Tirumala: తిరుమలలో మరోసారి విమానం హల్‌చల్ హిందువుల పవిత్ర పుణ్యక్షేత్రం తిరుమలలో మరోసారి కలకలం రేగింది. శ్రీవారి ఆలయంపై నుంచి మహాగోపురం మీదుగా మళ్లీ విమానం వెళ్లడం చర్చనీయాంశంగా మారింది. దీంతో భక్తులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గతంలో కూడా ఇలా విమానాలు ఏడుకొండల మీద చక్కర్లు కొట్టిన సంగతి తెలిసిందే By BalaMurali Krishna 07 Sep 2023 in తిరుపతి టాప్ స్టోరీస్ New Update షేర్ చేయండి Tirumala: హిందువుల పవిత్ర పుణ్యక్షేత్రం తిరుమలలో మరోసారి కలకలం రేగింది. శ్రీవారి ఆలయంపై నుంచి మహాగోపురం మీదుగా మళ్లీ విమానం వెళ్లడం చర్చనీయాంశంగా మారింది. దీంతో భక్తులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆగమశాస్త్రం నిబంధనల ప్రకారం తిరుమలను నో ప్లై జోన్‌గా ప్రకటించాలని ఇప్పటికే టీటీడీ అధికారులు అనేకసార్లు కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. అయినా కానీ కేంద్ర ప్రభుత్వం ఆ దిశగా అడుగులు వేయలేదు. దీంతో విమానాలు తిరుమల ఆలయంపై నుంచి వెళ్లడం పరిపాటిగా మారుతోంది. గతంలో కూడా ఇలా విమానాలు ఏడుకొండల మీద చక్కర్లు కొట్టిన సంగతి తెలిసిందే. విమానం ఎగరడంపై భక్తుల ఆగ్రహం.. గోవింద.. గోవింద అంటూ ఆ వేంకటేశ్వరుడిని తలుచుకుంటూ ఏడుకొండలు ఎక్కి.. స్వామివారిని దర్శించుకుంటే కోటిజన్మల పుణ్యం దక్కుతుందని భక్తులు భావిస్తారు. అందుకే శ్రీవారిని దర్శించుకోవడానికి ఎన్నో వ్యయప్రయాసాలు కోర్చి దేశ విదేశాల నుంచి లక్షలాది మంది భక్తులు తిరుమలకు వస్తుంటారు. కొలిచినవారి కొంగు బంగారంగా భక్తులు విశ్వసించే తిరుమలలో మరోసారి విమానం ఎగరడంపై భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆగమశాస్త్ర ప్రకారం కొండపై నిషేధం.. ఆగమశాస్త్ర ప్రకారం తిరుమల కొండపై నుంచి విమానాలు, హెలికాఫ్టర్లు, డ్రోన్లు వంటివి వెళ్లకూడదనే నియమం ఉంది. తిరుమల కొండపై దేవతలు విహరిస్తుంటారని అక్కడ ఇలాంటివి తిరిగితే అపచారమనే భావన కూడా భక్తుల్లో ఉంది. గతంలో బ్రిటీష్ కాలంలో ఇలా తిరిగిన రెండు విమానాలు పేలిపోయినట్లు ఆధారాలు కూడా ఉన్నట్లు చెబుతున్నారు. ఒకవేళ విమానాలు తిరగడం వల్ల జరగరానిది జరిగితే ఎవరు బాధ్యత వహిస్తారని పండితులు ప్రశ్నిస్తున్నారు. నో ఫ్లై జోన్‌గా ప్రకటించాలని డిమాండ్.. దీనిపై టీటీడీ అధికారులు ఎన్నోసార్టు కేంద్ర ప్రభుత్వంతో పాటు విమానాయానశాఖ అధికారులకు ఫిర్యాదు చేశారు. అయితే అధికారులు ఇప్పటివరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. దీనిపై టీటీడీ సిబ్బందితో పాటు భక్తులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికైనా స్పందించి తిరుమలను నో ఫ్లై జోన్‌గా ప్రకటించాలని డిమాండ్ చేస్తున్నారు. ఇది కూడా చదవండి: తిరుమలలో బోనులో చిక్కిన ఐదో చిరుత.. కొనసాగుతున్న ఆపరేషన్ #tirumala #lord-venkateswara-swammy #areoplane #no-fly-zone మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి