Adani Power: అదానీ చేతికి మరో పవర్ కంపెనీ? రేసు నుంచి తప్పుకున్న జిందాల్..! అదానీ పవర్ రెండు పవర్ కంపెనీలను కొనేందుకు ఉత్సాహంగా ఉంది. అయితే,ఇందులో అమర్‌కంటక్ పవర్ లిమిటెడ్ అదానీ సొంతం కావచ్చు. దీనికోసం అదానీ కంపెనీ కంటే ఎక్కువ బిడ్ వేసిన జిందాల్ ప్రస్తుతం పోటీ నుంచి తప్పుకున్నట్టు మీడియా రిపోర్ట్స్ చెబుతున్నాయి. By KVD Varma 26 Jan 2024 in బిజినెస్ ట్రెండింగ్ New Update షేర్ చేయండి Adani Power: గౌతమ్ అదానీకి మరో డీల్ కు మార్గం క్లియర్ అయింది. అదానీ గ్రూప్ కంపెనీ అదానీ పవర్ రెండు పవర్ కంపెనీలను కొనుగోలు చేసే రేసులో ఉంది. వీటిలో ల్యాంకో అమర్‌కంటక్ పవర్ లిమిటెడ్ డీల్ దాదాపు ఖరారైంది. అంతకుముందు ఈ రేసులో అదానీ పవర్, నవీన్ జిందాల్ కంపెనీ జిందాల్ పవర్ మధ్య గట్టి పోటీ ఉండేది. జిందాల్ పవర్ పక్కకు తప్పుకుంది.. జిందాల్ పవర్ కూడా గత వారం ల్యాంకో అమర్‌కంటక్ కోసం అదానీ (Adani Power)కంటే పెద్ద బిడ్‌ను వేయడం గమనార్హం. అయితే అకస్మాత్తుగా జిందాల్ పవర్ ఈ రేసు నుంచి తప్పుకుంది. జిందాల్ పవర్ ల్యాంకో అమర్‌కంటక్‌ను కొనుగోలు చేసే రేసులో లేనందున, ఇప్పుడు అదానీ పవర్‌కు మార్గం దాదాపుగా క్లియర్ అయినట్టే. నవీన్ జిందాల్ కంపెనీ నిష్క్రమణ తర్వాత, ఇప్పుడు ల్యాంకో అమర్‌కంటక్ సంభావ్య కొనుగోలుదారులలో అదానీ పవర్ కాకుండా, ముఖేష్ అంబానీ రిలయన్స్ ఇండస్ట్రీస్, పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ నేతృత్వంలోని గ్రూప్ కూడా ఉంది. ఇప్పుడు ఈ ముగ్గురూ ల్యాంకో అమర్‌కంటక్ డీల్ కోసం వేలం ప్రక్రియలో పాల్గొంటారు. ల్యాంకో అమర్‌కంటక్ ఆర్థిక సంక్షోభం ల్యాంకో అమర్‌కంటక్ పవర్ లిమిటెడ్ ప్రస్తుతం ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్న పవర్ కంపెనీ. ఇది ప్రస్తుతం కార్పొరేట్ దివాలా ప్రక్రియలో ఉంది. ల్యాంకో అమర్‌కంటక్ ప్రతిపాదిత వేలం ప్రక్రియలో పాల్గొనాలని జిందాల్ పవర్ జనవరి 12న ఆసక్తి చూపుతూ దరఖాస్తు చేసింది. దీని తర్వాత, జనవరి 16న, కంపెనీ రూ.100 కోట్ల బ్యాంక్ గ్యారెంటీతో రూ.4,203 కోట్ల ఆఫర్‌ను అందించింది. అయితే ఇప్పుడు కంపెనీ తన పేరును ఉపసంహరించుకుంది. Also Read: ఏబీవీపీ నుంచి పద్మవిభూషణ్ దాకా వెంకయ్య నాయుడి తిరుగులేని ప్రస్థానం జిందాల్ పవర్ అదానీ కంటే ఎక్కువ బిడ్ వేసింది నవంబర్ 2023లో ల్యాంకో అమర్‌కంటక్ కోసం అదానీ గ్రూప్(Adani Power) రూ. 3,650 కోట్ల ఆఫర్‌ను అందించింది, ఆ తర్వాత డిసెంబర్‌లో చివరి ఆఫర్‌గా రూ.4,100 కోట్లకు పెంచింది. దీని తర్వాత కూడా, అదానీ పవర్ ఫైనల్ ఆఫర్ కంటే జిందాల్ పవర్ ఆఫర్ ఎక్కువ. ET రిపోర్ట్స్ ప్రకారం జిందాల్ పవర్ తన బిడ్‌ను ఉపసంహరించుకోవడానికి జనవరి 23 మంగళవారం NCLTకి దరఖాస్తు చేసిందని తెలుస్తోంది. అయితే దీనిపై ఇంకా అధికారిక ప్రకటన రాలేదు. ఇతర చోట్ల కూడా జిందాల్ పోటీ ఇస్తోంది మరో డీల్‌లో కూడా జిందాల్ గ్రూప్ నుంచి అదానీ గ్రూప్ (Adani Power)పోటీని ఎదుర్కొంటోంది. అదానీ గ్రూప్ కూడా దివాలా ప్రక్రియలో ఉన్న దక్షిణ భారత IL&FS తమిళనాడు పవర్ కార్పొరేషన్ లిమిటెడ్‌పై దృష్టి సారిస్తోంది. అదానీ గ్రూప్‌కు చెందిన పవర్ కంపెనీ అదానీ పవర్ కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపింది. అయితే దీనికి కూడా జిందాల్ పవర్, వేదాంత సంస్థలు అదానీ పవర్‌కి పోటీ ఇస్తున్నాయి. Watch this interesting Video: #adani-group #zindal-group #power-plant మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి