Google Search: ఏఐ టూల్ తో సరికొత్త సెర్చింగ్ విధానానికి స్వాగతం పలికిన గూగుల్! స్మార్ట్ ఫోన్ స్క్రీన్ పై కనిపించే ఏదైనా ఫోటో కానీ, టెక్ట్స్ లో కానీ మనకు కావాల్సిన దాని చుట్టూ రౌండప్ చేస్తే చాలు.. ఆ సర్కిల్ లో ఉన్న అంశానికి సంబంధించిన సమాచారం మొత్తం మన ముందుకు వస్తుంది.సర్కిల్ టు సెర్చ్ అనే పేరుతో తీసుకుని వచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తుంది. By Bhavana 20 Jan 2024 in బిజినెస్ టాప్ స్టోరీస్ New Update షేర్ చేయండి Google: సెర్చ్ ఇంజిన్ దిగ్గజం అయిన గూగుల్ సెర్చింగ్ (Google ) కు సంబంధించి మరో సరికొత్త టూల్ ను అందుబాటులోకి తీసుకుని వస్తున్నట్లు తెలిపింది. దీని వల్ల ఇతర యాప్ ల నుంచి బయటకు రాకుండానే డివైజుల్లో వేరే దాని కోసం సెర్చ్ చేసుకోవచ్చు. గూగుల్ ఎప్పటికప్పుడు కొత్త సాంకేతికతను తన వినియోగదారులకు అందించేందుకు సిద్దంగా ఉంటుంది. ఈ క్రమంలోనే ఏఐ తో ఉన్న సరికొత్త సెర్చ్ విధానాన్ని గూగుల్ వినియోగదారుల ముందుకు తీసుకుని వచ్చింది. స్మార్ట్ ఫోన్ వినియోగదారులకు గూగుల్ లో సెర్చ్ చేసేందుకు ఈ కొత్త పద్దతి ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని గూగుల్ తెలిపింది. దీనిని సర్కిల్ టు సెర్చ్(Circle To Search) అనే పేరుతో తీసుకుని వచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తుంది. రౌండప్ చేస్తే చాలు.. స్మార్ట్ ఫోన్ స్క్రీన్ పై కనిపించే ఏదైనా ఫోటో కానీ, టెక్ట్స్ లో కానీ మనకు కావాల్సిన దాని చుట్టూ రౌండప్ చేస్తే చాలు.. ఆ సర్కిల్ లో ఉన్న అంశానికి సంబంధించిన సమాచారం మొత్తం మన ముందుకు వస్తుంది. ఇప్పటి వరకు గూగుల్ సెర్చ్ అంటే మనకు కావాల్సిన పదాలు, ఇమేజ్ ల సాయంతో వెదకడం, లేక వాయిస్ అసిస్టెంట్ ద్వారా సెర్చ్ చేయడం లాగా ఉండేది. ఇప్పుడీ కొత్త విధానం తీసుకురావడం ఓ సాంకేతిక విప్లవం అని చెప్పవచ్చు. మరి కొద్ది రోజుల్లో మార్కెట్లోకి సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్ 24 స్మార్ట్ ఫోన్ ను విడుదల చేయనున్నారు.ఈ కొత్త సెర్చ్ విధానాన్ని కూడా ఆ ఫోన్లలో ఏర్పాటు చేయనున్నారు. దీంతో పాటు గూగుల్ పిక్సెల్ 8, పిక్సెల్ 8 ప్రో ఫోన్లలోనూ ఈ సర్కిల్ సెర్చ్ ను అందుబాటులో ఉంచనున్నట్లు సమాచారం. సర్కిల్ టు సెర్చ్ కు తోడు ఏఐ పవర్ మల్డీ సెర్చ్ ఎక్స్‌పీరియెన్స్ ని కూడా గూగుల్ వివరించింది. దీని వల్ల కేవలం సెర్చ్ కేవలం టెక్ట్స్ కు మాత్రమే పరిమితం కాదు. ఇమేజేస్, స్క్రీన్ షాట్స్ కు తోడు ఏఐ పవర్డ్ ఇన్‌సైట్స్ కూడా లభ్యమవుతాయి. అమెరికాలో ఈ వారంలోనే ఇది అందుబాటులోకి వచ్చినట్లు గూగుల్ నిపుణులు పేర్కొన్నారు.గూగుల్ యాప్, ఆండ్రాయిడ్, ఐఓఎస్ లలో లాంచ్ లెన్స్ తో ఈ మల్టీ సెర్చ్ ఎక్స్‌పీరియెన్స్ ని పొందవచ్చు. Also read: అయోధ్య బాల రాముని విగ్రహం పై దశావతారాలు! #google #search-engeen మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి