AI Assistent: భారత్ లో ఏఐ అసిస్టెంట్‌ ఎన్ని భాషల్లో అందుబాటులో ఉందంటే!

గూగుల్‌ ఎట్టకేలకు తన ఏఐ అసిస్టెంట్‌ -జెమిని మొబైల్‌ యాప్ ను భారత్‌ లో ప్రారంభించింది. ఈ యాప్ ప్లే స్టోర్‌ లో అందుబాటులో ఉంది. భారత్‌ లో ప్రారంభించిన ఈ యాప్‌ లో హిందీతో పాటు మొత్తం 9 ఇండియన్‌ లాంగ్వేజ్‌ ను చేర్చడం జరిగింది.

AI Assistent: భారత్ లో ఏఐ అసిస్టెంట్‌ ఎన్ని భాషల్లో అందుబాటులో ఉందంటే!
New Update

Ai Assistant : గూగుల్‌ (Google) ఎట్టకేలకు తన ఏఐ అసిస్టెంట్‌-జెమిని మొబైల్‌ యాప్ (Gemini Mobile App) ను భారత్‌ (India) లో ప్రారంభించింది. ఈ యాప్ ప్లే స్టోర్‌ లో అందుబాటులో ఉంది. భారత్‌ లో ప్రారంభించిన ఈ యాప్‌ లో హిందీతో పాటు మొత్తం 9 ఇండియన్‌ లాంగ్వేజ్‌ ను చేర్చడం జరిగింది. ఇందులో హిందీ, బెంగాలీ, గుజరాతీ, కన్నడ, మలయాళం, మరాఠీ, తమిళ్‌,తెలుగు, ఉర్దూ భాషలున్నాయి.

అంతే కాకుండా గూగుల్‌ మెసేజ్‌ ల కోసం జెమినిని కూడా ప్రారంభించింది. ఇది కేవలం ఇంగ్లీష్‌ లో మాత్రమే లభిస్తుంది. గూగుల్‌ ప్రకారం.. అనేక ఇండియన్‌ లాంగ్వేజ్‌ లో జెమిని యాప్‌ కు మద్దతు ఇవ్వడం ఎందుకంటే చాలా మందికి ప్రయోజనాలను చేకూర్చడమే. ఈ కొత్త ఏఐ అసిస్టెంట్‌ తో వినియోగదారులు సులభంగా వివిధ పనులను పూర్తి చేయవచ్చు.

ఈవెంట్‌ లను కూడా ప్లాన్‌ చేసుకోవచ్చు. దాని సాయంతో సోషల్‌ మీడియా (Social Media) లో క్యాప్షన్లు కూడా రాయవచ్చు. వినియోగదారులు ప్లే స్టోర్‌ నుంచి జెమిని యాప్‌ ను ఇన్‌ స్టాల్ చేసుకోవచ్చు. వినియోగదారులు దాంతో సులభంగా ఇంటరాక్ట్‌ అవ్వగలరు. గూగుల్ అసిస్టెంట్‌ కు బదులుగా జెమినిని ఉపయోగించవచ్చు.

వినియోగదారులు హే గూగుల్ అని చెప్పడం ద్వారా వారి వాయిస్‌ కమాండ్‌ లను ఇవ్వొచ్చు. గతంలో గూగుల్‌ అసిస్టెంట్‌ ని తెరిచినట్లుగా హోమ్‌ బటన్‌ పై కాసేపు నొక్కడం ద్వారా దీన్ఇన యాక్టివేట్‌ చేయోచ్చు. ఈ ఇంటిగ్రేషన్‌ తరువాత ఆండ్రాయిడ్‌ వినియోగదారులు మెరుగైన అనుభవాన్ని పొందుతారు.

ఈ యాప్‌ లో సూచనల కోసం టైప్‌ చేయడం. మాట్లాడటం, చిత్రాలను జోడించడం వంటి ఎంపికలు ఇవ్వడం జరుగుతుంది. ఇందులో టైమర్‌ ను కూడా సెట్‌ చేసుకోవచ్చు. కాల్‌ లు కూడా చేయోచ్చు. రిమోండర్‌ లను కూడా సెట్‌ చేసుకోవచ్చు.

Also read: కాంగ్రెస్‌ ఎమ్మెల్యే భార్య బలవన్మరణం!

#google #ai #assistent #gemini-app
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe