Israel vs Hamas: హామాస్ మిలిటెంట్లు, ఇజ్రాయెల్ సైన్యం మధ్య భీకర యుద్ధం జరుగుతున్న నేపథ్యంలో ఎయిర్ ఇండియా కీలక నిర్ణయం తీసుకుంది. ఇజ్రాయెల్‌కు వెళ్లే విమానాలను వారం రోజుల పాటు రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. అంటే అక్టోబర్ 14వ తేదీ వరకు విమానాల రాకపోకలను నిలిపివేస్తున్న ఎయిర్ ఇండియా తెలిపింది. ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేసింది.
హమాస్ మిలిటెంట్లు, ఇజ్రాయెల్ సైన్యానికి మధ్య భీకర యుద్ధం నడుస్తో్ంది. పరస్పర దాడులతో ఇటు ఇజ్రాయెల్, అటు గజా దద్దరిల్లిపోతుంది. వందలాది మంది పౌరులు ప్రాణాలు కోల్పోతున్నారు. హమాస్ ఉగ్రవాదులు.. 100 మంది ఇజ్రాయెల్ పౌరులు, సైనికులను అపహరించినట్లు తెలుస్తోంది. మొత్తంగా ఇరువైపుల తీవ్ర ప్రాణ నష్టం వాటిల్లుతోంది.
ఈ నేపథ్యంలోనే అలర్ట్ అయిన ఎయిర్ ఇండియా.. ఇజ్రాయెల్‌లో నెలకొన్ని పరిస్థితుల దృష్ట్యా భారత్ నుంచి అక్కడి విమానాల రాకపోకలను నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. ‘ప్రయాణికులు, సిబ్బంది భద్రత దృష్ట్యా.. టెల్ అవీవ్‌కు రాకపోకలు సాగించే ఎయిర్ ఇండియా విమానాలను అక్టోబరు 14 వరకు నిలిపివేస్తున్నాం’ అని సంస్థ ఒక ప్రకటనలో తెలిపింది. ఈ తేదీల్లో టికెట్ కన్ఫామ్ అయిన ప్రయాణికులకు అన్ని విధాలా సహాయమందిస్తామని తెలిపింది.
పారాచూట్‌ల సహాయంతో ఇజ్రాయెల్‌లోకి దిగుతున్న హమాస్ మిలిటెంట్లు..
Also Read:
ఎదురుతిరగడంతో యువతిని కాల్చిన కిరాతకులు..ఇజ్రాయెల్‌లో ఇంత దారుణమా..!
Bandla Ganesh: కూకట్‌పల్లి టికెట్ నాకే..బండ్ల గణేశ్ సంచలన ట్వీట్..!