/rtv/media/post_attachments/wp-content/uploads/2023/10/bb-5-jpg.webp)
Afghanistan: అఫ్ఘానిస్థాన్‌లో భారీ భూకంపాలు తీవ్ర నష్టాన్ని మిగిల్చాయి. వరుస భూకంపాల్లో మృతుల సంఖ్య గణనీయంగా పెరిగింది. ప్రజలు తమ ప్రాణాలను అరచేతుల్లో పెట్టుకుని బిక్కుబిక్కుమంటూ బ్రతుకుతున్నారు. ఎప్పుడు ఏం జరుగుతుందోనని ప్రజలు భయం..భయంగా జీవిస్తున్నారు. భూకంప ధాటికి ఇప్పటివరకు రెండు వేల మందికి పైగా మరణించారు. వందలాది మంది గాయపడ్డారు.
Afghanistan: Death toll from Herat quakes crosses over 2,000
Read @ANI Story | https://t.co/F2A08r9vde#Herat#Earthquake#Afghanistanpic.twitter.com/FAzZPBw4CP
— ANI Digital (@ani_digital) October 8, 2023
శనివారం సంభవించిన వరుస భూకంపాలతో అఫ్ఘనిస్థాన్ ప్రజలు తీవ్ర భయాందోళనలకు లోనవుతున్నారు. హెరాత్ ప్రావిన్స్‌లో కేవలం గంట వ్యవవధిలో ఆరు భూకంపాలు సంభవించాయి. తొలి భూకంపం తీవ్రత రిక్టర్ స్కేలుపై 6.3గా నమోదైంది. ఆ తర్వాత వరుసగా 5.5, 4.7, 6.3, 5.9, 4.6 తీవ్రతతో భూకంపాలు కుదిపేశాయి. భూకంప కేంద్రం హెరాత్ నగరానికి సమారు 40 కిలోమీటర్ల దూరంలో ఉన్నట్టు యునైటెడ్ స్టేట్స్ జియాలాజికల్ సర్వే తెలిపింది.
హేరాట్ నగరంలో శనివారం మధ్యాహ్నం సమయంలో కేవలం గంట వ్యవధిలోనే వరుసగా ఏడు భూకంపాలు సంభవించాయి. పశ్చిమ అప్గాన్‌లో 6.3 తీవ్రతతో వచ్చిన ఈ భూకంపం కారణంగా పలుచోట్ల కొండచరియలు విరిగిపడ్డాయి. వందలాది భవనాలు నేలమట్టమయ్యాయి. భవనాలు కూలిపోవడంతో శిథిలాల కింద నలిగిపోయి ఇప్పటివరకు రెండు వేల మందికి పైగా దుర్మరణం చెందారు. 402 మంది గాయపడ్డారు. కాగా, అఫ్గాన్‌లో తరచూ ఏర్పడే భూకంపాల కారణంగా తీవ్ర ప్రాణ, ఆస్తి నష్టం ఏర్పడుతుంది. గత ఏడాది జనవరిలో ఏర్పడిన భారీ భూకంపం వల్ల వెయ్యి మంది మృతి చెందగా, వేలాది మంది నిరాశ్రయులయ్యారు.
స్థానిక అధికారులు తెలిపిన వివరాల ప్రకారం జిందా జాన్, ఘోర్యాన్ జిల్లాల్లో భూకంపం కారణంగా 12 గ్రామాలు దాదాపుగా నేలమట్టమయ్యాయి. ఇళ్లన్నీ ధ్వంసమయ్యాయి. సహాయక సిబ్బంది ప్రజలను శిథిలాల నుంచి తొలగించేందుకు ప్రయత్నిస్తున్నారు. జిందా జాన్ జిల్లాలోని మూడు గ్రామాల్లో కనీసం పదిహేను మంది మరణించారని, దాదాపు నలభై మంది గాయపడ్డారని నిన్న అక్కడి విపత్తు నిర్వహణ మంత్రి తెలిపారు. కాగా మృతుల సంఖ్య పెరుగుతూ వస్తోంది. మరోవైపు, పపువా న్యూగినియాలో కూడా రిక్టర్ స్కేలుపై 6.6 తీవ్రతతో భూకంపం సంభవించింది. మెక్సికో, నేపాల్‌లో కూడా భూకంపాలు కలకలం సృష్టించాయి. అయితే, నేపాల్‌లో కొన్ని భవంతులకు నష్టం వాటిల్లినా ప్రాణనష్టం మాత్రం సంభవించలేదు.
Also Read: వారం రోజులు విమానాలు రద్దు.. కారణమిదే..