Adani: దూసుకుపోయిన అదానీ గ్రూప్ షేర్లు.. హిండెన్స్ బర్గ్ ఆరోపణ సరికాదన్న అమెరికా ఏజెన్సీ

అదానీ పోర్ట్‌ అవకవతకలకు పాల్పడుతోందన్న హిండేన్‌ బర్గ్‌ రీసెర్చ్‌ ఆరోపణలను అమెరికా ఏజెన్సీ వ్యతిరేకించడంతో అదానీ గ్రూప్‌ పరుగులు పెట్టింది. దేశీయ స్టాక్‌ మార్కెట్‌లో మంగళవారం ఆ గ్రూప్‌ షేర్ల విలువ 20శాతం మేర దూసుకుపోయింది.

New Update
Adani: దూసుకుపోయిన అదానీ గ్రూప్ షేర్లు.. హిండెన్స్ బర్గ్ ఆరోపణ సరికాదన్న అమెరికా ఏజెన్సీ

Adani: అదానీ పోర్ట్‌ అవకవతకలకు పాల్పడుతోందన్న హిండేన్‌ బర్గ్‌ రీసెర్చ్‌ ఆరోపణలను అమెరికా ఏజెన్సీ వ్యతిరేకించడంతో అదానీ గ్రూప్‌ పరుగులు పెట్టింది. దేశీయ స్టాక్‌ మార్కెట్‌లో మంగళవారం ఆ గ్రూప్‌ షేర్ల విలువ 20శాతం మేర దూసుకుపోయింది. మొత్తంగా అదానీ గ్రూప్‌ కంపెనీల విలువ రూ.14 లక్షల కోట్లను దాటింది.

శ్రీలంకలో నిర్మించే కంటైనర్‌ టెర్మినల్‌ నిర్మాణానికి 553 మిలియన్ల రుణాల్ని మంజూరు చేయాల్సి ఉన్న నేపథ్యంలో అమెరికాకు చెందిన ఇంటర్నేషనల్‌ డెవలప్‌మెంట్‌ ఫినాన్స్‌ కార్పొరేషన్‌ అదానీ గ్రూపుపై హిండేన్‌ బర్గ్‌ చేస్తున్న ఆరోపణలపై విచారణ జరిపింది. కంటైనర్‌ టెర్మినల్‌లో అదాని గ్రూప్‌ కార్పొరేట్‌ మోసాలకు పాల్పడలేదని వారు దర్యాప్తులో గుర్తించి ఓ నివేదిక విడుదల చేసింది.

ఇది కూడా చదవండి: పాండ్యా కోసం బీసీసీఐ స్పెషల్ ప్లాన్!.. వరల్డ్ కప్ లోగా టీంలోకి తిరిగొస్తాడా?

ఈ పరిణామంతో అదానీ గ్రూప్‌ షేర్లు ఓ రేంజ్‌లో పెరిగాయి. నేషనల్‌ స్టాక్‌ ఎక్ఛేంజ్‌లో అదానీ ఎంటర్‌ ప్రైజెస్‌ లిమిటెడ్‌ షేర‍్ల విలువ 10 శాతం పెరిగి రూ.2,784కు చేరింది. అదానీ గ్రూన్‌ ఎనర్జీ షేర్లు 17 శాతం, అదానీ పోర్ట్స్‌ అండ్‌ స్పెషల్ ఎకనమిక్‌ జోన్‌ లిమిటెడ్‌ 9 శాతం, అదానీ ఎనర్జీ సొల్యూషన్స్‌ 10 శాతం, అదానీ టోటల్‌ గ్యాస్‌ 7శాతం, అదానీ పవర్‌ 7శాతం, అదానీ విల్మర్‌ 5శాతం, అంబుజా సిమెంట్స్‌ 5శాతం, ఏసీసీ 6శాతం, ఎన్డీటీవీ 7శాతం లాభపడ్డాయి.

Advertisment
Advertisment
తాజా కథనాలు