UPSC: చీటింగ్‌కు చెక్..ఏఐ టెక్నాలజీతో యూపీఎస్సీ

యూపీఎస్సీ పరీక్షలకు ఏఐతో గట్టి నిఘా ఏర్పాటు చేయడానికి రెడీ అయింది. ఫేషియల్ రికగ్నైజేషన్, ఏఐ ఆధారిత సీసీటీవీలతో పర్యవేక్షణ చేయాలని నిర్ణయించింది. అభ్యర్ధులు, ఇన్విజలేట్లను అన్నివైపుల నుంచ కవర్ చేసేలా కదలికలను సైతం గుర్తుపట్టేలా ఈ కెమెరాలు ఉండనున్నాయి.

New Update
UPSC: చీటింగ్‌కు చెక్..ఏఐ టెక్నాలజీతో యూపీఎస్సీ

UPSC Exams: గత కొన్నిరోజులుగా దేశం మొత్తం పరీక్షల చీటింగ్ కేసులతో మారుమోగుతోంది. నీట్, యూజీసీ నెట్ పరీక్షల పేపర్లు లీక్ అయ్యాయి తెలియడం...నెట్ పరీక్ష రద్దవడం లాంటివి విద్యాశాఖ, ఎన్టీయేలను కుదిపేస్తున్నాయి. దీంతో ఇక మీదట నుంచి పరీక్షల నిర్వహణలో ఏఐను వాడాలని డిసైడ్ అయింది యూపీఎస్సీ. పరీక్షలో చీటింగ్ జరగకుండా ఉండేందుకు ఫేషియల్ రికగ్నైజేషన్, ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్‌తో ఉండే సీసీటీవీలను ఉపయగించాలని నిర్ణయించింది.

కేంద్ర సర్వీసు ఉద్యోగుల నియామకాల కోసం యూపీఎస్సీ.. ఐఏఎస్‌, ఐపీఎస్‌, ఐఎఫ్‌ఎస్‌లతో సహా దాదాపు 14 కీలక పరీక్షలను నిర్వహిస్తుంది. దీని కోసం లక్షల మంది పోటీ పడుతుంటారు. అయితే చాలా సార్లు ఈ పరీక్షల్లో అవకతవలు రుగుతూ ఉంటాయి. ఎప్పటికప్పుడు వీటిని నిరోధించడానికి యూపీఎస్సీ కట్టుదిట్టమైన ఏర్పాట్లను చేస్తూనే ఉంటుంది. వీటిని పర్యవేక్షించడంతోపాటు పారదర్శకంగా నిర్వహించేందుకు సాంకేతికతనూ ఉపయోగిస్తుంది. ఇప్పుడు తాజాగా ఆధార్‌-ఆధారిత వేలిముద్రల ధ్రువీకరణ, అభ్యర్థుల ముఖ గుర్తింపు, ఈ-అడ్మిట్‌ కార్డుల క్యూఆర్‌ కోడ్‌ స్కానింగ్‌, ఏఐ ఆధారిత సీసీటీవీలతో పర్యవేక్షణ వ్యవస్థలను కూడా ఉపయోగించుకోవాలని డిసైడ్ అయింది.

ప్రతీగదిలోనూ, డోర్ దగ్గర, గేట్లు, కంట్రోల్ రూమ్ దగ్గర ఇలా అన్నిచోట్లా కెమెరాలను ఏర్పాటు చేయనున్నారు. దాంతో పాటూ పరీక్షకు ముందు కానీ, తర్వాత కానీ గంట వరకు గదిలో ఉన్నా, ఇన్విజిలేటర్ అనుమానాస్పద కదలికలను ఉన్నా కెమెరాలు పసిగట్టేస్తాయి. వెంటనే అధికారులను అప్రమత్తం చేస్తాయి. ఇన్విజిలేటర్‌ లేని సమయంలో ఏఐ వెంటనే అలెర్ట్‌ ఇచ్చేలా ఏర్పాటు చేయనున్నారు.

Also Read:Telangana: కోర్టును ఆశ్రయించిన కేసీఆర్‌.. తనపై ఆ కేసు కొట్టేయాలని పిటిషన్

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు