Telangana MLC: గవర్నర్‌ కోటాలో 2 ఎమ్మెల్సీలు.. ఆ ఇద్దరి పేర్లు ఫైనల్ చేసిన కాంగ్రెస్?

తెలంగాణలో గవర్నర్ కోటాలో ఖాళీగా ఉన్న రెండు ఎమ్మెల్సీ స్థానాల్లో అభ్యర్థుల ఎంపికపై కాంగ్రెస్ ఫోకస్ పెట్టింది. అయితే.. అనేక మంది నేతలు పోటీలో ఉన్నా.. అద్దంకి దయాకర్, కోదండరాం పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. జీహెచ్ఎంసీ కోటాలో మైనంపల్లి హన్మంతరావు కూడా రేసులో ఉన్నారు.

New Update
Telangana MLC: గవర్నర్‌ కోటాలో 2 ఎమ్మెల్సీలు.. ఆ ఇద్దరి పేర్లు ఫైనల్ చేసిన కాంగ్రెస్?

తెలంగాణలో ఎమ్మెల్సీ పదవుల భర్తీపై కాంగ్రెస్ పార్టీ కసరత్తు చేస్తోంది. గత ఎన్నికల్లో టికెట్ దక్కని వారు, ఓటమి పాలైన ముఖ్య నేతలు ఈ టికెట్ రేసులో ఉన్నారు. జీహెచ్ఎంసీ పరిధిలో కాంగ్రెస్ పార్టీ గత ఎన్నికల్లో పెద్దగా ప్రభావం చూపలేకపోయింది. మల్కాజ్‌గిరి, సికింద్రాబాద్‌ ఎంపీ సెగ్మెంట్‌లో అసలు ఖాతా తెరవలేదు కాంగ్రెస్. దీంతో ఎంపీ ఎన్నికల నాటికి అక్కడి నేతలకు ఎమ్మెల్సీ పదవులను ఇచ్చి ఆ ప్రాంత కార్యకర్తల్లో జోష్‌ నింపాలని పార్టీ భావిస్తోంది. గ్రేటర్‌లో ఒక ఎమ్మెల్సీ ఇవ్వాలనే ఆలోచనతో కాంగ్రెస్ ఉంది. గ్రేటర్ కోటాలో మైనంపల్లికి ఎమ్మెల్సీ దక్కే అవకాశం ఉందని తెలుస్తోంది.
ఇది కూడా చదవండి: CM Revanth: పెన్షన్‌ రూ. 4వేలకు పెంపు.. రూ. 500కే గ్యాస్ సిలిండర్‌.. ఆ రోజునుంచే?

దీంతో గత ఎన్నికల్లో ఎమ్మెల్యేలుగా ఓడి పోయిన వారు.. టికెట్ రాని వారు కూడా ఎమ్మెల్సీ ఛాన్స్ కోసం ఎదురు చూస్తున్నారు. ప్రస్తుతం గవర్నర్ కోటాలో రెండు ఎమ్మెల్సీ పదవులు ఖాళీగా ఉన్నాయి. వీటిని వెంటనే భర్తీ చేసే అవకాశం ఉంది. గత ఎన్నికల్లో ఎమ్మెల్సీగా ఉండి ఎమ్మెల్యేగా ఎన్నికైన నలుగురు రాజీనామా చేయడంతో ఆ స్థానాలు కూడా భర్తీ కానున్నాయి. దీంతో మొత్తం 6 ఖాళీలు ఉన్నాయి.
ఇది కూడా చదవండి: పథకాల కోసం డబ్బులు లేవు.. సీఎం వీడియో వైరల్

గవర్నర్ కోటా ఎమ్మెల్సీ పదవి కోసం అద్దంకి దయాకర్, కోదండరాం పోటీ పడుతున్నారు. మైనంపల్లి, షబ్బీర్ అలీ, బెల్లయ్యనాయక్ పేర్లు కూడా పరిశీలనలో ఉన్నాయి. ఎమ్మెల్సీ పదవి హామీతోనే కాంగ్రెస్‌కు కోదండరాం మద్దతు ఇచ్చారన్న ప్రచారం కూడా ఉంది. పార్టీ పెద్దల మాట విని ఎమ్మెల్యేగా పోటీ చేయని అద్దంకి పేరు కూడా ముందు వరుసలో ఉంది. సీఎం ఢిల్లీ టూర్ తర్వాత ఎమ్మెల్సీలుగా ఎవరికి ఛాన్స్ ఇస్తారనే అంశం ఫైనల్ కానుంది.

Advertisment
తాజా కథనాలు