AIR India : ఎయిర్ ఇండియా బంపర్ ఆఫర్..రూ. 1470కే దుబాయ్, యూరప్ వెళ్లే ఛాన్స్..!!

స్పైస్ జెట్ తర్వాత ఎయిర్ ఇండియా కూడా బంపర్ ఆఫర్ ను ప్రకటించింది. కేవలం రూ. 1470కే విమానం ప్రయాణించే అవకాశాన్ని కలిపిస్తోంది. ఎంపిక చేసిన దేశీయ, అంతర్జాతీయ మార్గాల్లో ఈ ఆఫర్ అందుబాటులో ఉంటుంది.

New Update
AIR India : ఎయిర్ ఇండియా బంపర్ ఆఫర్..రూ. 1470కే దుబాయ్, యూరప్ వెళ్లే ఛాన్స్..!!

AIR India Sale: విమానంలో ప్రయాణించాలనుకునేవారికి గుడ్ న్యూస్ చెప్పింది ఎయిర్ ఇండియా. స్పైస్‌జెట్ (SpiceJet) తర్వాత టాటా గ్రూప్‌కు చెందిన ఎయిర్ ఇండియా కూడా చౌక ప్రయాణించే అవకాశాన్ని కల్పిస్తోంది. నాలుగు రోజుల ప్రత్యేక విక్రయాలను కంపెనీ ప్రారంభించింది. దేశీయ, అంతర్జాతీయ రూట్ నెట్‌వర్క్‌లో కంపెనీ ఈ 96 గంటల విక్రయాన్ని ప్రారంభించింది. దీని కింద దేశీయ రూట్లలో వన్‌వే టికెట్ (One way ticket) ధర ఎకానమీ క్లాస్‌కు రూ.1,470, బిజినెస్ క్లాస్‌కు రూ.10,130 నుంచి ప్రారంభం అవుతుంది. ఎంపిక చేసిన అంతర్జాతీయ మార్గాల టిక్కెట్లను కూడా అదే ధరకు కొనుగోలు చేయవచ్చు. ఈ ఆఫర్ ఎయిర్ ఇండియా (AIR India) వెబ్‌సైట్, మొబైల్ యాప్ ద్వారా బుకింగ్ చేస్తే అందుబాటులో ఉంటుంది.

ఆగస్టు 17 నుండి ప్రారంభమైన ఈ సేల్ ఆగస్టు 20 వరకు కొనసాగుతుంది. మీ ప్రయాణ తేదీ సెప్టెంబర్ 1, 2023 నుండి అక్టోబర్ 31, 2023 మధ్య ఉన్నప్పుడు మాత్రమే ఈ ఆఫర్ ప్రయోజనం పొందవచ్చు. ఎయిరిండియా ఇటీవలే టాటా గ్రూపు కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. ఎయిరిండియాకు తిరిగి పూర్వ వైభవం తీసుకురావడానికి టాటా గ్రూప్ (TATA Group) సమగ్ర ప్రణాళికను రూపొందించింది. అంతకుముందు, స్పైస్‌జెట్ ప్రత్యేక ఇన్‌క్రెడిబుల్ ఇండిపెండెన్స్ డే సేల్‌ను కూడా ప్రకటించింది. ఆగస్టు 14న ప్రారంభమైన ఈ సేల్ ఆగస్టు 20 వరకు కొనసాగుతుంది. ఇందులో, మీరు వచ్చే ఏడాది ఆగస్టు 15 నుండి మార్చి 30, 2024 వరకు టిక్కెట్లను బుక్ చేసుకోవచ్చు.

ఆఫర్ కు సంబంధించిన ముఖ్య సమాచారం:
-ఫ్లైట్ బుకింగ్ రూ. 1470 నుంచి ప్రారంభం అవుతుంది.
-ఎయిర్ ఇండియా విమాన బుకింగ్ లపై 30శాతం వరకు తగ్గింపు.
-ఎకానమీ, బిజినెస్ క్యాబిన్ లకు తగ్గింపులు వర్తిస్తాయి.
- Airindia.comద్వారా టిక్కెట్లను బుక్ చేసుకుంటే ప్రత్యేక ప్రయోజనాలు పొందవచ్చు.
-బుకింగ్ వ్యవధి ఆగస్టు 17 నుంచి ఆగస్టు 20, 2023 వరకు

కొత్త స్టైల్లో కనిపించనున్న ఎయిర్ ఇండియా :
ఈ మధ్యే ఎయిరిండియా తన కొత్త లోగోను రివిల్ చేసింది. ఎయిర్ ఇండియా కొత్త లోగో అనేది ఎయిర్ లైన్స్ ఐకానిక్ మస్కట్ మహారాజాను మార్చివేసింది. కొత్తలోగో మరింత స్టైలిష్ డిజైన్ తోపాటు రెడ్, వైట్, ఊదారంగులతో ఉంటుంది. ఇక టాటా సన్స్ తన పూర్తి అనుబంధ సంస్థ అయిన టేల్స్ ప్రైవేట్ లిమిటెడ్ ద్వారా 2022 జనవరిలో విస్తారా విలీనం కానున్నట్లు ప్రకటించింది. ఈ విలీనం మార్చి 2024నాటికి పూర్తవుతుందని భావిస్తున్నారు.

అంతేకాదు ఈ ఏడాది ఫిబ్రవరిలో ఎయిర్ ఇండియా విమానయన రంగంలో అతిపెద్ద ఒప్పందాన్ని కుదుర్చుకుంది. టాటా గ్రూప్ మొత్తం 470 విమానాలను తన ఫ్లీట్ లో చేర్చనుంది. విమానయన రంగంలో అగ్రశ్రేణి కంపెనీలైన అమెరికాకు చెందిన బోయింగ్, యూరప్ కు చెందిన ఎయిర్ బస్ లతో టాటా ఈ ఒప్పందాన్ని కుదుర్చుకుంది.

Also Read: మహిళల మీద వివక్ష చూపించే మూసపదాలు వద్దు..!!

Advertisment
తాజా కథనాలు