ISRO: ‘ఆదిత్య ఎల్ 1’లో రికార్డయిన సౌరగాలులు.. సోషల్ మీడియాలో ఇస్రో ఫోటో.. ఆదిత్య ఎల్-1 ప్రయోగానికి సంబంధించిన ఓ ఫోటోను షేర్ చేసింది ఇస్రో. ఆదిత్య ఎల్-1 లో సౌర గాలులు రికార్డ్ అయ్యాయి. ఇందుకు సంబంధించి గ్రాఫ్‌తో కూడిన వివరాలను ట్వీట్ చేసింది ఇస్రో. ఈ ఫోటో ఇప్పుడు వైరల్ అవుతోంది. By Shiva.K 02 Dec 2023 in Latest News In Telugu నేషనల్ New Update షేర్ చేయండి ISRO Share Photo of SWIS: సూర్యుడిని అధ్యయనం చేసేందుకు రోదసిలోకి దూసుకెళ్లిన ‘ఆదిత్య-ఎల్ 1’ తన ప్రయాణంలో మరో మైలురాయిని అందుకుంది. ఈ ఉపగ్రహంలోని ఆదిత్య సోలార్ విండ్ పార్టికల్ ఎక్స్‌పరిమెంట్ పేలోడ్ తన ఆపరేషన్స్‌ను ప్రారంభించిందని భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో తాజాగా వెల్లడించింది. ఈ పేలోడ్‌లోని రెండు పరికరాలు పరిశోధనలను విజయవంతంగా కొనసాగిస్తున్నాయని, ఇవి సౌర గాలులను అధ్యయనం చేస్తున్నాయని తెలిపింది. ఈ ఆదిత్య సోలార్ విండ్ పార్టికల్ ఎక్స్‌పరిమెంట్ పేలోడ్‌లో రెండు పరికరాలు ఉన్నాయి. ఇందులోని సూపర్‌థర్మల్ అండ్ ఎనర్జిటిక్ పార్టికల్ స్పెక్ట్రోమీటర్‌ను సెప్టెంబరు 10న, సోలార్ విండ్ అయాన్ స్పెక్ట్రోమీటర్‌ను నవంబరు 2న యాక్టివేట్ చేశారు. ఈ రెండు తమ కార్యకలాపాలను సజావుగా సాగిస్తున్నాయని ఇస్రో తమ తాజా ప్రకటనలో వెల్లడించింది. స్విస్‌లో ఉన్న రెండు సెన్సర్లు 360 డిగ్రీల్లో తిరుగుతూ పనిచేస్తున్నాయి. ఇవి నవంబరులోని రెండు తేదీల్లో సోలార్ విండ్ అయాన్లు, ప్రైమరీ ప్రోటాన్స్, ఆల్ఫా పార్టికల్స్‌ను విశ్లేషించినట్లు ఇస్రో తెలిపింది. ఈ సెన్సర్ సేకరించిన ఎనర్జీ హస్టోగ్రామ్‌ను పరిశీలించిన తర్వాత.. ప్రోటాన్, ఆల్ఫా పార్టికల్స్‌లో కొన్ని వైవిధ్యాలు ఉన్నట్లు గుర్తించామని ఇస్రో పేర్కొంది. Aditya-L1 Mission: The Solar Wind Ion Spectrometer (SWIS), the second instrument in the Aditya Solar wind Particle Experiment (ASPEX) payload is operational. The histogram illustrates the energy variations in proton and alpha particle counts captured by SWIS over 2-days.… pic.twitter.com/I5BRBgeYY5 — ISRO (@isro) December 2, 2023 ఈ తాజా విశ్లేషణతో.. సౌర గాలుల లక్షణాలపై సుదీర్ఘంగా నెలకొన్న ఎన్నో ప్రశ్నలకు సమాధానాలు దొరికే అవకాశముందని ఇస్రో వివరించింది. అంతేగాక, సౌర గాలుల్లో అంతర్లీనంగా ఉండే ప్రక్రియలు, భూమిపై అవి ఎలాంటి ప్రభావం చూపుతాయనే విషయంపై సమగ్ర అధ్యయనం చేసేందుకు ఈ సమాచారం ఉపయోగపడుతుందని తెలిపింది. ఇక, లాగ్రాంజ్ పాయింట్ వద్ద చోటుచేసుకునే కరోనల్ మాస్ ఎజెక్షన్‌పై ఓ అవగాహనకు రావచ్చని వెల్లడించింది. సూర్యుడిపై అధ్యయనం కోసం ఈ ఏడాది సెప్టెంబరు 2న నింగిలోకి దూసుకెళ్లిన ‘ఆదిత్య - ఎల్ 1’ తన ప్రయాణంలో దాదాపు చివరి దశను చేరుకుంది. ఈ ఉపగ్రహాన్ని ఎల్1 పాయింట్‌లో ప్రవేశపెట్టేందుకు నిర్వహించాల్సిన విన్యాసాలు వచ్చే ఏడాది జనవరి 7వ తేదీ నాటికి పూర్తవుతాయని ఇటీవల ఇస్రో ఛైర్మన్ ఎస్.సోమనాథ్ తెలిపారు. భూమి నుంచి 15 లక్షల కి.మీ దూరంలో ఉన్న లాగ్రాంజ్ పాయింట్-1 చేరాక.. దాని కక్ష్యలో పరిభ్రమిస్తూ ఆదిత్య - ఎల్ 1 సూర్యుడిని అధ్యయనం చేస్తుంది. Also Read: రైల్వే ప్రయాణికులకు అలర్ట్.. తుపాను ఎఫెక్ట్.. 142 ట్రైన్స్ రద్దు.. కౌంటింగ్ కేంద్రాల వద్ద మూడంచెల భద్రత, 144 సెక్షన్.. #isro #aditya-l1-mission #solar-wind-ion-spectrometer #swis #solar-wind-particle-experiment మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి