Air India Flight: అమెరికా వెళ్తున్న ఎయిర్ ఇండియా విమానం రష్యాలో అత్యవసర ల్యాండింగ్ 

ఢిల్లీ నుంచి శాన్‌ఫ్రాన్సిస్కో వెళ్తున్న ఎయిర్‌ ఇండియా విమానం (ఏఐ-183) సాంకేతిక కారణాలతో అత్యవసరంగా ల్యాండింగ్‌ చేయాల్సి వచ్చింది. రష్యాలోని క్రాస్నోయార్స్క్ అంతర్జాతీయ విమానాశ్రయంలో విమానం దిగింది.

New Update
Air India Flight: అమెరికా వెళ్తున్న ఎయిర్ ఇండియా విమానం రష్యాలో అత్యవసర ల్యాండింగ్ 

Air India Flight: ఢిల్లీ నుంచి శాన్‌ఫ్రాన్సిస్కో వెళ్తున్న ఎయిర్‌ ఇండియా విమానం (ఏఐ-183) సాంకేతిక కారణాలతో అత్యవసరంగా ల్యాండింగ్‌ చేయాల్సి వచ్చింది. రష్యాలోని క్రాస్నోయార్స్క్ అంతర్జాతీయ విమానాశ్రయంలో విమానం దిగింది. ఈ మేరకు ఎయిర్ ఇండియా సమాచారం ఇచ్చింది. సంబంధిత అధికారులతో కలిసి పని చేస్తున్నామని ఎయిర్ ఇండియా తెలిపింది.  ప్రయాణీకులు - సిబ్బంది భద్రత ఎయిర్ ఇండియా ప్రధాన ప్రాధాన్యతగా ఉంటుందని చెప్పింది.

గతనెలలో కూడా..
Air India Flight: గత నెలలో ఢిల్లీ నుంచి వారణాసి వెళ్తున్న ఇండిగో విమానంలో బాంబు ఉందన్న వార్త కలకలం రేపింది. ఆ తర్వాత ప్రయాణికులను త్వరగా విమానం నుంచి దించేశారు. దీనికి సంబంధించిన వీడియోను కూడా బయటపెట్టారు. ఇందులో ఎమర్జెన్సీ గేటు నుంచి ప్రజలను ఖాళీ చేయించడం కనిపించింది. అంతే కాదు, ఈ సమయంలో చాలా మంది ప్రయాణికులు ఫ్లైట్ నుండి దూకడం కూడా కనిపించింది. బాంబు హెచ్చరికతో ఢిల్లీ విమానాశ్రయంలో భయానక వాతావరణం నెలకొంది.

Air India Flight: విమానంలోని బాత్‌రూమ్‌లో టిష్యూ పేపర్‌పై రాసి ఉన్న బాంబు ఉందనే మెసేజ్ ను గుర్తించారు. ఆ తర్వాత ప్రయాణీకుల్ని అలెర్ట్ చేశారు. 30 నిమిషాల్లో బాంబు పేలుడు అని ఆ మెసేజ్ లో ఉంది.  ఈ సందేశాన్ని 6E2211 విమానంలో పైలట్ చూశారు. టేకాఫ్‌కు ముందు జరిగిన ఈ ఘటన సమయంలో విమానంలో 175 మంది ప్రయాణికులు ఉన్నారు. ఈ సంఘటన మే 15వ తేదీ రాత్రి 7.30 గంటలకు జరిగింది. స్టాండర్డ్ సేఫ్టీ ప్రోటోకాల్‌లను అనుసరించి ప్రయాణికులను సురక్షితంగా దింపారు. దీని తర్వాత, భద్రతా సంస్థల విచారణ కోసం విమానాన్ని ఏకాంత ప్రదేశానికి తరలించారు. ఈ సమయంలో అనుమానాస్పదంగా ఏమీ దొరకలేదు. 

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు