Telangana Crime: వాట్సాప్ స్టేటస్ పెట్టాడు..45 లక్షలు గోవిందా..జాగ్రత్తగా ఉండాలంటున్న పోలీసులు

యజమాని తన కుటుంబంతో కలిసి ఫామ్ హౌజ్ వెళ్లినట్లు వాట్సాప్ స్టేటస్ ద్వారా తెలుసుకున్న మాజీ కారు డ్రైవర్, మేనేజర్ .. అతడి ఇంట్లోకి ప్రవేశించి రూ.45 లక్షలు ఎత్తుకెళ్లాడు.

Telangana Crime: వాట్సాప్ స్టేటస్ పెట్టాడు..45 లక్షలు గోవిందా..జాగ్రత్తగా ఉండాలంటున్న పోలీసులు
New Update

WhatsApp status: శ్రీకాకుళం జిల్లాకు చెందిన పేదాడ రామకృష్ణ ఫిల్మ్‌నగర్ పటేల్ నగర్‌లో నివాసముంటూ కారు డ్రైవర్‌, మేనేజర్ గా పనిచేస్తున్నాడు. కొంతకాలంగా జల్సాలకు అలవాటు పడిన అతడు డబ్బుల కోసం చోరీలు చేయడం మొదలు పెట్టాడు. గతంలో అతడు జూబ్లీహిల్స్ రోడ్ నం. 78లోని ఫీనిక్స్ అపార్ట్‌మెంట్‌లో నివాసముంటున్న శ్రీహర్ష అనే వ్యాపారి వద్ద కారు డ్రైవర్ గా పని చేశాడు. ఆ సమయంలో యాజమాని కొత్తగా కొన్న ఫ్లాట్ ఇంటీరియర్ పనులను పర్యవేక్షించమని రామకృష్ణకు చెప్పాడు. బిల్డర్ మేనేజర్ రామకృష్ణకు 3 సెట్ల ఫ్లాట్ తాళం చెవులు ఇచ్చాడు. అందులో నుంచి ఒక సెట్ కాజేశాడు రామకృష్ణ. కాజేసి తన వద్దనే ఉంచుకున్నాడు. ఎలాగైనా శ్రీహర్ష ఇంట్లో చోరీ చేయాలని నిర్ణయించుకున్న నిందితుడు.. అవకాశం కోసం ఎదురుచూస్తున్నాడు. మూడు సంవత్సరాల తర్వాత అతడు అనుకున్న సమయం రానే వచ్చింది. ఈ క్రమంలో ఈనెల 5న శ్రీహర్ష తన కుటుంబ సభ్యులతో కలిసి మొయినాబాద్‌లోని ఫామ్ హౌస్‌కు వెళ్లినట్టు వాట్సాప్ స్టేటస్ ద్వారా తెలుసుకున్నాడు నిందితుడు.

ఇది కూడా చదవండి: రాయచోటిలో కానిస్టేబుల్ ఆత్మహత్య...కారణాలపై పోలీసుల ఆరా

ఫీనిక్స్ అపార్ట్‌మెంట్‌లోకి ఇతరులు వెళ్లడం సాధ్యమయ్యే పని కాదు. అక్కడ అంతా టైట్ సెక్యూరిటీ ఉంటుంది. ఇంటి యజమాని తన మొబైల్ నుంచి ఎంట్రీ యాక్సిస్ అనుమతి ఇస్తేనే సెక్యూరిటీ చెక్ చేసి సదరు వ్యక్తిని లోనికి వెళ్లనిస్తారు. ఎవరి కంటా పడకుండా బిల్డింగ్‌లోకి వెళ్లాలంటే ఎలా వెళ్లాలో రామకృష్ణ వంచన ఉంది. ఎమర్జెన్సీ ఎగ్జిట్ డోర్ కీ ద్వారా ఓపెన్ చేసి నేరుగా యజమాని ఉంటున్న ఆరవ అంతస్తుకు చేరుకుని.. బెడ్రూం కబోర్డులో భద్రపరిచిన 45 లక్షల రూపాయల నగదు దోచుకుని దర్జాగా వెళ్ళిపోయాడు.

వాట్సాస్ స్టేటస్ పెట్టే సమయంలో కొంచెం ఆలోచిస్తే..

తన వద్దనున్న తాళం చెవితో ఇంట్లోకి ప్రవేశించాడు. ఉంట్లో ఉన్న రూ. 45 లక్షలను తీసుకొని ఉడాయించాడు. ఫామ్ హౌజ్ నుంచి తిరిగి వచ్చిన శ్రీహర్ష ఇంట్లో దొంగతనం జరిగినట్టు గుర్తించి.. ఈనెల 7వ తేదీన ఫిలింనగర్ పోలీసులకు ఫిర్యాదు చేయగా.. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. పరారీలో ఉన్న నిందితుడు రామకృష్ణను పోలీసులు అరెస్ట్ చేశారు. అతడి దగ్గర నుంచి రూ.45 లక్షల నగదుతో పాటు ఇంటి తాళం చెవిని స్వాధీనం చేసుకుని, రిమాండుకు తరలించారు. వాట్సాస్ స్టేటస్ పెట్టే సమయంలో కొంచెం ఆలోచిస్తే ఇలాంటి పరిస్థితి రాదని పోలీసులు సూచిస్తున్నారు.

#hyderabad #telangana-crime #45-lakhs #whatsapp-status
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe