Air Hostess: ప్రైవేట్‌ పార్ట్స్ లో కేజీ బంగారాన్ని దాచి స్మగ్లింగ్‌ చేస్తున్న ఎయిర్‌ హోస్టెస్‌!

బంగారం తన ప్రైవేట్ పార్ట్స్‌ లో దాచి స్మగ్లింగ్‌ చేస్తున్న ఓ ఎయిర్‌ హోస్టెస్ట్‌ ను అధికారులు అరెస్ట్‌ చేశారు. సుమారు కేజీ బంగారాన్ని రహస్య భాగాల్లో దాచుకుని తరలిస్తుండగా డైరెక్టరేట్‌ ఆఫ్‌ రెవెన్యూ ఇంటెలిజెన్స్‌ అధికారులు గుర్తించి అరెస్ట్‌ చేశారు.

New Update
Air Hostess: ప్రైవేట్‌ పార్ట్స్ లో కేజీ బంగారాన్ని దాచి స్మగ్లింగ్‌ చేస్తున్న ఎయిర్‌ హోస్టెస్‌!

Air Hostess Surabhi Khatoon Gold Smuggling:  బంగారం తన ప్రైవేట్ పార్ట్స్‌ లో దాచి స్మగ్లింగ్‌ చేస్తున్న ఓ ఎయిర్‌ హోస్టెస్ట్‌ ను అధికారులు అరెస్ట్‌ చేశారు. సుమారు కేజీ బంగారాన్ని రహస్య భాగాల్లో దాచుకుని తరలిస్తుండగా డైరెక్టరేట్‌ ఆఫ్‌ రెవెన్యూ ఇంటెలిజెన్స్‌ అధికారులు గుర్తించి అరెస్ట్‌ చేశారు. డీఆర్‌ఐ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. నిందితురాలు ఎయిర్‌ ఇండియా ఎక్స్‌ప్రెస్‌కు చెందని ఎయిర్‌హోస్టెస్‌ సురభి ఖాతున్‌ గా అధికారులు గుర్తించారు.

ఈ నెల 28న మస్కట్‌ (Muscat) నుంచి కేరళ కన్నూర్‌కు (Kannur) వచ్చిన విమానంలో ఆమె క్రూ సిబ్బందిగా ఉన్నారు. విమానం కన్నూర్‌ విమానాశ్రయానికి చేరుకోగానే.. అధికారుల తనిఖీల్లో ఎయిర్‌హోస్టెస్‌ స్మగ్లింగ్ వ్యవహారం బయటపడింది.

ఆమె తన ప్రైవేట్‌ పార్ట్స్‌ లో సుమారు 960 గ్రాముల బంగారాన్ని దాచిపెట్టి అక్రమంగా తరలిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. ఈ మేరకు ఆ బంగారాన్ని స్వాధీనం చేసుకున్నట్లు డీఆర్‌ఐ అధికారులు వివరించారు. అనంతరం సురభి ఖతున్‌ను మెజిస్ట్రేట్‌ ముందు హాజరుపరచగా.. 14 రోజుల రిమాండ్‌ విధించినట్లు వెల్లడించారు.

Also read: మీరు 8 పాసయ్యారా..అయితే ఈ గొప్ప అవకాశం మీకోసమే అంటున్న టీజీఆర్టీసీ!

Advertisment
తాజా కథనాలు