Telangana: కేటీఆర్ ను పిచ్చాసుపత్రిలో చేర్పించండి.. రేవంత్ కు బండి సుధాకర్ రిక్వెస్ట్

బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ ను పిచ్చాసుపత్రిలో చేర్పించాలని సీఎం రేవంత్ రెడ్డికి టీపీసీసీ అధికార ప్రతినిధి బండి సుధాకర్ గౌడ్ విజ్ఞప్తి చేశారు. తెలంగాణ ప్రజలు ఛీత్కరించుకున్నా బీఆర్ఎస్ నాయకులకు బుద్ధి రావడం లేదని, ఎమ్మెల్యే కేటీఆర్ మతిభ్రమించి అవాస్తవాలు మాట్లాడుతున్నాడన్నారు.

Telangana: కేటీఆర్ ను పిచ్చాసుపత్రిలో చేర్పించండి.. రేవంత్ కు బండి సుధాకర్ రిక్వెస్ట్
New Update

Bandi Sudhakar: అహంకారంతో మాట్లాడుతున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ ను పిచ్చాసుపత్రిలో చేర్పించాలని సీఎం రేవంత్ రెడ్డికి టీపీసీసీ అధికార ప్రతినిధి బండి సుధాకర్ గౌడ్ విజ్ఞప్తి చేశారు. సోమవారం ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ట్విట్టర్ పిట్ట కేటీఆర్ అమర్యాదగా మాట్లాడటాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు.

బుద్ధి రావడం లేదు..
తెలంగాణ ప్రజలు ఛీత్కరించుకున్నా బీఆర్ఎస్ నాయకులకు బుద్ధి రావడం లేదని, ఎమ్మెల్యే కేటీఆర్ మతిభ్రమించి అవాస్తవాలను మాట్లాడుతున్నాడన్నారు. 'ఒకసారి ప్రజలు తిరస్కరించిన ‘కేసీఆర్ ను సీఎం చేస్తాం’ అంటాడు. మరోసారి హైదరాబాదులో ఆటోలో తిరుగుతూ చీప్ ట్రిక్స్ చేస్తాడు. ఎమ్మెల్యే కేటీఆర్ మానసిక స్థితి సరిగా లేదనే అనుమానం ఉంది. అందుకే మానసిక ఆరోగ్యచట్టం సెక్షన్ 12 (2) కింద కేటీఆర్ పై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలి. సీఎం రేవంత్ రెడ్డి కలుగచేసుకొని బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ ను పిచ్చాసుపత్రిలో చేర్పించాలి. అవసరమైతే మెరుగైన చికిత్స కోసం సీఎంఆర్ఎఫ్ నుండి ఎల్ఓసీ ఇచ్చి చికిత్స చేయించి.. హెల్త్ బులెటిన్ విడుదల చేయాలి' అని సుధాకర్ కోరారు.

సత్తా గల నాయకుడు రేవంత్..
అలాగే ప్రజా తీర్పుతో ప్రజాస్వామ్యబద్దంగా రేవంత్ రెడ్డి సీఎం అయ్యారని, ఎన్నికలకు ముందే సీఎంగా ప్రమాణ స్వీకారం తేదీని ప్రకటించి సత్తా గల నాయకుడు రేవంత్ రెడ్డి అంటూ పొగిడేశారు. 'మీ అరాచకాలను, అక్రమాలను ప్రజల ముందుంచి ప్రజాభిమానంతో కాంగ్రెస్ పార్టీని అధికారం వైపు నడిపించి ముఖ్యమంత్రి అయిన ఘనత రేవంత్ రెడ్డిది. రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధికి తోడ్పడాల్సింది పోయి, చౌకబారు విమర్శలు చేస్తున్నారు. తక్షణమే సీఎం రేవంత్ రెడ్డికి కేటీఆర్ బేషరతుగా క్షమాపణ చెప్పాలి' అని బండి సుధాకర్ డిమాండ్ చేశారు.

ఇది కూడా చదవండి : Nagole: కిలాడీ లేడీస్.. వృద్ధుడికి ఆ ఆశచూపి భారీ మోసం

అవినీతి బయటపెడతాం..
కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన తెలంగాణను బీఆర్ఎస్ నాయకులు ఇష్టారీతిన దోచుకున్నారు. అధికారంలో ఉన్నపుడు కేటీఆర్ చేసిన అవినీతి, అక్రమాలపై సీఎం రేవంత్ రెడ్డి సమగ్ర విచారణ జరిపిస్తున్నాడు. కేటీఆర్ అవినీతిపై అన్ని వాస్తవాలు త్వరలోనే బయటకొస్తాయి. ప్రజల ముందు దోషిగా నిలబడాల్సి వస్తదని కేటీఆర్ కు వెన్నులో వణుకు పుడుతున్నది. ఆ భయంతోనే కేటీఆర్ నిరాధార ఆరోపణలు చేస్తున్నాడు. ఖబడ్దార్ కేటీఆర్... ఇప్పటికైనా నోరు అదుపులో పెట్టుకో, మీ అవినీతి బయడపడి, నడివీధిలో నిలబడే రోజు దగ్గర్లోనే ఉంది.’’ అని బండి సుధాకర్ గౌడ్ హెచ్చరించారు. టిపిసిసి జనరల్ సెక్రటరీ చరణ్ యాదవ్ పాల్గొన్నారు.

#ktr #cm-revanth #bandi-sudhakar #mad-hospital
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe