Hurun Rich List : ముకేశ్‌ను వెనక్కు నెట్టిన అదానీ... బిలియనీర్ల జాబితాలో 21 ఏళ్ళ కుర్రాడు

భారతదేశ బిలియనీర్ల సంఖ్య చరిత్రలో తొలిసారిగా 300 దాటింది. ‘హురున్ ఇండియా రిచ్ లిస్ట్ 2024’ విడుదల చేసిన లిస్ట్ ప్రకారం ప్రస్తుతం 334 మంది బిలియనీర్లు ఉన్నట్లు తేలింది.ఇందులో ఎప్పుడూ మొదటి ప్లేస్‌లో ఉండే ముకేష్ అంబానీని వెనక్కి నెట్టి అదానీ ఫస్ట్ ప్లేస్‌లోకి వచ్చేశారు.

New Update
Hurun Rich List : ముకేశ్‌ను వెనక్కు నెట్టిన అదానీ... బిలియనీర్ల జాబితాలో 21 ఏళ్ళ కుర్రాడు

Adani Frist, Ambani Second In Hurun Rich List : దేశంలో దాదాపు 1,500 మందికి పైగా ₹1,000 కోట్లు లేదా అంతకంటే ఎక్కువ సంపద కలిగి ఉన్నారని హురూన్ ఇండియా చెబుతోంది. గత ఏడు సంవత్సరాల్లో 150% సంపద పెరగగా ఇండియా మొత్తంలో 1,539 మంది అతి సంపన్నలున్నారు. గత సంవత్సరం 220 ఉండగా రికార్డు స్థాయిలో ఈ యేడాది 272 మంది కొత్తగా సంపన్నులయ్యారు. భారత్‌లో ప్రతి 5 రోజులకు ఒక బిలియనీర్ తయారైనట్లు హురూన్ చెప్పింది. హురున్ ఇండియా రిచ్ లిస్ట్‌లోని వ్యక్తుల సంపద ఇప్పుడు ₹159 లక్షల కోట్లకు చేరుకుంది. అయితే ఈ లిస్ట్‌లో ఎంతమంది కొత్తగా యాడ్ అయినా మొదటి రెండు స్థానాలు మాత్రం ఎప్పటికీ ముకేశ్ అంబానీ, అదానీలవే. వీరిద్దరూ మొదటి స్థానం కోసం ఎప్పుడూ పోటీ పడుతూ ఉంటారు. ఒకసారి ముకేశ్ ఉంటే..మరో సారి అదానీ ఉంటారు. ఈసారి హురూన్ విడుదల చేసిన లిస్ట్‌లో ముకేశ్‌ను వెనక్కు నెట్టేసి అదానీ మొదటి స్థానానికి ఎగబాకేశారు. రూ.11.61 లక్షల కోట్ల సంపదతో అదానీ అగ్రస్థానంలో నిలవగా.. రూ.10.14 లక్షల కోట్లతో అంబానీ రెండో స్థానంలో నిలిచారు.

21 ఏళ్ళ బిలియనీర్..

హురూన్ ఇచ్చిన బిలియనీర్ల జాబితాలో 21 ఏళ్ళ కైవల్య ఓహ్రా కూడా చోటు సంపాదించుకున్నాడు. ఇతను జెప్టో కు సహా వ్యవస్థాపకుడు. ప్రస్తుతం ఉన్న బిలయనీర్ లిస్ట్‌లో ఇతనే అందరి కంటే చిన్న వయస్కుడు. రూ.3,600 కోట్లతో కైవల్య అగ్రస్థానంలో నిలవగా.. మరో సహ వ్యవస్థాపకుడు 22 ఏళ్ల అదిత్‌ పాలిచా రెండో స్థానంలో ఉన్నారు. వీరిద్దరూ స్టాన్‌ఫోర్ట్ యూనివర్శిటీ విద్యార్ధులు. కంప్యూటర్ సైన్స్ చదువుతూ దాన్ని మధ్యలో ఆపేసి క్విక్ కామర్స్ వ్యాపారం మొదలుపెట్టారు. కోవిడ్ టైమ్‌లో ఈ కామర్స్‌ కు పెరిగిన డిమాండ్‌ను దృష్టిలో పెట్టుకుని 2021లో జెప్టోని ప్రారంభించారు. చాలా తక్కువ సమయంలోనే జెప్టో దేశ వ్యాప్తంగా విపరీతంగా విస్తరించింది. అమెజాన్, స్విగ్గీ, జొమాటో, బ్లింకిట్ లాంటి వాటికి జెప్టో గట్టి పోటీని ఇస్తోంది. ఆర్డర్ చేసిన కొద్ది ఇమిషాల్లోనే డెలవరీ చేయడం వీరి ప్రత్యేకత.

రిచ్ ఇండియా లిస్ట్‌లో కైవ్య ఓహ్రా స్థానం సంపాదించడం ఇది రెండవ సారి. 19 ఏళ్ళ వయసులో 2022లో ఓహ్రా మొదటి సారి ఇందులో స్థానం సంపాదించుకున్నాడు. అప్పటి నుంచి తన హవాను కొనసాగిస్తూ వస్తున్నాడు. ఇక హురూన్ రిచ్ లిస్ట్‌లో షారూఖ్‌ ఖన్, అమితాబ్ బచ్చన్, హృతిక్ రోషన్, కరణ్ జోహార్, జుహీ చావ్లాలు టాప్ 5లో నిలిచారు.

Also Read: Kolkata: మూడుసార్లు ఫోన్లు..మూడు రకాల సమాధానాలు..ఆర్జీకర్ ఆసుపత్రి తీరులో అనుమానాలు

Advertisment
తాజా కథనాలు