eBay Laying Off 1000 Employees: ఈ ఏడాది ప్రారంభం నుంచి చాలా కంపెనీలు వేలాది మంది ఉద్యోగులకు ఎగ్జిట్ డోర్ చూపించాయి. ఇప్పుడు ప్రపంచంలోనే అతిపెద్ద కంపెనీ అయిన ఈబే( eBay) భారీ సంఖ్యలో ఉద్యోగులను తొలగించింది. దీనిపై బ్లూమ్‌బెర్గ్ (Bloomberg) ఒక నివేదికను సమర్పించింది. ఈ నివేదిక ప్రకారం,ఈబే వెయ్యి మందిని తొలగించిందని ఇది కంపెనీ పూర్తికాల ఉద్యోగుల్లో ఈ సంఖ్య 9శాతంగా పేర్కొంది. లేఆఫ్ విషయాన్ని ఇమెయిల్స్ ద్వారా ఉద్యోగులకు సమాచారం అందించినట్లు కంపెనీ వెల్లడించింది. అయితే రానున్న రోజుల్లో మరిన్ని రౌండ్లలో లేఆఫ్ ఉండే అవకాశం ఉన్నట్లు సూత్రప్రాయంగా పేర్కొనడంతో సంస్థ ఉద్యోగుల్లో ఆందోళన నెలకొంది.
కంపెనీ స్ట్రాటజీలకు వ్యతిరేక దిశలో ఫలితాలు ఉన్నప్పుడు వ్యాపార వ్రుద్ధికి మంచి ఉద్యోగులు, వ్యయాలు ఉంటాయి. ఈ సమస్యను పరిష్కరించుకునేందుకు సంస్థాగత మార్పులు చేస్తుంటారు. కస్టమర్ల అవసరాలను తీర్చడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నామంటూ ఈబే తెలిపింది. అందులో భాగంగానే భారీగా ఉద్యోగులను తొలగించినట్లు పేర్కొంది. ఈబే కమ్యూనిటీ కోసం ఎంతో చేసినవారిని కూడా ఇప్పుడు తొలగిస్తున్నట్లు తెలిపింది. ఇది అంత సులభం కాదని..ఉద్యోగులకు పంపించిన ఇమెయిల్స్ పేర్కొంది కంపెనీ. మరోవైపు కంపెనీ వెబ్ సైట్లో ఈ లేఖను ఉంచారు. సీఈవో సుమారు వెయ్యి మంది ఉద్యోగులను తొలగించినట్లు జామీ ఐయానోస్ తెలిపారు.
ఇది కూడా చదవండి: కుప్పకూలిన రష్యా యుద్ధ విమానం.. 65 మంది ఖైదీలు మృతి
కోవిడ్ పాండమిక్ (Covid Pandemic)విజృంభణ మొదలైన క్రమంలో కంపెనీలు భారీగా ఉద్యోగాలను తొలగిస్తున్నాయి. ఆదాయం తగ్గిపోవడం, వ్యాపారం అంతంతమాత్రంగానే ఉండటంతో ఓవర్ హైరింగ్ కూడా ఈ తొలగింపులకు కారణమని నిపుణులు అంటున్నారు. కోవిడ్ కు ముందే భారీగా ఉద్యోగులను నియమించుకుని..ఆతర్వాత ఆదాయాలు, ప్రాజెక్టులు తగ్గిపోవడంతో లేఆఫ్స్ కు పూనుకుంటున్నట్లు పేర్కొంటున్నారు. 2022ఏడాది చివరి నుంచి వ్యయ నియంత్రణ చర్యలు దిగుతున్నాయి. ఇందులో భాగంగానే లక్షల మంది ఉపాధి కోల్పోయారు. ఈ ఏడాదిలోనూ టెక్ దిగ్గజ కంపెనీ గూగుల్ వెయ్యి మందిని తొలగించింది. అమెజాన్ ప్రైమ్, అమెజాన్ (Amazon) ఎంజీఎం స్టూడియో విభాగాల్లో పనిచేస్తున్న వారిని తొలగిస్తున్నట్లు అమెజాన్ ఈమధ్యే ప్రకటించింది. ఇక ఫేస్ బుక్ మాత్రు సంస్థ అయిన మోటా, టిక్ టాక్ కంపెనీలు కూడా ఉద్యోగుల కోత ప్రకటించాయి.