African Swain Fever Virus : ఆఫ్రికన్ స్వైన్ ఫీవర్..వందశాతం మరణాల రేటు...మనుషులకు వ్యాపిస్తుందా? కరోనా వైరస్, జాంబీ వైరస్, ఆఫ్రికన్ స్వైన్ ఫీవర్..కొత్త కొత్త వైరస్ లు ప్రజల్లో కొంత టెన్షన్ కలిగిస్తున్నాయి. పందులలో వందశాతం మరణాల రేటుకు కారణమవుతున్న అంటువ్యాధి ఈ ఆఫ్రికన్ స్వైన్ ఫీవర్. దీని లక్షణాలు ఎలా ఉంటాయి? ఇది మనుషులకు వ్యాపిస్తుందా? ఈ స్టోరీ చదవండి. By Bhoomi 21 Feb 2024 in Latest News In Telugu వైరల్ New Update షేర్ చేయండి African Swain Fever Virus : ఆఫ్రికన్ స్వైన్ ఫీవర్ వైరస్...ఈ వైరస్ పోయినట్లే పోయి..మళ్లీ తెరపైకి వచ్చింది. తాజాగా పూణేలో ఈ వైరస్ కు సంబంధించిన రెండు కేసులను కనుగొన్నారు. ఏఎస్ఎఫ్ వీ అనేది పందులలో 100శాతం మరణాల రేటుతో అత్యంత ప్రాణాంతక వైరల్ ఇన్ఫెక్షన్ అని చెప్పవచ్చు. దీనికి చికిత్స లేదు. దీంతో ఆ రాష్ట్రంలో వైరస్ సోకిన పందులను వీలైనంత త్వరగా సురక్షితమైన ప్రదేశాలకు పందులను తరలిస్తున్నారు. ఇంతకీ ఈ వైరస్ లక్షణాలు ఏంటి. మనుషులకు కూడా ఇది సోకుతుందా. పూర్తి వివరాలు తెలుసుకుందాం. మళ్లీ విజృంభిస్తున్న వైరస్: ఆఫ్రికన్ స్వైన్ ఫీవర్ వైరస్ 2020లో జనాలను టెన్షన్ కు గురిచేసింది. దీనిని మొదట్లో కంట్రోల్ చేసినప్పటికీ...పూణేలో వైరస్ మళ్లీ కనిపించింది. దీనిని నియంత్రించేందుకు అడవి, పెంపుడు పందులకు అందుబాటులో ఉన్న ఏకైక రోగనిరోధక చర్య టీకా అని వైద్యులు అంటున్నారు. అయితే ఈ వైరల్ వ్యాధి తీవ్రంగా ఉంటుంది. కాబట్టి మరణాలకు దారితీస్తుంది. అయితే జంతువుల నుంచి మనుషులకు వచ్చే కొన్ని వైరస్ ల మాదిరిగా కూడా సోకుతుందా అనే ప్రశ్నలకు వైద్యులు లేదనే చెబుతున్నారు. ఈ వైరస్ ప్రజలను ప్రభావితం చేసే అవకాశం లేదని..ఆరోగ్యంపై ఎలాంటి ప్రభావం చూపదని చెబుతున్నారు. అయితే ఈ వైరస్ సోకిన పందుల మలం లేదా శరీర ద్రవాలతో ప్రత్యక్ష సంబంధం ఉన్న పందులకు ఈ వైరస్ సోకుతుంది. ఇవి ప్రత్యక్ష సాధనాలు అయితే..వాహనాలు లేదా పందులతో పనిచేసే వ్యక్తులు వైరస్ వ్యాప్తికి పరోక్ష కారకాలు అవుతారు. ఇది మనుషులకు వ్యాపించిని రోగమైనప్పటికీ ...దాని అంటువ్యాధి , ప్రాణాంతక స్వభావం కారణంగా వైరస్ సోకిన పందులకు దూరంగా ఉండటమే మంచిదంటున్నారు. జంతువుల నుంచి మనుషులకు వ్యాపించే వైరస్ లు ఉన్నట్లుగా...వ్యాపించని వైరస్ లు కూడా ఉన్నాయి. అయితే వైరస్ సోకిన పందులకు కిలోమీటర్ దూరంలో ఉంటే మంచిదని వైద్యులు చెబుతున్నారు. వైరస్ వ్యాప్తి వెనక ఎలాంటి కారణాలు ఉన్నాయో ఇంకా తెలియరాలేదు. వైరస్ సోకిన పందుల నుంచి నమూనాలను సేకరించడానికి వాటి యజమానుల నుంచి ప్రయాణసమాచారాన్ని సేకరించేందుకు అధికారులు ప్రయత్నం చేస్తున్నారు. పెంపుడు జంతువుల యజమానులు, వెటర్నరీ వైద్యులు వైరస్ కు సంబంధించి ఏవైనా లక్షణాలు ఉంటే వెంటనే తమ తెలపాలని అధికారులు కోరతున్నారు. ఈ వైరస్ లక్షణాలు ఇలా ఉంటాయ్: అధిక జ్వరం, రక్తంలో కూడిన విరేచనాలు, చర్మం నల్లగా మారడటం,శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు, దగ్గు, బలహీనత వంటి లక్షణాలు ఈ వైరస్ సోకిన పందుల్లో కనిపిస్తాయి. పందుల యజమానులు, వెటర్నరీ వైద్యులు పందులలో ఇలాంటి లక్షణాలను గుర్తిస్తే వాటిని వైరస్ సోకని పందులకు దూరంగా ఉంచాలి. వెంటనే అధికారులకు ఈ విషయం తెలియజేయాలని సూచిస్తున్నారు. ఇది కూడా చదవండి : వచ్చేది వేసవి కాలం.. ఈ వ్యాపారం ప్రారంభిస్తే.. నెలకు రూ. 15లక్షలు గ్యారెంటీ..ఎలాగో తెలుసా? #new-virus #african-swain-fever-virus #african-swain-fever మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి