఐ 266గా ఉంది. ఇది మధ్యాహ్నానానికి 330కి చేరుకుంటోందని సిస్టమ్ ఆఫ్ ఎయిర్ క్వాలిటీ అండ్ వెదర్ ఫోర్ కాస్టింగ్ అండ్ రిసెర్చ్ చెబుతోంది. పరిస్థితులు ఇలాగే కొనసాగితే లాక్ డౌన్ తప్పదని నిపుణులు అంటున్నారు.

Also Read:తెలంగాణలో తగ్గిన రాత్రి ఉష్ణోగ్రతలు..వణుకుతున్న హన్మకొండ

ఢిల్లీ వాతావరణం గురించి ఎయిర్ క్వాలిటీ కమిషన్ భయందోళనను వ్యక్తం చేస్తోంది. ఇది మరింత ఎక్కువ అవుతుందని చెబుతోంది. పక్క రాష్ట్రాల్లో పంట అయిపోయాక తగులబెట్టే దాని నుంచి వచ్చే పొగతో ఢిల్లీ ఎయిర్ క్వాలిటీ మరింత తగ్గుతుందని చెబుతోంది. దీనివలన ఎప్పటిలాగే దీపావళి పండుగ రోజు టపాసులు కాల్చడం గవర్నమెంట్ నిషేధిస్తుందని అంటోంది. ప్రజలు కూడా సొంత వాహనాలకు బదులుగా ప్రజా రవాణా ఉపయోగించాలని ఎయిర్ క్వాలిటీ కమిషన్ సూచిస్తోంది. పార్కింగ్ ఫీజులను పెంచాలని, ఎలక్ట్రిక్ బస్సులు, మెట్రో సర్వీసులను పెంచాలని కూడా ఆదేశాలు జారీ చేశారు. మరిన్ని ఆంక్షలు కూడా విధించే అవకాశం ఉంది.

Also Read:దేవరగట్టు సమరంలో వందమందికి గాయాలు

మొత్తానికి ఢిల్లీలో లాక్ డౌన్ విధించే అవకాశాలున్నాయి. అక్కడి కాలుష్యం స్టేజ్ 3కి చేరుకుంటే బీఎస్-3, 4 వెహికల్స్ ను నిషేధిస్తారు. దాంతో పాటూ రైల్వే, ఆసుపత్రులు, మెట్రో, హైవేలు, రోడ్లు తప్ప మిగతావి అన్నీ మూసేసే అవకాశం ఉంది. అలాగే సూళ్ళకు సెలవు ప్రకటించొచ్చు. ఉద్యోగులను కూడా ఇంటి నుంచి పనులు చేయాలని ఆర్డర్లు పాస్ చేస్తారని చెబుతున్నారు. వాహనాలకు సంబంధించి బేసి-సరి ఫార్ములాను తిరిగి అమలు చేస్తారని అంటున్నారు.

Advertisment
తాజా కథనాలు