KVS Admission 2024: కేంద్రీయ విద్యాలయాల్లో ప్రవేశాలకు దరఖాస్తులు షురూ..ఇలా అప్లయ్ చేసుకోండి.!

తల్లిదండ్రులకు అలర్ట్. కేంద్రీయ విద్యాలయాల్లో ఒకటో తరగతిలో ప్రవేశాలకు దరఖాస్తులు షురూ అయ్యాయి. ఆసక్తి ఉన్నవారు నేటి నుంచి ఏప్రిల్ 15వ తేదీ సాయంత్రం 5గంటల వరకు ఆన్ లైన్లో అప్లయ్ చేసుకోవచ్చు.

New Update
KVS Admission 2024: కేంద్రీయ విద్యాలయాల్లో ప్రవేశాలకు దరఖాస్తులు షురూ..ఇలా అప్లయ్ చేసుకోండి.!

KVS Admission 2024: తమ పిల్లలను కేంద్రీయ విద్యాలయంలో చేర్పించాలనుకునే పేరెంట్స్ కు శుభవార్త. నామమాత్రపు ఫీజుతో చిన్నారుల్లో సమగ్ర వికాసాన్ని పెంపొందించే ఈ విద్యాలయాల్లో 2024-25 విద్యా సంవత్సరంలో ప్రవేశాలకు దరఖాస్తులు షురూ అయ్యాయి. ఆసక్తి ఉన్న వారు నేటి నుంచి ఏప్రిల్ 15వ తేదీ సాయంత్రం 5గంటల వరకు ఆన్ లైన్లో అప్లయ్ చేసుకోవచ్చు. వీటిలో సీటు దొరికితే ప్లస్ టు వరకు పిల్లలు చదువులు నిశ్చితంగా సాగుతాయి. అయితే దీనికి ఎలా దరఖాస్తు చేసుకోవాలి. ఎలాంటి డాక్యుమెంట్లు అవసరం ఉంటుంది. పూర్తి వివరాలు తెలుసుకుందాం.

ఎలా దరఖాస్తు చేయాలి:

-కేవీఎస్ ఆన్ లైన్ పోర్టల్ ను సందర్శించి మొదట రిజిస్టర్ అవ్వాలి.

-మొబైల్ నెంబర్, ఈ మెయిల్ ఐడీతోపాటు లాగిన్ అయ్యేందుకు అవసరమైన వివరాలన్నింటిని ఎంటర్ చేయాలి.

-ఒకటో తరగతి అడ్మిషన్ అప్లికేషన్ను యాక్సెస్ చేసుకోవాలి.

-దరఖాస్తులో అడిగిన విధంగా పిల్లల వివరాలు, తల్లిదండ్రుల సమాచారం, ఏ స్కూల్లో చేర్చాలనుకుంటున్నారో తెలుపాలి.

-పిల్లుల, తల్లిదండ్రుల వివరాలు నింపడంతోపాటు ఏ స్కూల్లో చేర్పించాలనుకుంటున్నారో ప్రాధాన్యత వారిగా ఎంపిక చేసుకోవాలి.

-స్కాన్ చేసిన డాక్యుమెంట్లు, ఫొటో గ్రాఫ్ లను అప్ లోడ్ చేయాల్సి ఉంటుంది.

-దరఖాస్తును నింపడం, డాక్యుమెంట్లను అప్ లోడ్ చేయడం పూర్తయిన తర్వాత ఒకసారి చెక్ చేసుకోని సబిమిట్ చేయాలి.

ఎలాంటి డాక్యమెంట్లు కావాలి?

-ఈ మెయిల్ ఐడీ, మొబైల్ నెంబర్, పిల్లల పుట్టినరోజు సర్టిఫికేట్, ఈడబ్ల్యూఎస్ వర్గానికి చెందిన వారైతే ప్రభుత్వం నుంచి సంబంధిత ధ్రువీకరణ పత్రం అవసరం ఉంటుంది.

-పిల్లల ఆధార్ కార్డు , ఫొటో

-ప్రభుత్వ ఉద్యోగుల సర్వీస్ కు సంబంధించిన పత్రాలు, తల్లిదండ్రులు, తాతయ్యలు బదిలీ వివరాలు సమర్పించాల్సి ఉంటుంది.

-రెసిడెంట్ సర్టిఫికెట్

-గార్డియన్ తో పిల్లవాడికి ఉన్న అనుబంధం సంబంధించిన ఆధారాలు

-సబ్మిట్ సక్సెస్ అయితే అప్లికేషన్ కోడ్ వస్తుంది.

-ఎడిట్ ఆప్షన్ లేనందున దరఖాస్తు చేసేటప్పుడు ఎలాంటి పొరపాట్లు లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలి.

ఇది కూడా చదవండి: జైల్లోనే… కవిత బెయిల్‌ పిటిషన్‌పై విచారణ వాయిదా!

Advertisment
తాజా కథనాలు