మేఘాలయాలోని ఉమియామ్ సరస్సు వ్యర్థాలతో నిండిపోయింది. గతంలో ఎంతో అందంగా కనిపించిన ఉమియామ్ సరస్సులో ఇప్పుడు ఎటు చూసినా ప్లాస్టిక్ వ్యర్థాలే కనిపిస్తున్నాయి. సరస్సులో దుర్గందం పెరిగి పోవడంతో అటు వైపు వెళ్లాలంటే ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఈ క్రమంలో సరస్సులోని వ్యర్థాలను తొలగించాలని అక్కడి ప్రభుత్వం నిర్ణయానికి వచ్చింది.
సరస్సును పరిశుభ్రం చేసే విషయంలో అన్ని రాష్ట్రాల్లాగా కాకుండా మిజోరాం సర్కార్ కొత్తగా ఆలోచించింది. ఉమియామ్ సరస్సును ఏఐ ఆధారిత బోటుతో క్లీన్ చేయించాలని నిర్ణయించింది. ప్రభుత్వం నిర్ణయంపై మత్స్యకారులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రంలో ఉమిక్రాహ్, ఉమియార్ప్ నదులు రాజధాని గుండా ప్రవాహిస్తున్నాయి. ఈ నదులు ప్రతీ రోజు టన్నుల కొద్ది వ్యర్థాలను ఉమియామ్ సరస్సులోకి మోసుకు వస్తున్నాయి.
ప్రస్తుతం సరస్సు మొత్తం వ్యర్థాలతో నిండి పోయింది. దీంతో ఆ సరస్సులోకి వెళ్లడం ఇబ్బందిగా మారింది. ఈ క్రమంలోనే ఏఐ ఆధారిత క్లీన్ బోటుతో సరస్సును శుభ్రపరిచేందుకు నిర్ణయించామని అధికారులు తెలిపారు. సరస్సులోని వ్యర్థాలను అత్యంత తక్కువ ఖర్చుతో ఎలా తొలగించగలమో క్లీన్ బోట్ సంస్థ తమ ముందు ప్రదర్శించిందన్నారు. దీనికి ఆకర్షితులమైన తాము ఈ మేరకు నిర్ణయం తీసుకున్నామని చెప్పారు.
క్లియర్ బోట్ అనేది హాంకాంగ్ కు చెందిన కంపెనీ అని స్మార్ట్ విలేజ్ మూవ్ మెంట్ నోడల్ ధికారి, హెల్త్ సెక్రటరీ రామ్ కుమార్ తెలిపారు. ఈ క్లీన్ బోటు గంటలో సుమారు 200 నుంచి 300 కిలోల వ్యర్థాలను తొలగించగలదన్నారు. ఈ ప్రాజెక్టును సీఎం కొనార్డ్ సంగ్మా ప్రత్యేకంగా పర్యవేక్షిస్తున్నట్టు అధికారులు తెలిపారు. ఈ కంపెనీకి చెందిన బోట్లు ప్రస్తుతం వారణాసి, బెంగళూరులో పని చేస్తున్నాయన్నారు.