Aditya L1 Solar Mission 2023: సూర్యుడి పై ఫోకస్ పెట్టిన ఇస్రో..ప్రయోగానికి అంతా సెట్

అంతరిక్ష ప్రయోగాల్లో ఇస్రో స్పీడ్ పెంచింది. కీలక ప్రయోగాలతో ఇస్రో దూసుకెళ్తుంది. ఇటీవల చంద్రయాన్-3 సక్సెస్ తర్వాత..’ఆదిత్య హృదయాన్ని’ ఆవిష్కరించే ప్రయత్నం చేస్తోంది. సూర్యగోళం రహస్యాలను ఛేదించడానికి.. శ్రీహరి కోట వేదికగా రంగం సిద్ధమైంది. తాజాగా చంద్రయాన్‌-3తో జాబిలమ్మపై అడుగుపెట్టి అక్కడి పరిస్థితులు, వనరులపై అధ్యయనం మొదలుపెట్టిన భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో).. ఇప్పుడు సూర్యుడిపై ఫోకస్ పెట్టింది. ఇప్పుడు దీనికి సంబంధించిన పీఎస్ఎల్వీ సీ-57 రాకెట్ ప్రయోగానికి శుక్రవారం కౌంట్ డౌన్ ప్రక్రియ ప్రారంభం అయింది. ఈ రోజు ఉదయం 11.50 గంటలకు కౌంట్ డౌన్ స్టార్ట్ చేశారు. 24 గంటల పాటు ఈ కౌంట్ డౌన్ కొనసాగనుంది.. ఆ తర్వాత PSLV C-57 రాకెట్ ను ఇస్రో శాస్త్రవేత్తలు ప్రయోగించనున్నారు.

New Update
Aditya L1 Solar Mission 2023: సూర్యుడి పై ఫోకస్ పెట్టిన ఇస్రో..ప్రయోగానికి అంతా సెట్

Aditya L1 solar mission 2023: అంతరిక్ష ప్రయోగాల్లో ఇస్రో (ISRO) స్పీడ్ పెంచింది. కీలక ప్రయోగాలతో ఇస్రో దూసుకెళ్తుంది. ఇటీవల చంద్రయాన్-3(Chandrayaan-3)సక్సెస్ తర్వాత..’ఆదిత్య హృదయాన్ని’ ఆవిష్కరించే ప్రయత్నం చేస్తోంది. సూర్యగోళం రహస్యాలను ఛేదించడానికి.. శ్రీహరి కోట వేదికగా రంగం సిద్ధమైంది. తాజాగా చంద్రయాన్‌-3తో జాబిలమ్మపై అడుగుపెట్టి అక్కడి పరిస్థితులు, వనరులపై అధ్యయనం మొదలుపెట్టిన భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో).. ఇప్పుడు సూర్యుడిపై ఫోకస్ పెట్టింది. ఇప్పుడు దీనికి సంబంధించిన పీఎస్ఎల్వీ సీ-57 రాకెట్ ప్రయోగానికి శుక్రవారం కౌంట్ డౌన్ ప్రక్రియ ప్రారంభం అయింది. ఈ రోజు ఉదయం 11.50 గంటలకు కౌంట్ డౌన్ స్టార్ట్ చేశారు. 24 గంటల పాటు ఈ కౌంట్ డౌన్ కొనసాగనుంది.. ఆ తర్వాత PSLV C-57 రాకెట్ ను ఇస్రో శాస్త్రవేత్తలు ప్రయోగించనున్నారు.

కీలక ప్రయోగాలతో ప్రపంచ దృష్టిని ఆకర్షించిన ఇస్రో:

విశ్వ రహస్యాల గుట్టువిప్పడానికి సంకల్పం చేసిన ఇస్రో.. కీలక ప్రయోగాలతో ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తోంది. చంద్రయాన్‌ త్రీ సక్సెస్‌ తో.. అగ్రరాజ్యాలకు దీటుగా నిలబడిన ఇస్రో.. లేటెస్ట్ గా ఆదిత్య-L1 ప్రయోగానికి రెడీ అయింది. ఆదిత్య ఎల్-1- సూర్యునిపై పరిశోధనలకు ఇస్రో చేస్తున్న తొలి ప్రయత్నం ఇది. ఇప్పటిదాకా చంద్రుడు, అంగారక గ్రహాలపై పరిశోధనలు చేసిన ఇస్రో.. అద్భుత రహస్యాలను బయట పెట్టింది. అదే విధంగా సూర్యుడి రహస్యాలను కనిపెట్టడమే లక్ష్యంగా ఇస్రో ఆదిత్య-L1 ప్రయోగం చేపడుతోంది.

అధికారికంగా కౌంట్ డౌన్ స్టార్ట్:

ఇప్పటికే PSLV C-57 ప్రయోగానికి లాంచ్ అథరైజేషన్ బోర్డు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చేసింది. మరోవైపు ఇస్రో చైర్మన్ డాక్టర్ సోమనాథ్ శ్రీహరి కోటకు చేరుకున్నారు. ప్రయోగ ప్రక్రియపై శాస్త్రవేత్తలతో సమావేశం నిర్వహించారు. రాకెట్ లోని వివిధ విభాగాలను పరిశీలిస్తున్నారు. ఈ ప్రయోగం ద్వారా సూర్యుడి పై పరిశోధనలకు ఆదిత్య- L1 ఉపగ్రహాన్ని ప్రయోగించబోతున్నారు. పీఎస్‌ఎల్‌వీ సీ-57 రాకెట్ ‌కు అన్ని పరీక్షలు నిర్వహించి లాంచ్‌ ఆథరైజేషన్‌ బోర్డుకు అప్పగించారు. ల్యాబ్‌ చైర్మన్‌ రాజ రాజన్‌ రాకెట్ ‌కు మరోసారి పరీక్షలు నిర్వహించి.. కౌంట్‌ డౌన్ ప్రక్రియను అధికారికంగా ప్రారంభించారు.

సెప్టెంబర్ 02న PSLV C-57 ద్వారా ఆదిత్య ఎల్-1 ప్రయోగం:

సెప్టెంబర్ 02వ తేదీన PSLV C-57 ద్వారా ఆదిత్య ఎల్-1 ప్రయోగం జరగనుంది. సూర్యుని అయస్కాంత క్షేత్రంలో సంభవించే మార్పులు, కరోనియంలో ఉన్న పదార్థాలు, సూర్యునిలో నిత్యం జరిగే డైనమిక్ ప్రక్రియలను అధ్యయనం చేయడానికి భారత్ చేస్తున్న తొలి ప్రయోగం ఇది. తరచూ మనం చూస్తున్న సౌర తుఫాన్ కారణంగా అంతరిక్షంలో ఉపగ్రహాలపై పడుతున్న ప్రభావంతో.. సమాచార వ్యవస్థపై అంతరాయాలు ఏర్పడుతున్నాయి. ఈ ప్రయోగం ద్వారా ఫోటో స్పియర్, క్రోమోస్పియర్ లపై పరిశోధనలు చేసి భూమిపై సూర్యుని వల్ల కలిగే దుష్పరిణామాలకు కారణాలు, పరిష్కారాలు చూపేందుకు అవకాశాలు తెలిసే అవకాశం ఉందని ఇస్రో చెప్తుంది.

ఇవి కూడా చదవండి:

Good News for Tenant Farmers: కౌలు రైతులకు గుడ్ న్యూస్ చెప్పిన ఏపీ ప్రభుత్వం

Andhra Pradesh Rain Forecast: ఆంధ్రప్రదేశ్ కు వర్ష సూచన.. సెప్టెంబర్ లో భారీ వర్షాలు!!

చిత్తూరు జిల్లాలో ఒంటరి ఏనుగు దాడిలో మరో మహిళ మృతి..!

IT Notices to Chandrababu Naidu: తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుకు ఐటీ నోటీసులు

Advertisment
తాజా కథనాలు