Adani Group : తెలంగాణలో అదానీ గ్రూప్ రూ.12400 కోట్ల పెట్టుబడులు తెలంగాణలో భారీగా పెట్టుడబులు పెట్టేందుకు అదానీ గ్రూప్ ముందుకు వచ్చింది. రాష్ట్రంలో మెుత్తం రూ. 12,400 కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు రెడీ అయినట్లు తెలిసింది. బహుళ ప్రయోజనాలతో అదానీ గ్రూప్ ఈ పెట్టుబడులు పెట్టనుంది. By Madhukar Vydhyula 17 Jan 2024 in బిజినెస్ తెలంగాణ New Update షేర్ చేయండి Adani Group Investments In Telangana: తెలంగాణకు పెట్టుబడులు లక్ష్యంగా కొనసాగుతోన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) దావోస్ పర్యటనలో కీలక ఒప్పందాలు జరిగాయి. తెలంగాణలో భారీగా పెట్టుబడులుపెట్టేందుకు అదానీ గ్రూప్ (Adani Group) ముందుకు వచ్చింది. రాష్ట్రంలో మెుత్తం రూ. 12,400 కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు రెడీ అయినట్లు తెలిసింది. బహుళ ప్రయోజనాలతో అదానీ గ్రూప్ ఈ పెట్టుబడులు పెట్టనుంది. ఈ మేరకు స్విట్జర్లాండ్‌లోని దావోస్‌లో జరుగుతున్న ప్రపంచ ఆర్థిక సదస్సులో తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డితో అదానీ గ్రూప్ ఛైర్మన్ గౌతమ్ అదానీ (Gautam Adani) భేటీ అయ్యారు. రాష్ట్రంలో పెట్టుబడులపై ఇరువురూ చర్చించి నాలుగు ఎంవోయూలు కుదుర్చుకున్నారు. ఇది కూడా చదండి : FilmFare 2023: ఫిల్మ్‌ఫేర్ నామినేషన్స్ లిస్ట్ ప్రకటన…19 కేటగిరీల్లో యానిమల్ మూవీ తెలంగాణలో 12 వేల 4 వందల కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు ఈ సమావేశంలో ఒప్పందం కుదిరింది. రూ. వెయ్యి కోట్లతో డ్రోన్ సిస్టం మిస్సైల్ డెవలప్‌మెంట్ మ్యాన్‌ఫ్యాక్చరింగ్ సెంటర్‌ను అదానీ గ్రూపు ఏర్పాటు చేయనుంది.ఇక అదానీ గ్రీన్ ఎనర్జీ మీద 5 వేల కోట్లు, అదానీ కనెక్ట్ డేటా సెంటర్‌పై మరో 5 వేల కోట్ల పెట్టుబడికి ఒప్పందాలు జరిగాయి. అంబుజా సిమెంట్స్ (Ambuja Cements) తెలంగాణలో 14 వందల కోట్ల పెట్టుబడి పెట్టనుంది. అదానీ గ్రీన్ ఎనర్జీ ద్వారా 1350 మెగావాట్ల సామర్థ్యంతో తెలంగాణలో రెండు పంప్డ్ స్టోరేజీ ప్రాజెక్ట్‌ల ఏర్పాటు కోసం రూ. 5,000 కోట్లు పెట్టుబడి పెట్టనుంది. రూ. 5 వేల కోట్ల పెట్టుబడులతో చందన్‌వెల్లిలో 100 మెగావాట్ల సామర్థ్యంతో అదానీ డేటా సెంటర్లు ఏర్పాటు చేయనుంది. రూ. 1400 కోట్ల పెట్టుబడితో అంబుజా సిమెంట్స్ లిమిటెడ్ 6.0 ఎంసీటీఏ సామర్థ్యంతో సిమెంట్ గ్రైండింగ్ యూనిట్ ఏర్పాటు చేసేందుకు సిద్ధమైంది. అదానీ ఏరోస్పేస్ , డిఫెన్స్ అదానీ ఏరోస్పేస్, డిఫెన్స్ పార్క్ వద్ద కౌంటర్ డ్రోన్ సిస్టమ్స్, క్షిపణి అభివృద్ధి కేంద్రాలకు రూ. 1000 కోట్ల పెట్టుబడులు పెట్టనుంది. ఇది కూడా చదవండి :Telangana: ప్రజాభవన్ యాక్సిడెంట్ కేసులో ఊహించని ట్విస్ట్.. కొడుకుకు సహకరించిన మాజీ ఎమ్మెల్యే షకీల్.. ఆరిజన్ లైఫ్ సైన్స్ తో 2000 కోట్లకి ఒప్పందం దావోస్ పర్యటనలో (CM Revanth Davos Tour) మరో కీలక ఒప్పందం కుదిరింది. ఆరిజన్ లైఫ్ సైన్స్ తో 2000 కోట్లతో ప్రభుత్వం మరో ఒప్పందాన్ని కుదుర్చుకుంది. ఈ ఒప్పందంతో 1500 కొత్త ఉద్యోగాలను సృష్టిస్తామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ప్రపంచ మెడిసీన్ హబ్ గా ఉన్న హైదరాబాద్ లో మరిన్ని పెట్టుబడులు వస్తాయని అన్నారు. మల్లాపూర్ లో ఉన్న కంపెనీలో పెట్టుబడులు, డ్రగ్స్ డిస్కవరీ డెవలప్ మెంట్ మ్యానుఫక్చరింగ్ రంగాల్లో పెట్టుబడులు కొత్త పాలసీలకు నిదర్శనమని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. #adani-group #cm-revant-reddy #gautam-adani మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి