Gold Rate Hike: బంగారం ధరలు మళ్ళీ పరుగులు.. కొనాలంటే ఇదే బెస్ట్ టైమ్ 

బంగారం ధరలు ఇటీవల బాగా తగ్గిన విషయం తెలిసిందే. అయితే, మళ్ళీ ధరలు పెరిగే అవకాశం ఉందని నిపుణులు అంటున్నారు. డిమాండ్ పెరుగుతుండడం, అంతర్జాతీయంగా బంగారం ధరలు పెరుగుతుండడం అదేవిధంగా పండగల సీజన్ రానుండడంతో గోల్డ్ రేట్లు పెరిగే అవకాశం ఉంది. 

New Update
Gold Rate Hike: బంగారం ధరలు మళ్ళీ పరుగులు.. కొనాలంటే ఇదే బెస్ట్ టైమ్ 

Gold Rate Hike: పండుగ సీజన్‌కు ముందు బంగారం ధరలు రికార్డు స్థాయిలో పతనం కావడం మార్కెట్‌లో ఉత్సాహాన్ని పెంచింది. జూలై 18న 10 గ్రాములు రూ.74,064గా ఉన్న 24 క్యారెట్ల బంగారం 8 శాతం తగ్గి రూ.68,131కి చేరుకుంది. ఆభరణాల బంగారం (22 క్యారెట్లు) రూ.64 వేలు. దీని వల్ల మార్కెట్లో రెండు పెద్ద మార్పులు కనిపిస్తున్నాయి. మొదటిది, నవంబర్-డిసెంబర్‌లో పెళ్లిళ్ల సీజన్‌కు ముందు షాపింగ్ ప్రారంభమైంది. రెండవది, ఆగస్టు నుండి డిసెంబర్ వరకు 8 ప్రధాన పండుగలు ఉన్నాయి. నవంబర్-డిసెంబరులో వివాహానికి 16 శుభ ముహూర్తాలు ఉన్నాయి. 

దీనిలో పెద్ద విశేషం ఏమిటంటే.. ఈ సంవత్సరం మే-జూన్‌లో వివాహానికి శుభ ముహూర్తాలు లేవు, దీని కారణంగా పెద్ద సంఖ్యలో వివాహాలు నవంబర్-డిసెంబర్‌కు మారాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఈసారి బంగారం అమ్మకాల రికార్డులు బద్దలయ్యే అవకాశం ఉంది. వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ (World Gold Council) ప్రకారం, డిసెంబర్ నాటికి ఆభరణాలు, గోల్డ్ బార్స్, కాయిన్స్ కు  డిమాండ్ పెరుగుతుంది. దాదాపుగా 50 టన్నుల అదనపు డిమాండ్ ఏర్పడవచ్చు.

బంగారం ధరల (Gold Price) పరుగుల రోజులు మళ్ళీ రావచ్చు.  నిజానికి బంగారంలో  పెట్టుబడి పెట్టే వ్యక్తులు చాలా సంవత్సరాలుగా దేశంలో బంగారంపై అధిక కస్టమ్ డ్యూటీని తగ్గించాల్సిన అవసరం ఉందని కోరుతూ వచ్చారు. అదీకాకుండా స్మగ్లింగ్‌తో పాటు ఇతర మార్గాల ద్వారా బంగారం వస్తున్నందున ప్రభుత్వమే నష్టపోతోంది. మొన్న బడ్జెట్ లో బంగారంపై కస్టమ్స్ డ్యూటీ తగ్గించారు. దీంతో ఇప్పుడు బయటి ధర - దేశీయ ధర మధ్య మొత్తం 5% వ్యత్యాసం మాత్రమే ఉంది. అటువంటి పరిస్థితిలో ఎవరూ బయట నుండి బంగారాన్ని కొనే ప్రయత్నం చేయరు. అందరూ మన దేశంలోనే బంగారాన్ని కొనుగోలు చేస్తారు. ఈ రెండు కారణాల వల్ల ఈ ఏడాది బంగారం దిగుమతులు 30 నుంచి 40% పెరగవచ్చు, ఆభరణాల కొనుగోలు 10 నుంచి 15% పెరగవచ్చు.

Also Read: చివరి నిమిషంలో ఐటీ రిటర్న్స్ ఫైల్ చేస్తున్నారా?

అయితే రానున్న కాలంలో బంగారం ధరలు తగ్గుతాయా లేదా పెరుగుతాయా అనేది అంచనా వేయడం చాలా కష్టం. దిగుమతి సుంకం తగ్గింపు తర్వాత, బంగారం ధరలు కరెక్షన్ తీసుకున్నాయి. ఇక్కడి నుంచి బంగారం కాస్త తగ్గవచ్చు. బంగారం ధరలపై చాలా అంశాలు ప్రభావం చూపిస్తాయి. అంతర్జాతీయ కారకాలు, డాలర్, రూపాయి - ఫెడ్ వడ్డీ రేట్ల ఆధారంగా బంగారం ధరలు నిర్ణయం అవుతూ ఉంటాయి. అయితే రానున్న 20-30 రోజుల్లో బంగారం ధరలు మళ్లీ పెరగవచ్చని నిపుణులు భావిస్తున్నారు. 

Gold Rate Hike: రానున్న రోజుల్లో ఫెడ్ రిజర్వ్ వడ్డీ రేట్లను తగ్గించే అవకాశం ఉందని సమాచారం.  అలా  వడ్డీ రేట్ల తగ్గింపు జరిగితే, బంగారంపై పెట్టుబడిని పెంచుతుందని, డిమాండ్ పెరగడం వల్ల బంగారం ధరలు పెరుగుతాయని ఇప్పటి వరకు ట్రెండ్‌గా నడుస్తోంది. ఇంతకు ముందు సంవత్సరాల రికార్డును పరిశీలిస్తే, బంగారం మెరుగైన రాబడిని ఇచ్చింది. అటువంటి పరిస్థితిలో, తగ్గుతున్న ధరల కారణంగా, షేర్ మార్కెట్, మ్యూచువల్ ఫండ్స్ వంటి పెట్టుబడి సాధనాల్లోకి వెళ్లే డబ్బు కూడా ఇప్పుడు బంగారం వైపు వస్తుంది. దీంతో డిమాండ్ పెరుగుతుంది. అప్పుడు మళ్ళీ బంగారం ధరలు పెరిగే అవకాశం ఉంటుంది. 

తాజా ట్రెండ్ దృష్ట్యా బులియన్ వ్యాపారులు భారీ సన్నాహాలు ప్రారంభించారు. అమెరికా బ్రోకరేజ్ సంస్థ జెఫరీస్ చెబుతున్న దాని ప్రకారం,  మన దేశంలో పెళ్లిళ్ల బిజినెస్  విలువ రూ. 10 లక్షల కోట్లు. ఏటా 80 లక్షల నుంచి కోటి వివాహాలు జరుగుతున్నాయి. పెళ్లికి సగటు ఖర్చు రూ.12 లక్షలు. ఇందులో 40% ఆభరణాలకే ఖర్చు చేస్తారు. సో మరికొన్ని రోజుల్లో బంగారం ధరలు పెరిగే అవకాశాలే ఎక్కువ ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. 

అదండీ విషయం. డిమాండ్ అండ్ సప్లై థీరీ తెలుసుగా.. ఇప్పుడు బంగారం ధరలు తగ్గుతున్నాయని అందులో ఇన్వెస్ట్మెంట్స్.. కొనుగోళ్లు పెరుగుతాయి. మరోవైపు పెళ్లిళ్ల సీజన్.. పండగల సీజన్ మొదలవుతోంది.. ఇవన్నీ కలిసి బంగారానికి డిమాండ్ పెంచుతాయి. డిమాండ్ పెరుగుతుంటే క్రమంగా రేట్లూ పెరుగుతాయి. అందువల్ల రెండు మూడు నెలల తరువాత ఏదైనా పెళ్లి లాంటి ఈవెంట్ ఉండి.. దానికి బంగారం కొనాల్సిన పని ఉంటే ఇప్పుడే కానిచ్చేయడం బెటర్ అని నిపుణులు చెబుతున్న మాట. మారేందుకు ఆలస్యం ఆ పనిలో ఉండండి.

Also Read: వాట్సాప్ ఇండియాకు గుడ్ బై చెప్పనుందా?

Advertisment
తాజా కథనాలు